శ్రీకృష్ణ షోడశోపచార పూజ ( Sri Krishna Shodashopachara Pooja ) ప్రతి రోజు నిత్య పూజగా లేదా కృష్ణాష్టమి రోజు ఈ పూజను చేయవచ్చు. Sri Krishna Shodashopachara Pooja
Sri Krishna Shodashopachara Pooja
Sri Krishna Shodashopachara Pooja కి కావాల్సిన వస్తువులు
దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.
మార్జనము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)
గణపతి ప్రార్దన
(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరం పరాం
దీపారాధన
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే
ఆచమనము
1. ఓం కేశవాయ స్వాహా
2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి,
తర్వాత చెయ్యి కడుగుకోవాలి)
స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.
4. ఓం గోవిందాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః
(కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కనఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
(ప్రాణాయామం చేయండి)
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా రుక్మిణీ సత్యభామా సామెత శ్రీకృష్ణ దేవతా ప్రీత్యర్ధం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గో సంరక్షణార్ధం రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ దేవతా ఉద్దిశ్య, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!
ఘంటా నాదం చేస్తూ
(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)
గణపతిపూజ
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణాధిపతి ప్రార్ధనాం కరిష్యే
Sri Krishna Shodashopachara Pooja
ధ్యానం
శ్లోకం
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమమ్బుదశ్యామమాయతాక్షమలంకృతమ్
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆవాహనం
శ్లోకం
జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థం, ఓంకారాఖ్యం
యోగిహృద్ధ్యాన గమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్త
సేవ్యం, సర్వాకారం శ్రీ విష్ణుమావాహయామి
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆవాహయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆసనం
శ్లోకం
కల్పద్రుమూలే మణివేది మధ్యే, సింహాసనం స్వర్ణమయం సురత్నం
విచిత్ర వస్త్రావృత మచ్యుత ప్రభో, గృహాణ లక్ష్మీ ధరణీ సమన్విత
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పాద్యం
శ్లోకం
గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం,
పాద్యం త్వం ప్రతి గృహ్ణీష్వ దేవదేవ నమోస్తుతే
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
అర్ఘ్యం
శ్లోకం
ధర్మ స్వరూప ధర్మజ్ఞ తులసీదామ భూషణ,
కంబుగ్రీవ మయాదత్తం గృహణార్ఘ్యం నమోస్తుతే
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
ఆచమనీయం
శ్లోకం
కర్పూర వాసితం తోయం సువర్ణ కలశ స్థితం,
దదామ్యాచమనం భక్త్యా దేవదేవ నమోస్తుతే
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
శుద్ధోదక స్నానం
శ్లోకం
తీర్ణోదకైః కాంచన కుంభ సంస్థితైః, సువాసితైః
దివ్య సమంత్ర పూతైః మయార్పితం స్నానమిదం
గృహాణ, పాదాబ్జ నిష్ట్యూత నదీ ప్రవాహః
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
వస్త్రం
శ్లోకం
స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం, కౌశేయయుగ్మం
పరికల్పింతం మయా దామోదర ప్రావరణం గృహాణ, మాయాచల ప్రాకృత దివ్యరూప
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః నూతన వస్త్రయుగ్మం
సమర్పయామి సమర్పయామి వస్త్రయుగ్మ ధారణానంతరం
ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)
యజ్ఞోపవీతం
శ్లోకం
సువర్ణ తంత్రోద్భవ యజ్ఞ సూత్రం, ముక్తాఫలం
స్యూతం అనేక రత్నం గృహాణ తత్వద్
కృతముత్తరీయం, స్వకర్మ సూత్రం ధరతే నమోస్తు
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
గంధం
శ్లోకం
కస్తూరికా చందన కర్దమాని కాశ్మీర సంయోజిత గంధసారైః
విలేపనం స్వీకురు దేవదేవ, శ్రీభూమి వక్షోజ విలేపనార్హం
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః గంధ సమర్పయామి
(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)
పుష్పాభరణం
శ్లోకం
చామంతికా వకుళ చంపక పాటలాబ్జ, పున్నాగ
జాజి కరవీర రసాల పుష్పెః బిల్వ ప్రవాళ తులసీదళ
మల్లికాంభిః త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ
ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని సుపల్లవాని
సువర్ణ పుష్పాణి మయార్పితాని గృహాణ శ్రీవత్సధర ప్రసీద
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః పుష్పాణి సమర్పయామి
శ్లోకం
కేయూర కటకేచైవ హస్తే చిత్రాంగుళీయకం
మాణిక్యోల్లాసి మకుటం కుండలే హార శోభితం
నాభౌ నాయకరత్నంచ నూపురే హార పద్మయోః
అంగుళీ ముద్రికాశ్చైవ గృహ్యంతాం అస్మదర్పితాః
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆభరణాని సమర్పయామి
(పుష్పాలు సమర్పించవలెను)
అంగపూజ
కేశవాయ నమః – పాదౌ పూజయామి
విష్ణవే నమః – గుల్ఫౌ పూజయామి
అచ్యుతాయ నమః – జానునీ పూజయామి
కామజనకాయ నమః – ఊరూ పూజయామి
అనిరుద్దాయ నమః – కటిం పూజయామి
పద్మనాభాయ నమః – నాభిం పూజయామి
జనార్దనాయ నమః – ఉదరం పూజయామి
ప్రద్యుమ్నాయ నమః – కుక్షిం పూజయామి
వాసుదేవాయ నమః – హృదయం పూజయామి
నారాయణాయ నమః – వక్షస్థలం పూజయామి
సంకర్షణాయ నమః – కంఠం పూజయామి
చతుర్భుజాయ నమః – స్కంధౌ పూజయామి
ఉపేంద్రాయ నమః – బాహూన్ పూజయామి
