Srirama Navami : రాముడి జన్మదినం అయిన చైత్ర మాసం శుద్ధ నవమి రోజు మనం Srirama Navami ఘనంగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా శ్రీ రామునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజునే ఆలయాలలో సీతారాములకు కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.
దశరథుడు కౌసల్య జరిపిన పుత్ర కామేష్టి యాగం ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో రామావతారం ఒకటి. రావణుడిని సంహరించి ధర్మాన్ని రక్షించడానికి రాముడు జన్మించాడు. దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరామచంద్రునిది. మానవుడు ఏవిధంగా ఉండాలి అని, ఎటువంటి ధర్మాలను పాటించాలి, బంధాలను ఎలా గౌరవించాలి మరియు ఏవిధంగా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు.
వసంతరుతువులోని చైత్రమాసం శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మిట్ట మధాహ్నం 12 గంటల ప్రాతంలో లోకాభి రాముడైన శ్రీరాముడు జన్మిచాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఇదే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం చేసిన తర్వాత, ఇదే ముహూర్తంలో సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. దానిని పురస్కరించుకొని మనం Srirama Navami పండుగను నిర్వహించుకుంటాం. ఇదే రోజున సీతారాముల వివాహం జరిగింది కాబట్టి ప్రతీ ఏటా ఇదే రోజున వీరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతుంటారు.
చాలా మంది ఇంట్లో సీతారామ కల్యాణం చేస్తారు. ఆలయాల్లో సీతారాములకు కల్యాణం చేసి, ఉత్సవ మూర్తులను తీరు వీధులలో ఊరేగిస్తారు. సీతారాముల కల్యాణం చూడటం గానీ, జరిపించడం గానీ చేస్తే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది అని ప్రజలు భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. Srirama Navami రోజున సీతారామ కల్యాణం చేయించిన లేక కల్యాణంలో పాల్గోన్న సకల శుభాలు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో రాముని పూజించి అరటిపండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములవారి ప్రసాదం స్వీకరిస్తారు.
Srirama Navami పూజ చేసే విధానం
ఉదయం 5 గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరము, గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. ఇంటి ముందు ముగ్గులతో అలంకరించాలి. శ్రీరాముడు రాజు కాబట్టి సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులతో పాటు హనుమంతుడు ఉన్న పటము లేదా శ్రీరాముని విగ్రహాన్ని గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టాలి. సన్నజాజి, తామర పువ్వులు పూజకి వాడాలి. పానకం, వడపప్పు, శీనికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు రెండు దీపారాధనలు చేయాలి, ఇందులో ఐదు వత్తులు ఉపయోగించాలి. శ్రీరామ అష్టోత్తరము మరియు శ్రీరామ పట్టాభిషేకం పారాయణ చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.
శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి.
Srirama Navami వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. హిందువుల పండుగలలో చేసే ప్రసాదాలన్నీ కాలానికి తగ్గట్లుగా ఉండి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. వడపప్పు – పానకం కూడా ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివి. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో వాడే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా చేస్తాయి. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’ పప్పు అంటారు. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. కొన్ని ప్రాంతాలలో పానకంతో పాటుగా మజ్జిగ కూడా స్వామి వారికి నివేదన చేస్తారు.
శ్రీరామ నామ ప్రశస్తం:
‘రామ’ అనగా రమించుట అని అర్ధం. కావున మనం ఎల్లప్పుడు మన హృదయంలో ఉన్న ఆ ‘శ్రీరాముని’ తెలుసుకోవాలి.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంకి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు.
శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
విష్ణు సహస్రనామ, శివసహస్రనామ స్తోత్రం ఒకసారి పారాయణం చేస్తే వచ్చే ఫలితం పై శ్లోకం 3 సార్లు స్మరిస్తే వచ్చే ఫలితంకి సమానం. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.