International Womens Day : మహిళలు లేకపోతే దేశ అభివృద్ధి ఉండదు. అటువంటి స్త్రీలను గౌరవించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకు ఈ రోజునే నిర్వహిస్తారు? చరిత్ర ఎంటి? తెలుసుకుందాం.
సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా దేశ అభివృద్ధిలో సహాయపడుతున్నారు. అయిన కూడా చాలా దేశాల్లో మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు స్త్రీలకు లభించడం లేదు. కొన్ని దేశాల్లో అయితే మహిళలు నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) ప్రతి సంవత్సరం మార్చి 8వ తేది జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం మహిళా దినోత్సవం జరుపుకుంటారు. లింగ అసమానత, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలపై వేధింపులు, ప్రతిరోజు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మహిళల సమస్యల గురించే కాకుండా లింగ సమానత్వం కోసం అందరి ప్రోత్సహించి ఏకం చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళ దినోత్సవానికి సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకలు, 2023 సంవత్సరం నాటి థీమ్ ఏమిటి అనే విషయాలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
Women’s Day చరిత్ర
మహిళా దినోత్సవం మార్చి 8న, 1857 న్యూయార్క్ లో జరిగిన మహిళా గార్మెంట్ వర్కర్ల సమ్మె గుర్తుగా అని విశ్వాసం. కానీ కొందరు పరిశోధకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సిద్ధాంతాన్ని ఖండించారు.
అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. తమ హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ రోడ్లలో అందరు ర్యాలీ చేశారు. పని గంటలు తగ్గించి వేతనాలు పెంచాలన్నది మహిళల డిమాండ్. ఈ ఉద్యమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలి అనే డిమాండ్ కూడా చేశారు. అంతే కాకుండా వారి డిమాండ్ లు నెరవేరే దాకా ఉద్యమాన్ని ఆపలేదు. అప్పటి ప్రభుత్వం వారి కష్టాలను గుర్తించి పరిష్కారం చూపింది. దీని కారణంగా 1909వ సంవత్సరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. 1911వ సంవత్సరంలో మొదటి మహిళా దినోత్సవాన్ని అనేక దేశాల్లో జరుపుకోవడం ప్రారంభం అయ్యింది. చివరికి 1977వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి కూడా మార్చి 8ని అధికారిక అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
Women’s Day ఎందుకు జరుపుకుంటారు?
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికాలోని పనిచేసే మహిళలు తమ హక్కుల కోసం మార్చి 8న ఓ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో లక్షలాది మహిళలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యమం వివిధ దేశాలకు దాకా పాకింది. ముఖ్యంగా దీని ప్రభావం రష్యాపై తీవ్రంగా పడింది. అక్కడ కూడా మహిళలు హక్కుల కోసం సమ్మె చేపట్టారు. దీంతో రష్యా మహిళలందరికీ ఓటు హక్కు లభించింది. ఆ రోజు నుంచి రష్యాలో మార్చి 8న మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
మహిళా దినోత్సవ 2023 థీమ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 యొక్క థీమ్ ఎంబ్రేసే ఈక్విటీ అంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వంపై పోరాటం చేయడం.
మహిళా దినోత్సవ ప్రాముఖ్యత :
నేటికీ, స్త్రీలను పురుషులతో సమానంగా చూడడం లేదు మరియు సమాన అవకాశాలు కల్పించడం లేదు. ప్రపంచలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు సమాన హక్కులు మరియు సమాన అవకాశాలను కల్పించాలి అని ప్రతి ఒక్కరు ఉద్యమించే రోజు ఇది. గతంలో మహిళా దినోత్సవం రోజున #MeToo ఉద్యమం మొదలైంది. ఇటువంటి ఉద్యమాలు అందరిలో చైతన్యం కలిగిస్తుంది.
