Kidney Stones: ప్రస్తుతం కాలంలో ఎక్కువ మందిని వేదిస్తున్న ప్రధాన సమస్యలో కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాల్లో రాళ్లు) కూడా ఒకటి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు వచ్చే బాధ అంతా ఇంతా కాదు. యూరిన్‌కు వెళ్లాలంటే మంట, ప్రశాంతంగా కూర్చోలేరు, హాయిగా పడుకోలేరు. Kidney Stones సమస్యను ప్రారంభదశలోనే గుర్తించి దానికి తగ్గిన వైద్యం తీసుకుని ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ కిడ్నీలో రాళ్ళ పరిమాణం పెద్దదిగా ఉంటే ఆపరేషన్ చేసి బయటకు తీస్తారు.
మనవ శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలూ (మూత్రపిండాలు) కూడా ఒకటి. శరీరంలోని వ్యర్థపదార్థాలను, విషపదార్థాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం Kidney Stones అతి సాధారణమైన సమస్యగా మారిపోయింది. కిడ్నీలోని మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడతాయి, ఇవే కిడ్నిలో ఏర్పడే రాళ్లు. మన ఆరోగ్యం మొత్తం కిడ్నీలపై ఆధారపడి ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి
కాల్షియం అక్సినేట్ (Calcium Oxalate), కాల్షియం ఫాస్పేట్ (Calcium Phosphate) అనే రెండు రకాల రాళ్లు కిడ్నీలో ఉంటాయి. మూత్రంలో ద్రావణం మరియు సాలిడ్ కంపోనెంట్ ఉంటుంది. సోడియం, పొటాషియం, యూరిక్ యాసిడ్, కాల్షియం వంటి రకరకాల పదార్థాలు సాలిడ్ కంపోనెంట్‌లో ఉంటాయి. ఈ సాలిడ్ కంపోనెంట్‌లు మూత్రంలో కరగకుండా అక్కడే ఉండి చిన్న చిన్న గుళికలుగా ఏర్పడతాయి. ఇవే కాకుండా మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు పోకుండా లోపలే పేరుకుపోవటం వలన ఈ రసాయనాలు కూడా స్ఫటిక రూపంలో కిడ్నీలో ఉంటాయి. ఇవి మూత్రకోశంలో కదులుతుంటాయి.
మామూలుగా ఆక్జలేట్ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల ఏర్పడే రాళ్లే ఎక్కువగా ఉంటాయి. శరీరం ప్రోటీన్‌ను ఉపయోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్ యాసిడ్‌తోనూ రాళ్లు ఏర్పడవచ్చు.
Kidney Stones రావడానికి ప్రత్యేకించి ఒక కారణం అంటూ ఏమి లేదు. కిడ్నీలో రాళ్లు అనేక కారణాల ఫలితంగా శరీరంలో అవి వృద్ధి చెందుతాయి.
- సరైన వ్యాయామం చేయకపోయినా, మధుమేహం ఉన్న వారికి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
- నీరు సరిగా తీసుకొని వారికి Kidney Stones ఏర్పడే అవకాశం ఉంది.
- కాల్షియం, అధిక ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
- ఉప్పు ఎక్కువ శాతం తీసుకోవడం వలన Kidney Stones ఏర్పడుతాయి.
- ఊబకాయం ఉన్న వారిలో కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మూత్రంలో ఆమ్ల స్థాయిలను మార్చి రాళ్ళు ఏర్పడతాయి.
Kidney Stones ఎవరికి వస్తాయి
ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేయకపోయినా, ఉండాల్సిన దానికన్న ఎక్కువ బరువు ఉన్నా, షుగర్ ఉన్నా, నీళ్లు సరిగా తీసుకోకపోయినా, మాంసాహారం ఎక్కువగా తినడం వలన, స్టిరాయిడ్‌లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన Kidney Stones వచ్చే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయకపోయినా, సరిగా నిద్రపోకపోవడం వలన, శరీరంలో B6, C విటమిన్ లోపం ఉన్నా, విటమిన్ D ఎక్కువగా ఉన్నా, కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
Kidney Stones చిన్నవిగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ అవి మూత్ర నాళానికి (మూత్రం ద్వారా మూత్రపిండము నుంచి మూత్రాశయం వరకు వెళ్ళే గొట్టం) చేరుకున్నప్పుడు, నొప్పి, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలో ఉండే రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే, అది మూత్రాశయం నుండి మూత్రనాళం వరకు వెళ్లి, మూత్రం ద్వారా బయటకు వస్తుంది. చాలా సందర్భాలలో, మూత్రపిండాల్లో రాళ్లు 30 నుంచి 45 రోజులలో సహజంగా బయటకు వెళ్లిపోతాయి.
కిడ్నీలోని రాళ్ల రకాలు
కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు:
సాధారణంగా చాలా కిడ్నీ రాళ్ళు కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఆక్సలేట్ అనేది ఆహారంలో సహజంగా లభించే పదార్థం. ఇది కాలేయం ద్వారా ప్రతిరోజూ తయారవుతుంది. కొన్ని రకాల పండ్లు, కొన్ని రకాల కూరగాయలు మరియు చాక్లెట్లలో అధిక శాతం ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది.
కాల్షియం ఫాస్ఫేట్ రాళ్ళు:
మూత్రపిండ నాళంలోఅసిడోసిస్ వంటి జీవక్రియ పరిస్థితులలో ఈ రాయి ఏర్పడుతుంది. ఇది మైగ్రేన్ తలనొప్పికి వాడే మందుల వలన లేదా కొన్ని నిర్భందించే మందులను తీసుకోవడం వలన కూడా ఏర్పడవచ్చు.
స్ట్రువైట్ రాళ్ళు:
మూత్రనాళాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ వలన స్ట్రువైట్ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్ళు తక్కువ సమయంలోనే పెద్దవిగా పెరుగుతాయి, ఈ రకమైన రాళ్ళు ఏర్పడినవారిలో వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటాయి.
యూరిక్ యాసిడ్ రాళ్ళు:
యూరిక్ యాసిడ్ రాళ్లు తగినంత నీరు తాగనివారిలో మరియు అధిక శాతం ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకునే వారిలో ఏర్పడతాయి.
కిడ్నీలోని రాళ్ల యొక్క లక్షణాలు
- నడుము వెనుక భాగంలో మరియు పక్కటెముకల క్రింద వైపు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
- గులాబి, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం వస్తుంది.
- వాంతులు, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకితే జ్వరం మరియు చలి, సాధారణం కంటే తక్కువగా మూత్రవిసర్జన వస్తుంది.
- రాళ్లు మూత్రనాళంలో కదులుతున్నప్పుడు నొప్పి కూడా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భరించలేని నొప్పి :
Kidney Stones కారణంగా విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి వస్తుంది. మూత్రనాళంలో రాయి కదులుతున్నప్పుడు నొప్పి మొదలవుతుంది. రాళ్లు మూత్రనాళంలో అడ్డం తగలడం వలన కిడ్నీకి ఒత్తిడి కలుగుతుంది. కిడ్నీలో నొప్పి అకస్మాత్తుగా మొదలవుతుంది. రాళ్ల పరిమాణం పెద్దదిగా ఉంటే మరింత నొప్పి ఉంటుంది.
మూత్ర విసర్జన సమయంలో నొప్పి :
Kidney Stones సమస్య ఉంటే మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది, దీనిని డైసూరియా అంటారు. రాళ్లు మూత్రాశయం, బ్లాడర్ మధ్యలో ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ల సమస్యను గుర్తించకపోతే అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.
యూరిన్‌లో రక్తం:
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణం మూత్రంలో రక్తం రావడం. దీనిని హెమటూరియా అంటారు. రక్త కణాలు మైక్రోస్కోప్ లేకుండా చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. దీనిని మైక్రోస్కోపిక్ హెమటూరియా అని అంటారు.
యూరిన్ వాసన:
ఆరోగ్యంగా ఉంటే మూత్రం స్పష్టంగా ఉంటుంది, ఎక్కువగా వాసన రాదు. కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రం స్పష్టంగా ఉండదు, దుర్వాసన వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడూ మూత్రం ఇలానే ఉంటుంది. బ్యాక్టీరియా కారణంగా మూత్రం వాసన వస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఎలా నిర్ధారణ చేస్తారు
రక్త పరీక్ష:
రక్త పరీక్ష ద్వారా రక్తంలో ఎక్కువ శాతం కాల్షియం లేదా యూరిక్ యాసిడ్ ఉందో లేదో తెలియజేస్తుంది. ఈ పరీక్ష వలన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో తెలియజేస్తుంది.
మూత్ర పరీక్ష:
ఈ పరీక్ష కోసం, వరుసగా రెండు రోజుల పాటు రెండు సార్లు మూత్రంని తీసుకొని పరిక్షిస్తారు. ఈ పరీక్షలో చాలా ఎక్కువ రాళ్లను ఏర్పరుచుకునే ఖనిజాలను లేదా చాలా తక్కువ రాళ్లను నిరోధించే పదార్థాల గురించి తెలుసుకోవచ్చు.
ఇమేజింగ్ టెస్ట్:
మూత్ర నాళంలో, మూత్రపిండాల్లో ఉండే రాళ్లను చూపిస్తుంది.
ఈ రకమైన అన్ని పరీక్షలు చేసి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని నిర్దారించిన తర్వాతే ఆ పేషంట్ లో రాళ్లు ఉన్నాయి అని నిర్థారిస్తారు.
కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించుకోవడం ఎలా?
- ఎక్కువగా నీళ్ళు తాగాలి (రోజుకు కనీసం 6 నుండి 8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది)
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ ను ఎక్కువ తీసుకోకూడదు.
- తినే ఆహారంలో ఉప్పు తక్కువ శాతం తీసుకోవడం మంచిది.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అనగానే కొంత మంది రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. తినే ఆహారం మార్చుకోవడం, అతిగా మంచినీళ్లు తీసుకోవడం వటివి చేస్తుంటారు. అంతే కాకుండా ఏం తినాలన్నా సంకోచిస్తారు.
ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడం, కనీస వ్యాయమాలు చేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, కిడ్నీలను పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిసాయి కావున వీటి సంరక్షణకు అందరూ తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి చేసే చికిత్సలు ఏవి?
మాములుగా రాళ్లు బయటకు పోవడానికి మూత్ర నాళాన్ని సడలించడానికి టామ్సులోసిన్ (ఫ్లోమాక్స్) మందును సూచిస్తారు. ఇది మూత్ర నాళాన్ని వదులుగా చేసి, రాయిని సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది.
రాళ్లు పెద్దవిగా ఉంటే రక్తస్రావం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. మూత్రపిండాలు లేదా మూత్రనాళం నుండి రాయిని తొలగించడానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది.
చిన్న కోత లేదా ఎటువంటి కోతలు లేకుండా చేసే అధునాతన ఆపరేషన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాయి పరిమాణం మరియు అవి ఉండే ప్రదేశాన్ని బట్టి ఏ ఆపరేషన్స్ చేయాలో డాక్టర్ నిర్ణయిస్తాడు.
RIRS –
ఫ్లెక్సిబుల్ యూరిటెరోస్కోప్ అనే పరికరాని ఉపయోగించి చేసే సర్జరీ రెట్రోగ్రేడ్ ఇంట్రరెనల్ సర్జరీ (RIRS). ఈ సర్జరీలో ఎక్కడి నుంచైనా రాళ్లను తొలగించవచ్చు. కోత లేకుండా మరియు సాధారణ అనస్థీషియా ఇచ్చి ఈ సర్జరీ చేస్తారు. బయట కోతలు లేకుండానే కిడ్నీ లోపల శస్త్రచికిత్స చేస్తారు. ఈ సర్జరీలో పరికరం మూత్రనాళం ద్వారా పైకి వెళ్లి, ఫ్లోరోస్కోపీ సహాయంతో మూత్రపిండంలోకి వెళ్లి అక్కడ ఉన్న రాళ్లను కరిగిస్తుంది.
URSL –
మూత్రానాళం లేదా మూత్రాశయంలో రాయి ఇరుక్కున్నప్పుడు మూత్రాశయం మరియు మూత్ర నాళం ద్వారా మూత్రపిండాన్ని చేరుకోవడానికి యురేటెరోస్కోప్ అనే సన్నని పరికరాన్ని ఉపయోగిస్తారు. మూత్రపిండ రాయిని విచ్ఛిన్నం చేసే హోల్మియం శక్తిని ప్రసారం చేయడానికి లేజర్ ఫైబర్ ఉపయోగించబడుతుంది మరియు మూత్రనాళం నుండి ముక్కలను తొలగిస్తారు, రాయి చిన్న చిన్న ముక్కలుగా మూత్రం ద్వారా బయటకి వస్తాయి.
PCNL –
పక్క లేదా వెనుక భాగంలో ఒక చిన్న కోతను పెట్టి, మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించడానికి మరియు తొలగించడానికి ఒక నెఫ్రోస్కోప్ను లోపలికి పంపి, షాక్ వేవ్ లేదా లేజర్లు వాడి రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి మూత్రం ద్వారా బయటికి రావడానికి ఈ సర్జరీ ఉపయోగిస్తారు.
ESWL –
మూత్రం ద్వారా రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి శరీరం ద్వారా ప్రసారం చేయబడిన నాన్-ఎలక్ట్రికల్ షాక్ వేవ్లు మూత్రం గుండా పంపిస్తారు.