Friday, July 26, 2024
Homeఆధ్యాత్మికం16 Somavarala Vratham Pooja Vidhanam | 16 సోమవారాల వ్రతం, పూజ విధానం

16 Somavarala Vratham Pooja Vidhanam | 16 సోమవారాల వ్రతం, పూజ విధానం

16 Somavarala Vratham : 

16 Somavarala Vratham కి కావాల్సిన వస్తువులు

 

    దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట,అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.

16-Somavarala-Vratham

మార్జనముమార్జనము

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)

 

గణపతిగణపతి ప్రార్దన

(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
 

ఆచమనము

  1. ఓం కేశవాయ స్వాహా
  2. ఓం నారాయణాయ స్వాహా
  3. ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)

స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.

  1. ఓం గోవిందాయ నమః
  2. ఓం విష్ణవే నమః
  3. ఓం మధుసూదనాయ నమః
  4. ఓం త్రివిక్రమాయ నమః
  5. ఓం వామనాయ నమః
  6. ఓం శ్రీధరాయ నమః
  7. ఓం హృషీకేశాయ నమః
  8. ఓం పద్మనాభాయ నమః
  9. ఓం దామోదరాయ నమః
  10. ఓం సంకర్షణాయ నమః
  11. ఓం వాసుదేవాయ నమః
  12. ఓం ప్రద్యుమ్నాయ నమః
  13. ఓం అనిరుద్ధాయ నమః
  14. ఓం పురుషోత్తమాయ నమః
  15. ఓం అధోక్షజాయ నమః
  16. ఓం నారసింహాయ నమః
  17. ఓం అచ్యుతాయ నమః
  18. ఓం జనార్ధనాయ నమః
  19. ఓం ఉపేంద్రాయ నమః
  20. ఓం హరయే నమః
  21. ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

( కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి  ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)

ప్రాణాయామముప్రాణాయామము

పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ శంకరం
(ప్రాణాయామం చేయండి)

 

సంకల్పము

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గో సంరక్షనార్ధం, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాం ఉద్దిశ్య షోడశ సోమవార వ్రత కల్పోక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

( కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి ) 

ఘంటా నాదంఘంటా నాదం చేస్తూ

(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్

 

కలశారాధనకలశారాధన

కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
                            గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
                            నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు

(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, పువ్వుతో నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)  

గణపతి పూజ

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః

ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే

  1. శ్రీ మహాగణపతయే నమః – ధ్యాయామి
  2. శ్రీ మహాగణపతయే నమః – ఆవాహయామి
  3. శ్రీ మహాగణపతయే నమః – ఆసనం సమర్పయామి
  4. శ్రీ మహాగణపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి
  5. శ్రీ మహాగణపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
  6. శ్రీ మహాగణపతయే నమః – ఆచమనీయం సమర్పయామి
  7. శ్రీ మహాగణపతయే నమః – స్నానం సమర్పయామి
  8. శ్రీ మహాగణపతయే నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి
  9. శ్రీ మహాగణపతయే నమః – యజ్ఞోపవీతం సమర్పయామి
  10. శ్రీ మహాగణపతయే నమః – గంధం సమర్పయామి
  11. శ్రీ మహాగణపతయే నమః – పుష్పాణి సమర్పయామి
  12. శ్రీ మహాగణపతయే నమః – ధూపమాఘ్రాపయామి
  13. శ్రీ మహాగణపతయే నమః – దీపం దర్శయామి
  14. శ్రీ మహాగణపతయే నమః – నైవేద్యం సమర్పయామి

(సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు అమృతోపస్తర ణమసి (ప్రాణాయ స్వాహా – అపానాయ స్వాహా – వ్యానాయ స్వాహా – ఉదానాయ స్వాహా – సమానాయ స్వాహా)

  1. శ్రీ మహాగణపతయే నమః – తాంబూలం సమర్పయామి
  2. శ్రీ మహాగణపతయే నమః – నీరాజనం సమర్పయామి
  3. శ్రీ మహాగణపతయే నమః – మంత్ర పుష్పం, నమస్కారం సమర్పయామి
also read  Ekadasi Vratha Kathalu | ఏకాదశి వ్రత కథలు