శంఖచక్రగదాపద్మధారిణే నమః – హస్తం పూజయామి
శ్రీధరాయ నమః – ముఖం పూజయామి
నవమౌక్తికనాసాగ్రాయ నమః – నాసికా పూజయామి
సూర్యచంద్రాగ్ని లోచనాయ నమః – నేత్రాణి పూజయామి
గోవిందాయ నమః – శిరః పూజయామి
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః | సర్వాణ్యంగాని పూజయామి
అష్టోత్తర శతనామపూజ
శ్రీకృష్ణః కమలానాధో వాసుదేవః సనాతనః
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుష విగ్రహః
శ్రీవత్స కౌస్తుభ ధరో యశోదా వత్సలో హరిః
చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయుధః
దేవకీ నందనః శ్రీశో నందగోప ప్రియాత్మజః
యమునా వేగ సంహారీ బలభద్ర ప్రియానుజః
పూతనా జీవితహరః శకటాసుర భంజనః
నందవ్రజ జనానందీ సచ్చిదానంద విగ్రహః
నవనీత విలిష్తాంగో నవనీత నటోనఘః
నవనీత నవాహరో ముచికుంద ప్రసాదకః
షోడశస్త్రీ సహశ్రేశః
త్రిభంగీ మధురాకృతిః
శుకవాగమృతాబ్దిందుర్ గోవిందో యోగినాం పతిః
వత్సవాట చరో నంతో ధేనుకాసుర భంజనః
తృణీకృత తృణావర్తో యమళార్జున భంజనః
ఉత్తాలతాల భేత్తా చ తమాల శ్యామలాకృతిః
గోపగోపీశ్వరో యోగీ కోటిసూర్య సమప్రభః
ఇళాపతిః పరంజ్యోతి ర్యాదవేంద్రో యదూద్వహః
వనమాలీ పీతవాసాః
పారిజాతాపహారకః
గోవర్థనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః
అజో నిరంజనః కామజనకః
కంజలోచనః
మధుహా మధురానాధ్ ద్వారకానాయకో బలీ
బృందావనాంతసంచారీ తులసీ దామభూషణ:
శ్యమంతక మణేర్హర్తా నరనారాయణాత్మకః
కుబ్జా కృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః
ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదః
సంసారవైరీ కంసారిర్ మురారిర్ నరకాంతకః
అనాది బ్రహ్మచారీ చ కృష్ణా వ్యసన కర్మకః
శిశుపాల శిరఛ్ఛేత్తా దుర్యోధన కులాంతకః
విదురాక్రూరవరదో విశ్వరూప ప్రదర్శకః
సత్యవాక్ సత్యసంకల్పః
సత్యభామారతో జయీ సుభద్రాపూర్వజో విష్ణుర్
భీష్మముక్తి ప్రదాయకః
జగద్గురుర్ జగన్నాథో వేణునాద విశారదః
వృషభాసుర విధ్వంసీ బాణాసుర కరాంతకః
యుధిష్టిర ప్రతిష్టాత్తా బర్హి బర్హావతంసకః
పార్థసారథి రవ్యక్తో గీతామృత మహోదధి:
కాళీయఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజః
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్ర వినాశకః
నారాయణః పరంబ్రహ్మ పన్నగాశన వాహనః
జల క్రీడా సమాసక్త గోపీవస్తాపహారకః
పుణ్యశ్లోకః తీర్థపాదో వేదవేద్యో దయానిధిః
సర్వతీర్థాత్మకః
సర్వగ్రహరూపీ పరాత్పరః
ఏవం శ్రీకృష్ణదేవస్య నామ్నా మష్టోత్తరం శతమ్ కృష్ణ నామామృతం నామ
పరమానంద కారకమ్ అత్యుపద్రవ దోషఘ్నం పరమాయుష్య వర్థనమ్
ధూపం
శ్లోకం
వనస్పతి రసైర్ దివ్యెః నానా గంధైః సుసంయుతం,
ఆత్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ధూపం ఆఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
దీపం
శ్లోకం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాదోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)
నైవేద్యం
శ్లోకం
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు
ఫలాని చ సుపక్వాని స్వీకురు జ్ఞానదాయక
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి
(జలం సమర్పిస్తూ చదవాలి)
సత్యం త్వర్తేన పరిషించామి (Mor) / ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః
సమానాత్మనే నమః
(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
పరబ్రహ్మణే నమః సర్వేభ్యో దేవేభ్యో నమః
ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తా ప్రక్షాళనం సమర్పయామి
పాదౌ ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
శ్లోకం
పూగీఫలై స్సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతం,
ముక్తాచూర్ణ సమాయుక్తం తంబూలం ప్రతిగృహ్యతాం
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)
నీరాజనం
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
మంగళం కోసలేంద్రాయా మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయా, సార్వభౌమాయ మంగళం
శ్లోకం
మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యెః సత్కృతాయాస్తు మంగళమ్
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)
మంత్రపుష్పం – నమస్కారం
(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)
శ్లోకం
నమోస్తనంతాయ సహస్ర మూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటీ యుగ ధారిణే నమః
ఉపచారం
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం
సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
క్షమా ప్రార్ధన– స్వస్తి
(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచరాన్ మనసా సమర్పయామి
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు:
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన,
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా యధా శక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ సుప్రసన్నః
స్సుప్రీతో వరదో భవతు
అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం శ్రీ కృష్ణ పాదోదకం పిబేత్
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు
కలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభ రహితో
బ్రహ్మణా సంతు నిర్భయః అపుత్రాః పుత్రిణః పంతు
పుత్రిణ స్సంతుపౌత్రిణః అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం
లోకాస్సమస్తాః సుఖినో భవంతు
(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)
మరిన్ని పూజా విధానాలు
మరియు వ్రతములు చూడండి.