Aadhaar PVC Card Online :
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. సేవలు, పథకాలు మరియు మొదలైన వాటికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. కాబట్టి ఆధార్ కార్డ్ ని ఎప్పుడు బ్యాగులో తీసుకొని వెళ్ళాసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల అవసరాలను గమనించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ATM కార్డు సైజులో ఆధార్ కార్డ్ ని అందిస్తోంది. దీన్నే ఆధార్ పీవీసి కార్డ్ (Aadhaar PVC) అంటారు. ఈ ఆధార్ PVC కార్డ్ ఆర్డర్ చేయడానికి పూర్తి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ Resident.uidai.gov.inలో ఆధార్ PVC కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ATM కార్డ్ ల ఉండే ఆధార్ PVC కార్డ్ ను కేవలం రూ. 50 లకు, ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఇంటి అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పొందవచ్చు.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని వారు కూడా నాన్-రిజిస్టర్డ్ లేదా ఆల్టర్నేట్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఆధార్ PVC కార్డ్ ని ఆర్డర్ చేయవచ్చు.
Aadhaar PVC Card గురించి కొన్ని అంశాలు
PVC కార్డులను పాలీ వినైల్ క్లోరైడ్ (Polyvinyl Chloride) కార్డులు అంటారు. PVC కార్డ్ అనేది ఆధార్ సమాచారం ముద్రించబడిన ప్లాస్టిక్ కార్డ్. ఈ కార్డు తయారీకి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు.
రూ. 50 (GST & స్పీడ్ పోస్ట్ ఛార్జీలతో సహా) చెల్లించి ఆధార్ కార్డ్ ని ఆర్డర్ చేయాలి. ఆధార్ కార్డ్ ని ఆర్డర్ చేయడానికి మీ ఆధార్ నంబర్/వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్/EIDని ఉపయోగించాలి.
ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉన్నట్లే ఆధార్ PVC కార్డులో కూడా క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ డేట్, ప్రింట్ డేట్, ఎంబాస్డ్ ఆధార్ లోగో లాంటివి ఉంటాయి.
రిజిస్టర్డ్ లేదా ఆల్టర్నేట్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి OTP పొందవచ్చు. OTP ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ ని ఆర్డర్ చేయవచ్చు.
ప్రభుత్వ పథకాలు, బ్యాంకు, పిల్లల అడ్మిషన్ వంటి వివిధ ప్రయోజనాల కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. గుర్తింపు రుజువుగా కూడా ఆధార్ కార్డు ఉపయోగించబడుతుంది. ఇంతకుముందు వచ్చిన ఆధార్ కార్డు చాలా పెద్దది మరియు దానిని తీసుకెళ్లడం కష్టం. కానీ ఇప్పుడు, UIDAI పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) ఆధార్ కార్డ్ లను ATM కార్డ్ సైజులో సులభంగా జేబులో లేదా పర్సులో పెట్టుకునేలా రూపొందించబడింది.
ఆన్‌లైన్‌లో ఆధార్ PVC కార్డ్ ని ఆర్డర్ చేసే విధానం
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
Step 1: ఆధార్ PVC కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://resident.uidai.gov.in/ని open చేయండి.
Step 2: హోమ్‌పేజీలోని ప్రధాన మెనూలో ఉన్న My Aadhaar విభాగంలో, Order Aadhaar PVC Card లింక్‌పై క్లిక్ చేయండి లేదా ఈ https://myaadhaar.uidai.gov.in/ క్లిక్ చేయండి.
Step 3 : మొదట ఆధార్ కార్డ్ నెంబర్ తో login అవ్వాలి.
Step 4: లాగిన్ పేజిలో ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ కి OTP వస్తుంది. తర్వాత OTP ఎంటర్ చేయాలి.
Step 5: లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, దిగువ చూపిన విధంగా ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ ఆన్‌లైన్ పేజీ open అవుతుంది.
Step 6: ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ID లేదా 28 అంకెల EIDని నమోదు చేయవచ్చు. క్యాప్చాను ఎంటర్ చేసి, ఆపై Send OTP బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 7: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయాలి.
Step 8: OTP ఎంటర్ చేసినా తర్వాత, PVC కార్డ్ ప్రివ్యూ వస్తుంది.
Step 9: Next బటన్ క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ I here by confermation ఆప్షన్ నొక్కితే make pement బటన్ ఆక్టివేట్ అవుతుంది. దీనిని క్లిక్ చేయగానే పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది.
Step 10: క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్‌బ్యాంకింగ్ / UPI తదితర వాటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని రూ. 50 పేమెంట్ చేయాలి.
Step 11: పేమెంట్ అయిన తర్వాత Acknowledgement వస్తుంది.
Aadhaar PVC Card Online
నాట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
Step 1 : https://myaadhaar.uidai.gov.in/ లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, దిగువ చూపిన విధంగా ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ ఆన్‌లైన్ పేజీ open అవుతుంది.
Step 2: ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ID లేదా 28 అంకెల EIDని నమోదు చేయవచ్చు. క్యాప్చాను ఎంటర్ చేయాలి.
Step 3: If you do not have a registerd mobile number అనే బాక్స్ ని టిక్ చేయాలి. ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆ మొబైల్ కి OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయాలి.
Step 4: OTP ఎంటర్ చేసినా తర్వాత, నాన్- రిజిస్టర్డ్ లో ఆధార్ PVC కార్డ్ ప్రివ్యూ ఉండదు.
Step 5: Next బటన్ క్లిక్ చేయగానే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ I here by confermation ఆప్షన్ నొక్కితే make pement బటన్ ఆక్టివేట్ అవుతుంది. దీనిని క్లిక్ చేయగానే పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది.
Step 6: క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్‌బ్యాంకింగ్ / UPI తదితర వాటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని రూ. 50 పేమెంట్ చేయాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)
- ఆధార్ PVC కార్డ్ యొక్క భద్రతా లక్షణాలు ఏమిటి?
ఈ కార్డ్ లో సెక్యూర్ క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ తేదీ & ప్రింట్ డేట్, ఎంబోస్డ్ ఆధార్ లోగో వంటి సెక్యూరిటీ ఫీచర్‌లు ఉన్నాయి.
- ఆధార్ కార్డు కోసం ఎంత చెల్లించాలి?
చెల్లించాల్సిన ఛార్జీలు రూ. 50/- (GST & స్పీడ్ పోస్ట్ ఛార్జీలతో కలిపి)
- చెల్లింపు చేయడానికి ఏ ఏ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి?
ప్రస్తుతం, ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు UPI పద్ధతులను ఉపయోగించవచ్చు.
- AWB నంబర్ అంటే ఏమిటి
AWB నంబర్ అనేది డెలివరీ చేసే ప్రొడక్ట్ కోసం DoP అంటే ఇండియా స్పీడ్ పోస్ట్ ద్వారా రూపొందించబడిన ట్రాకింగ్ నంబర్.
- ఆర్డర్ చేసిన PVC కార్డ్ ఎన్ని రోజులకు వస్తుంది?
PVC కార్డ్ కోసం ఆర్డర్ చేసిన 5 పనిదినాల (అభ్యర్థన తేదీ మినహా) తర్వాత ఆధార్ PVC కార్డ్ ని స్పీడ్ పోస్ట్ ద్వారా డెలివరీ చేయబడుతుంది.
మరిన్ని వివరాల కోసం https://resident.uidai.gov.in/ లింక్‌లో UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.