Friday, September 6, 2024
Homeబయోగ్రఫీSubhash Chandra Bose Biography | సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర

Subhash Chandra Bose Biography | సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర

Subhash Chandra Bose : 

 

జననం : జనవరి 23, 1897 కటక్, ఒడిషా

మరణం : ఆగష్టు 18, 1945 తైవాన్ (అని భావిస్తున్నారు)

ప్రసిద్ధులు : భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు, భారత జాతీయ సైన్యాధినేత

తల్లిదండ్రులు : జానకినాథ్ బోస్, ప్రభావతి దేవి

జీవిత భాగస్వామి : ఎమిలీ షెంకెల్

పిల్లలు : అనిత

        నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 – ఆగష్టు 18, 1945) గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒక వైపు గాంధిజీ, నెహ్రు మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సాధించవచ్చు అని నమ్మి పోరాటం సాగిస్తుంటే, Subhash Chandra Bose మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు. సుభాష్ చంద్రబోస్ మరణంపై పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

        గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ బేధాలు ఉండటం వలన భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైనా ఆ పదవికి Subhash Chandra Bose రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ భావన. స్వంతంగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులు బోస్‌ని జైలులో బంధించారు. 1939లో రండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి ఇది ఒక సువర్ణవకాశంగా Subhash Chandra Bose భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మని మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పరచాడు.

     సుభాష్ చంద్రబోస్  రాజకీయ అభిప్రాయాలు, జర్మని మరియు జపాన్‌తో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా సుభాష్ చంద్రబోస్‌ను అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్వదమైంది. 1945 ఆగస్ట్ 18లో తైవాన్‌లో  జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడని ప్రకటించినప్పటికి, సుభాష్ చంద్రబోస్  ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

బాల్యం, విద్యాభ్యాసం

        Subhash Chandra Bose 1897లో, భారతదేశంలో ఒడిషాలోని కటక్ అనే పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ సుభాష్ చంద్రబోస్  లాయరు. తల్లి పేరు ప్రభావతి దేవి. సుభాష్ చంద్రబోస్  విద్యాభ్యాసం కటక్ లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్ లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిల్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై చైతన్య యూనివర్సిటీ GK యూనివర్సిటీలోను సాగింది.

1920 సంవత్సరంలో Subhash Chandra Bose భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలో నాలుగవ ర్యాంకు సాధించాడు. ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు వచ్చాయి. అయినా 1921 ఏప్రిల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి  యువజన విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

Bose-as-child-telugu-pencil
                                                                1906లో సుభాష్ చంద్ర బోస్

Subhash Chandra Bose భారత జాతీయ కాంగ్రెస్‌లో 

        సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలసి Subhash Chandra Bose బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు. 1937 డిసెంబర్ 26న Subhash Chandra Bose ఎమిలీ షెంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకొన్నాడు. వీరికి 1942 లో అనిత అనే కూతురు పుట్టింది.

        1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. Subhash Chandra Bose చేతిలో పట్టాభి సీతారామయ్య ఓడిపోవడం తన ఓటమిగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వలన Subhash Chandra Bose కాంగ్రెస్ నుండి వైదొలగాడు. వేరే మార్గం లేని సుభాష్ చంద్రబోస్  “అఖిల భారత పార్వర్డ్ బ్లాక్” అనే పార్టీని స్థాపించాడు.

also read  Ashika Ranganath Biography | ఆషికా రంగనాథ్ జీవిత చరిత్ర
Bose-with-Congress- Leaders-telugu-pencil
                                                                 కాంగ్రెస్ లీడర్‌లతో బోస్

 దేశం వదిలి అజ్ఞాతంలోకి

     బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్‌ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో నిర్ణయం పట్ల సుభాష్ చంద్రబోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్ననలు ప్రారంభించాడు. బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. తర్వాత విడుదల చేసింది, కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. పఠాన్ వేషం వేసుకొని తన మేనల్లుడుతో ఇంటి నుండి తప్పించుకొన్నాడు. ముందుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ నుండి మియా అక్బర్ షా, ఆగాఖాన్‌ల సహకారంతో ఆప్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. తమ శత్రువులు కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో సుభాష్ చంద్రబోస్  తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే చంపేయాలి అని బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది.

జర్మనీలో

       ఇలా భారతదేశం నుండి ఆప్ఘనిస్తాన్ అక్కడ నుండి రష్యా, అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న సుభాష్ చంద్రబోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు.

స్వాతంత్ర్యానికి సుభాష్ చంద్రబోస్ ప్రణాళిక

     రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని Subhash Chandra Bose బలంగా వాదించాడు. సుభాష్ చంద్రబోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ మరియు మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం. ఈ సమయంలో సుభాష్ చంద్రబోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలిసి తన అభిప్రాయాలను తెలియజేశాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ సుభాష్ చంద్రబోస్‌తో సమవేశానికి అంగీకరించలేదు. తర్వాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.

భారత జాతీయ సైన్యం

     భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942లో సింగపూర్‌లో స్థాపించాడు. 1943లో సుభాష్ చంద్రబోస్ సైన్యంలో చేరాడు. అదే సంవత్సరంలో సింగపూర్‌లో జరిగిన మీటింగ్‌లో రాష్ బిహారీ సుభాష్ చంద్రబోస్ సంస్థ పగ్గాలను సుభాష్ చంద్రబోస్‌కి అప్పగించాడు. సుభాష్ చంద్రబోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం అందిచారు. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధినంలో ఉండేవి.

“ మీ రక్తాన్ని ధారపోయండి… మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను”

 

Bose-and-Azad-Hind-Fauj-Member-telugu-pencil
                                                                               ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులతో బోస్

అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం 

        ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం Subhash Chandra Bose ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ అయన శవం మాత్రం కనపడలేదు. అందువలన ఆయన బతికి ఉండే అవకాశం ఉందని అనేక కథనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి సుభాష్ చంద్రబోస్  సోవియట్ యూనియన్‌కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. బోస్‌గారి మరణం గురించి విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్వాటు చేసింది.

     1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ Subhash Chandra Bose మరణాన్ని గురించి విచారించడానికి జపాన్‌కు వెళ్ళింది. అప్పట్లో భారత్‌కు తైవాన్‌తో మంచి సంబంధాలు ఉండేవి కాదు అందువలన వారు సహకరించలేదు. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005లో తిరిగి విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్‌ ప్రభుత్వంతో చేతులు కలిపి సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది. అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్‌కు లేఖను పంపింది.

also read  Vikram Sarabhai Biography | విక్రమ్ సారాభాయ్ జీవిత చరిత్ర

     ముఖర్జీ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ  కమీషన్ నివేదిక ప్రకారం Subhash Chandra Bose విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ముఖర్జీ కమీషన్ నివేదికను తిరస్కరించింది. 

అపరిచిత సన్యాసి 

        1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసి వేషంలో ఉన్నది సుభాష్ చంద్రబోస్ అని చాలా మంది నమ్మకం. భగవాన్ జీ మరణించిన తర్వాత అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరక లేదు భగవాన్ జీ, సుభాష్ చంద్రబోస్ ఒక్కరే అనే వాదనలను కొట్టివేసింది.

Gumnami-Baba-telugu-pencil
                                                                                     గుమ్నామీ బాబా

     తర్వాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. నేటికి భగవాన్ జీ జీవితం మరియు రచనలు అంతుపట్టకుండా ఉన్నాయి.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular