Home ఆధ్యాత్మికం Runa Vimochana Angaraka Stotram | ఋణ విమోచన అంగారక స్తోత్రం

Runa Vimochana Angaraka Stotram | ఋణ విమోచన అంగారక స్తోత్రం

0
152
Runa Vimochana Angaraka Stotram

Runa Vimochana Angaraka Stotram ప్రతి నిత్యం పారాయణ చేయడం వలన ఋణ భాదల నుండి విముక్తి పొందవచ్చు. ఇక్కడ తెలుగులో Runa Vimochana Angaraka Stotram ని పొందండి మరియు బుణ విముక్తి కలగడానికి ప్రతి రోజు భక్తితో జపించండి.

 

Runa Vimochana Angaraka Stotram:

స్కంద ఉవాచ:

ఋణగ్రస్తరానాంతు ఋణముక్తిః కధం భవేత్ |

బ్రహ్మోవాచ :

వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య
గౌతమ ఋషిః అనుష్టుప్ చ్ఛందః  అంగారకో దేవతా
మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః

ధ్యానమ్ :

రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తుతే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ || 

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా || ౭ ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |
 
మూలమంత్రః

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ || ౯ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ |
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యాథా || ౧౦ ||
 
అర్ఘ్యమ్ :

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ || ౧౧ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తుతే || ౧౨ ||

ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

 

     చివరి రెండు శ్లోకాలు చదువుతూ మూడు సార్లు దోసిలితో నీళ్లు (అర్ఘ్యం) వదిలి పెట్టాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఋణ బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా బుణ విముక్తి పొందవచ్చు.

Runa Vimochana Angaraka Stotram చదవడానికి చేసే చిన్న పక్రియ

     ఒక పీట మీద ముగ్గు వేసి దాని మీద ఎర్రని బట్ట పరచాలి. దాని మీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి, ఎర్రని పూలు, ఎర్ర గంధముతో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

ఓం మంగళాయ నమః
ఓం భూమి పుత్రాయ నమః
ఓం ఋణ హన్త్రే నమః
ఓం ధన ప్రదాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం మహా కాయాయ నమః
ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః
ఓం లోహితాయ నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం సామగాన కృపాకరాయ నమః
ఓం ధరాత్మజాయ నమః
ఓం కుజాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిజాయా నమః 
ఓం భూమి నందనాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం యమాయ నమః
ఓం సర్వరోగాపహారకాయ నమః
ఓం స్రష్ట్రే నమః
ఓం కర్త్రే నమః
ఓం హర్త్రే నమః
ఓం సర్వదెవ పూజితాయ నమః

     తరువాత చండ్ర కర్రను కాల్చగా వచ్చిన బొగ్గులతో రెండు అడ్డ గీతలు గీయాలి. రెండు అడ్డ గీతల మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.

Runa Vimochana Angaraka Stotram 00

ఉదాహరణకు :

______________

      2 లక్షలు

______________

     పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదవాలి. ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా తుడిచి వేయవలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమం చేసుకుంటే మంచిది.

    పై విధంగా చేసిన వారికి సిరి సంపదలు పెరిగి, ఋణ బాధలు తీరి ఆనందంగా ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.

also read  Sapta Shanivara Vratham | సప్త శనివారాల వ్రతం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here