అనయా, యథా శక్తి పూజాయచ – శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు, శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృణ్హామి 

 

శివ షోడశోపచార పూజ 

ధ్యానం

శ్లోకం

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భాక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)

ఆవాహనం

శ్లోకం

ఆగఛ్ఛ దేవదేవేశ మర్త్యలోక హితేఛ్ఛయా
క్రియమాణాం మయా పూజాం గృహాణ సురసత్తమ

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి
(అక్షింతలు సమర్పించవలెను)

ఆసనం

శ్లోకం

నానా రత్నసమాయుక్తం హేమపత్ర ప్రభామయం
ఆసనం త్వం గృహాణేశ దేవేశ! అగజపతే

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం మమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)

పాద్యం

శ్లోకం

గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం,
పాద్యం త్వం ప్రతి గృహ్ణీష్వ దేవదేవ నమోస్తుతే

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)

ఆచమనీయం

శ్లోకం

కుసుమాక్షత సంమిశ్రం ప్రసన్నాంబు పరిప్లుతం
ఆచమ్యతాం సురశ్రేష్ట భూతేశ కరుణా నిధే

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)

పంచామృత స్నానం

శ్లోకం

పయో దధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతం
పంచామృతేన స్నపనం క్రియతాం పరమేశ్వర

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః పంచామృత స్నానం సమర్పయామి
(జలం సమర్పించవలెను)

శుద్ధోదక స్నానం

శ్లోకం

గంగాది సర్వ తీర్థేభ్యః తోయమేతత్సు నిర్మలం
అనీతం తు మయా దేవ స్నానార్థం ప్రతిగృహ్యతామ్

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)

వస్త్రం

శ్లోకం

గ్రధితాం నవరత్నెశ్చమేఖలాం త్రిగుణీకృతాం
అర్పయామి మహాదేవ గృహాణ మహతాం వర

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)

యజ్ఞోపవీతం

శ్లోకం

వేదమంత్రైః సమాయుక్తం బ్రహ్మవిష్ణు శివాత్మకం
ఉపవీతం ప్రయఛ్ఛామి గృహాణ త్వం సదాశివ

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)

గంధం

శ్లోకం

దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం
సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః గంధ సమర్పయామి (ధారయామి)
(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)

పుష్పం

శ్లోకం

మాల్యాదీని సుసంధీని మాలత్యాదీవి వై ప్రభో
మాయా హృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి

(పుష్పాలు సమర్పించవలెను)

 

అంగపూజ

శివాయ నమః                – పాదౌ పూజయామి
శర్వాయ నమః               – గుల్ఫౌ పూజయామి
రుద్రాయ నమః               – జానునీ పూజయామి
ఈశానాయ నమః            – జంఘే పూజయామి
పరమాత్మనే నమః            – ఊరూం పూజయామి
హరాయ నమః               – జఘనం పూజయామి
ఈశ్వరాయ నమః            – గుహ్యం పూజయామి
స్వర్ణ రేతసే నమః             – కటిం పూజయామి
మహేశ్వరాయ నమః        – నాభిం పూజయామి
పరమేశ్వరాయ నమః       – ఉదరం పూజయామి
స్పటికాభారణాయ నమః   – వక్షస్థలం పూజయామి
త్రిపుర హంత్రే నమః        – బాహున్ పూజయామి
సర్వాస్త్ర ధారిణే నమః       – హస్తాన్ పూజయామి
నీల కంఠాయ నమః        – కంఠం పూజయామి
వాచస్పతయే నమః         – ముఖం పూజయామి
త్రయంబకాయ నమః      – నేత్రాణి పూజాయామి
ఫాల చంద్రాయ నమః     – లలాటం పూజయామి
గంగా ధరాయ నమః      – జటామండలం పూజయామి
సదాశివాయ నమః         – శిరః పూజయామి
సర్వేశ్వరాయ నమః        – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి

 

Shiva Ashtottara Shatanamavali | శివ అష్టోత్తరశతనామావళి చదవాలి

 

ధూపం

also read  Sankatahara Chaturthi Vratha Katha | సంకటహర చతుర్థి వ్రత కథ

శ్లోకం

వనస్పతి రసైర్ దివ్యైః నానా గంధైః సుసంయుతం,
అఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ధూపం అఘ్రాపయామి
(ధూపం చూపించాలి)

దీపం

శ్లోకం

సాజ్యం తివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)

నైవేద్యం

శ్లోకం

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు
శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిమ్

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి
(జలం సమర్పిస్తూ చదవాలి)

సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)
అమృతమస్తు అమృతోపస్తరణమసి

ఓం ప్రాణాయ స్వాహా – ఓం  అపానాయ స్వాహా – ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా

(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను )
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి
పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

శ్లోకం

పూగీఫలైస్సకర్పూరైః నాగావల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)

నీరాజనం

కర్పూర గౌరం కరుణావతారం సంసార తారం భుజగేంద్ర హారం
సదా వసంతం హృదయార విందే సదాశివం దేవవరం నమామి

శ్లోకం

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం
మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)

మంత్రపుష్పం – నమస్కారం 

(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)

శ్లోకం

మహా దేవ నమస్తేస్తు మన్మధారే నమోస్తుతే
అమృతేశ నమస్తుభ్యం ఆశ్రితార్ధ ప్రదాయినే

ఉపచారం

శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

క్షమా ప్రార్ధన – స్వస్తి

(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసంవా అపరాధమ్
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో

అనయా యధా శక్తి పూజయాచ  భగవాన్ సర్వాత్మకః

శ్రీ ఉమమహేశ్వరా దేవతా సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు

నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీ వరమేశ్వరౌ ||

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు

కలే వర్షతు పర్జన్యః  పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః
అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః
అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం

అర్ఘ్య ప్రదానమ్

  1. నమః శివాయ సాంబాయ సర్వపావహరాయ చ
    శివదేవ మయాదత్తం ఇదం అర్ఘ్యం గృహాణ భో
    సదాశివాయ నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి
  2. మయాకృతాన్యశేషాని పాపాని నుద శంకర
    మహాదేవ! మయాదత్తం ఇదం అర్ఘ్యం గృహాణ భో
    సదాశివాయ నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి
  3. వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మన్ వ్యోమరూపిణే
    నక్షత్రమాలినే దేవ ఇదం అర్ఘ్యం గృహాణ భో
    సదాశివాయ నమః తృతీయార్ఘ్యం సమర్పయామి
  4. అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి
    గృహాణార్థ్యం మయాదత్తం సుప్రీతావరదాభవ
    అంబికాయై నమః అర్ఘ్యం సమర్పయామి
  5. శ్రీ గణేశ నమస్తుభ్యం సర్వ సిద్ధి ప్రదాయక
    క్షిప్ర ప్రసాదితో దేవ గృహాణార్థ్యం నమోస్తుతే
    గణేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి
  6. సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ
    గృహాణార్థ్యమిదం దత్తం సుప్రీతో వరదోభవ
    సుబ్రహ్మణ్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి
  7. నందికేశ మహాభాగ శివధ్యాన పారాయణ
    గృహాణార్థ్యమిదం దత్తం నందికేశ నమోస్తుతే
    నందికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి
  8. చండికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి

 

సదాచార పరులైన భక్తులకి వాయన దానం 

సాంబశివ స్వరూపస్య బ్రాహ్మణస్య ఇదమాసనం, అమీతే గంధాః
(ఈ క్రింది మంత్రం తో తాంబూలం దక్షిణ ఇవ్వండి)

హిరణ్యగర్భ గర్భస్తం హేమబీజం విభావసోః
అనంత పుణ్య ఫలితం అతః శాంతిం ప్రయచ్చమే

 

ఇదముపాయనం సదక్షిణాకం సతాంబూలం సాంబశివప్రీతం కమమానః తుభ్యమహం సంప్రతతే న మమ

 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు

 

16 సోమవారాల వ్రత కథను చూడండి

(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)

మరిన్ని పూజావిధానాలు మరియు వ్రతములు చూడండి. 

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular