Water : మానవ శరీరం దాదాపు 60% నీటితో నిండి ఉంటుంది. వివిధ రకాల అవయవాలకు నీరు చాలా అవసరం. కాబట్టి నీరు మానవుని దైనందిన జీవితంలో నీటి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ వ్యాసం ద్వారా నీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
మీరు త్వరగా అలసిపోతున్నారా! కండరాల నొప్పి లేదా మీరు ఎంత కష్టపడిన బరువు తగ్గటం లేదా? అయితే శరీరానికి అవసరం అయిన మొత్తంలో Water తీసుకోవటం లేదని అర్థం.
శరీర అవయవాలు వాటి క్రియలను సరిగా నిర్వహించటానికి Water తప్పని సరిగా అవసరం, అంతేకాకుండా చర్మ సౌందర్యం కోసం, జీవ మనుగడ కోసం నీరు అవసరం. జీవించే ప్రతి జీవికి Water అవసరం. కణాలు ఆక్సిజన్’ను గ్రహించటానికి నీరు అవసరం, మానవ శరీరం దాదాపుగా 60 శాతం నీటితో నిండి ఉంటుంది మరియు శరీర విధులు కొనసాగించుటకు నీరు అవసరం. శ్వాసలో సమస్యలు రాకుండా ఉండుటకు, మూత్ర తయారీకి, వివిధ రకాల విధుల నిర్వహణ కోసం Water అవసరం కావున అధిక నీటిని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదే.
జీర్ణక్రియకు సహాయం
నీరు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మానవులలోని జీర్ణక్రియ సరైన విధంగా పనిచేయడానికి నీరు తప్పని సరిగా కావాలి. ఒకవేళ మీ శరీరంలో నీటి శాతం తగ్గినట్లయితే అది మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది, అది ఒక్కటే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది.
శరీరంలో రక్తప్రసరణ
మీ శరీరం డీ హైడ్రేషన్‌కు గురైన తర్వాత, నీటి స్థాయిలు తగ్గటం వలన శరీరంలో ఉండే రక్తం చిక్కగా మారి, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గటం వలన తలనొప్పి, అలసట వంటివి కలుగుతాయి. కావున, తగినంత నీటిని త్రాగటం వలన శరీరంలోని రక్త సరఫరా సజావుగా జరుగుతుంది.
శరీర ఉష్ణోగ్రత
Water శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది, అందువలనే వైద్యులు మరియు సలహాదారులు వ్యాయామాల తర్వాత ఎక్కువగా నీరు తెసుకోమని సలహా ఇస్తుంటారు. మీ శరీరంలో ఉండవలసినంత స్థాయిలో నీరు లేకపోతె శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒకవేళ మీ శరీరం డీ-హైడ్రేషన్’కు అనుకూలంగా ఉండకపోతే అలసట, శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. నీరు వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరుస్తుంది అంతే కాకుండా చల్లటి వాతావరణానికి తగిన విధంగా శరీరాన్ని మారుస్తుంది.
బరువు తగ్గుటలో ప్రోత్సాహం
నీరు బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, అంటే డీ-హైడ్రేషన్, కొవ్వు పదార్థాల విచ్చిన్నం, వ్యర్థ పదార్థాలను బయటికి పంపటం వంటి విధుల ద్వారా బరువు తగ్గిస్తుంది అంతేకాకుండా, ఆకలి అవనివ్వదు, భోజనానికి ముందు నీరు త్రాగటం వలన తక్కువ ఆహరం తీసుకుంటారు.
వ్యర్థ పదార్థాలను భయటకి పంపుట
మూత్ర పిండాల ముఖ్య పని వ్యర్థ పదార్థాలను మరియు విష పదార్థాలను శరీరం నుండి భయటకు పంపటం. నీరు తక్కువగా తాగటం వలన మూత్రపిండాలపై ప్రభావం ఉంటుంది. కావున, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను భయటకి పంపటానికి అవసరమైనంత మొత్తంలో Water తప్పనిసరిగా తీసుకోవాలి. మూత్రపిండాల వ్యాధులతో భాదపడే వారిలో ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ళు వంటి సమస్యలతో ఇబ్బందులకు గురయ్యే వారికి ప్రతిరోజు 8 గ్లాసుల కంటే ఎక్కువగా నీరు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు.
ఆరోగ్య సమస్యలు
రోజు అవసరమైనంత మొత్తంలో Water తేసుకోవటం వలన శరీరంలో జరిగే పనులు సరైన విధంగా జరుగుతాయి. మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే, తలనొప్పి, మైగ్రిన్, అలసట, నిస్పృహ మరియు డిప్రెషన్ వంటి వివిధ రకాల వ్యాధులకు గురవుతుంటారు. శరీరంలో తగిన స్థాయిలో నీరు అందుబాటులో ఉండటం వలన వెన్నునొప్పి, కండరాల నొప్పులు వంటి రోగాలు రావు.
చర్మానికి కలిగే ఉపయోగాలు
Water ఎక్కువగా తీసుకోవటం వలన చర్మం మృదువుగా, ఆకర్షణీయంగా మారుతుంది. చర్మాన్ని ఎప్పుడు తేమగా ఉంచి, కండరాల కదలికలను సరిగా ఉండేలా చేస్తుంది.
ఎంత మొత్తంలో Water తీసుకోవాలి
‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్’ ప్రకారం, రోజుకు మగవారు 13 కప్పుల నీటిని మరియు ఆడవారు 9 కప్పుల నీటిని త్రాగాలి. అంతే కాకుండా, శరీరానికి అవసరం అయ్యే నీరు వ్యక్తి యొక్క శరీర బరువు మరియు అతడు నిర్వహించే పనుల పైన ఆధారపడి ఉంటుంది.