మహిళా దినోత్సవ వేడుకలు
Women’s Day సందర్భంగా చేయాల్సిన పనులు మహిళా ఉద్యమల చరిత్ర గురించి అందరికి అవగాహన కల్పించడం. సమాన హక్కులు మరియు ప్రాతినిధ్యం కోసం డిమాండ్లను వ్యాప్తి చేయడానికి స్థానిక మహిళా దినోత్సవ నిరసనలో పాల్గొనడం. మహిళల ప్రయోజనాల రంగంలో పనిచేసే సంస్థలకు విరాళం ఇవ్వడం. లింగ అసమానత, సమాన అవకాశాలు లేకపోవడం మొదలైన మహిళల సమస్యల గురించి మాట్లాడే కార్యక్రమాలు నిర్వహించడం.
భారత ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు
జాతీయ మహిళా కమిషన్ : మహిళల హక్కులు, చట్టపరమైన హక్కులను కాపాడేందుకు 1990 సంవత్సరంలో పార్లమెంటు చట్టం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు.
73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు – 1993 : పంచాయతీలు మరియు మున్సిపాలిటీల స్థానిక సంస్థలలో మహిళలకు వరుసగా సీట్ల రిజర్వేషన్ కోసం, మరియు స్థానిక స్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో వారి భాగస్వామ్యానికి బలమైన పునాది వేసింది.
మహిళా సాధికారత కోసం జాతీయ విధానం (2001) : మహిళల అభివృద్ధి మరియు సాధికారతను తీసుకురావడం ఈ విధాన ముఖ్య లక్ష్యం. లక్ష్యాలను సాధించడానికి అన్ని వాటాదారుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ విధాన ముఖ్య ఉద్దేశం.
మహిళా ఇ- హాట్: మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు (SHG) మరియు ప్రభుత్వేతర సంస్థలు (NGO) వారిచే తయారు చేయబడిన ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడానికి మహిళల మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యక్ష ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది డిజిటల్ ఇండియా లో ఒక భాగం.
బేటీ బచావో బేటీ పఢావో యోజన : జనవరి 2015లో ప్రభుత్వం ప్రారంభించింది. ఇది అవగాహన కల్పించడం మరియు బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని, క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి (CSR)ని మెరుగుపరచడం.
సుకన్య సమృద్ధి యోజన : బేటీ బచావో బేటీ పఢావో పథకం ప్రభుత్వ పథకం పరిధిలోకి వస్తుంది. ఇది ఒక పొదుపు పథకం లాంటిది. పోస్ట్ ఆఫీస్‌లో లేదా వాణిజ్య బ్యాంకు బ్రాంచ్‌లో ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాల వయస్సులోపు తల్లిదండ్రులు కానీ, సంరక్షకులు కానీ ఖాతాను తెరవవచ్చు.
మహిళా శక్తి కేంద్రం : గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను నేర్పించడం, ఉపాధి, డిజిటల్ విద్య, మార్కెటింగ్, ఆరోగ్యం లాంటి వాటిలో అవకాశాలను కల్పించేందుకు 2017 సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇవి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పని చేస్తాయి.
వర్కింగ్ ఉమెన్ హాస్టల్ : పనిచేసే మహిళలకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వసతి గృహాల కల్పనా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళలకు ఉపాధి అవకాశాలు ఉన్న పట్టణ, అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీలైన చోట విస్తరించి ఉన్నాయి.
మహిళల కోసం శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమానికి మద్దతు : మహిళలు లాభదాయకమైన ఉపాధిని చేపట్టడానికి వారికి నైపుణ్యాలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 16 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క స్త్రీ ఈ ఉపాధి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం నేరుగా NGOలతో సహా ఒక సంస్థ ద్వారా ఇవ్వబడిన గ్రాంట్ ద్వారా నిర్వహించబడుతుంది.
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
Women’s Day రోజున, మీ తల్లి, మీతో పుట్టిన సోదరీమణులు మరియు మీ భార్య, మీ స్నేహితురాలను మరియు సాటి స్త్రీని గౌరవించండి, అభినందించండి. కావాలంటే వారికి బహుమతి అందించండి.