Friday, July 26, 2024
HomeఇతరములుSignificance of Raksha Bandhan | రక్షా బంధన్ యొక్క ప్రాముఖ్యత

Significance of Raksha Bandhan | రక్షా బంధన్ యొక్క ప్రాముఖ్యత

 

Raksha Bandhan : ఈ వ్యాసంలో Raksha Bandhan పండుగ ఈ ఏడాది ఎప్పుడు అనే విషయంలో చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో రాఖీ పండుగ 30వ తేదీ వచ్చిందా లేదా 31వ తేదీనా అనే విషయాలతో పాటు రాఖీ పౌర్ణమి గురించి కూడా తెలుసుకుందాం.

 

Raksha Bandhan

     ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి మరియు  Raksha Bandhan లేదా రాఖీ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. బంధ్యాలు ధరించే వారందరూ ఈ రోజున నూతన జంధ్యాలను ధరిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతం ధరించి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. కాలక్రమంలో ఈ రోజు Raksha Bandhan గా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి నాడు, అన్నా చెల్లెల్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికి గాని ప్రేమకు గుర్తుగా సోదరి కట్టే పట్టీని రాఖీ అంటారు. ఈ రాక్షబంధనము భార్య-భర్తకు, సోదరి-సోదరునకు, యుద్దానికి వెళ్ళే వీరులకు విజయప్రాప్తి కోసం ఈ రాక్షబంధానని కడుతూ ఉంటారు.

Significance-of-Raksha-Bandhan-tp-01
                                                                                            రాఖీ

రాఖీ కట్టే విధానం

        రాఖీపౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా సోదరుడికి గంధం, కుంకుమ పెట్టాలి. తలపై అక్షింతలు వేయడం ఆనవాయితి. రాఖీ కట్టే ముందు

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః |

తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల ||

(భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను)

     అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదీస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరీ హారతి ఇస్తుంది. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు.

Significance-of-Raksha-Bandhan-tp-02
                                                                   సోదరుడికి బొట్టు పెడుతున్న సోదరి

రాఖీ ఎప్పుడు కట్టాలంటే

     ఈ సారి భద్ర కాలం కారణంగా,  Raksha Bandhan తేదీల గురించి గందరగోళం ఏర్పడింది. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి అంటే పౌర్ణమి తిథి ప్రకారం ఆగస్టు 30వ తేదీ రాత్రి 09:01 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31వ తేదీ ఉదయం 7:05 గంటలకు ముగియనుంది. ఇదే సమయంలో పూర్ణిమతో పాటు భద్ర తిథి కూడా ఉండనుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రాఖీ పండుగను భద్ర కాలంలో జరుపుకోవచ్చు. అంటే ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6:43 గంటల నుండి 9:01 గంటల మధ్యలో మీ సోదరులకు రాఖీ కట్టొచ్చు.

Significance-of-Raksha-Bandhan-tp-03
                                                                       సోదరుడికి రక్షా బంధన్‌ కడుతున్న సోదరి

సూర్యోదయానికి ముందు

     పౌర్ణమి తిథి ఆగస్ట్ 31వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజంతా సోదర సోదరీమణులు Raksha Bandhan పండుగను జరుపుకోవచ్చు.

Significance-of-Raksha-Bandhan-tp-04
                                                                     సోదరుడికి హారతి ఇస్తున్న సోదరి

భద్ర పౌర్ణమి అంటే

     పురాణాల ప్రకారం సూర్య దేవుని కుమార్తె భద్ర, అంటే శని దేవునికి సోదరి. శని స్వరూపం కఠినంగా ఉంటుందని, అలాగే భద్ర కూడా కాస్త కఠినంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వీరి ప్రభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మా తన పంచాంగంలో విష్టి కరణం స్థానం కల్పించాడు. వాస్తవానికి భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. అందరి పనులను అడ్డుకోవడం ప్రారంభించింది.

also read  Money Rules the World | ప్రపంచాన్ని శాసించేది డబ్బే

శుభకార్యాలు వాయిదా

     బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి, 7వ కరణ విష్టిగా కరణాలలో చోటు కల్పించాడు. భద్ర మూడు లోకాలలో ఉంటానని చెబుతుంది. తను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూనే ఉంటుంది. భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి సరిగా జరగవు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. దీనికి కారణం ఆ సమయంలో ఏమి చేసిన ఫలితం నిరాశజనకంగానే వస్తుందని చాలా మంది నమ్ముతారు.

Significance-of-Raksha-Bandhan-tp-05
                                                                                స్వీట్లు తినడం 

ప్రత్యేక పరిస్థితుల్లో

     ఈ సందర్భంగా Raksha Bandhan పండుగ రోజున భద్ర కాలం వచ్చింది. అందుకే భద్ర పౌర్ణమి ఉన్న సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఆగస్ట్ 30వ తేదీ సాయంత్రం 6:43 గంటల నుండి  9:01 గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవచ్చు.

Significance-of-Raksha-Bandhan-tp-06
                                                                        బహుమతులు ఇవ్వడం

రాఖీపౌర్ణమి చరిత్ర

     పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడు అయినాడు, తన పరివారం అందరితో కలిసి అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి (శచీదేవి) తరుణోపాయం ఆలోచిస్తుండగా, ఆ రాక్షసరాజు అమరావతిని కూడా దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఆ రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకు వచ్చి దేవేంద్రుడి కట్టి యుద్ధానికి పంపుతారు. యుద్దంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైంది. 

ద్రౌపది – శ్రీకృష్ణుని బంధం

     పురాణాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధం. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలు నుండి రక్తం కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్ఛాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడాడు.

Significance-of-Raksha-Bandhan-tp-07
                                                                    కృష్ణునికి రక్షాబంధన్ కడుతున్న ద్రౌపది

శ్రీ మహావిష్ణువు – బలిచక్రవర్తి

     శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉంటాడు. శ్రీమహాలక్ష్మి పాతాళానికి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనాని కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. 

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

     చరిత్రల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే కోరికతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (ఆఫ్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఈ వివాహ సంబంధంతో మధ్య ఆసియా దేశాలను, అందులోనూ ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు.

     పురుషోత్తముడి శత్రురాజు అయిన అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.

also read  Significance of Akshaya Tritiya | అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటి? ఎలా జరుపుకోవాలి?

హయగ్రీవావతారం

     పూర్వం హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దుర్గదేవిని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దుర్గదేవి ప్రత్యక్షమైనది తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరాడు హయగ్రీవుడు  అయితే అది సాధ్యపడదని చెప్పినప్పుడు, హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు.

Significance-of-Raksha-Bandhan-tp-08
                                                                               హయగ్రీవుడు

విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకి బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కారణంగా  అగ్రభాగాన నిద్రపోతాడు. విష్ణువుని నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. దేవతలంతా ఓ ఆలోచన చేసి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న వింటేను కొరకమని చెప్పారు. ఆవిధంగా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలింది. ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి పడింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దుర్గదేవిని గురించి తపస్సు చేశాడు. దుర్గాదేవి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వస్తుంది. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ, ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సంహరిస్తాడు. దుర్గదేవి శక్తి మహిమను మరియు  మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular