Ekadasi Vratha Kathalu : మానవులు కలియుగంలో యజ్ఞ యాగాది కర్మలు ఆచరించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారి కష్టములు తొలగి సుఖసౌఖ్యలను పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ముఖ్యమైన వ్రతము. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతము గురించి ధర్మరాజుకు అరణ్యవాసములో భోదించాడు.
అంబరీశుడి కథ
అంబరీషుడు నాబాగుని కుమారుడు. ఒక పర్యాయం, శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి, ఆఖరి ఏకాదశీ వ్రతం పూర్తయ్యాకా మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి, ద్వాదశి పారణ చేయడానికిముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్య బోతుండగా దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకూ తిరిగి రాడు. ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి, ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడంకోసం భుజించక పోతే వ్రత భంగం జరుగుతుంది, భుజిస్తే అతిథిని భంగ పరచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు, సమారాధన చేసి, తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి, దీక్షా విరమణ చేస్తాడు.
అప్పుడు దూర్వాసుడు నదీస్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై, తన జతలలో ఒక దానిని విడిచి పెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి, దూర్వాసుడి మీదకు వెడుతుంది, బ్రహ్మ, శివుడు కూడా దూర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మనీ అంటాడు. అప్పుడు గతి లేక దూర్వాసుడి అబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది.
ఏకాదశీ వ్రతం చేసిన వారిని, శీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం.
రుక్మాంగదుడి కథ
పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటికి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్ణుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు.
also read : Sri Venkateswara Swami Sapta Shanivarala Vratha Katha | శ్రీ వేంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథ
రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకుని చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు. చంద్రామానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓ పర్వదినమనే చెప్పొచ్చు. ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించినవారికి ఇహ పరాలు రెండూ కరతలామలకం.