Tuesday, October 15, 2024
Homeబయోగ్రఫీPawan Kalyan Biography | పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర

Pawan Kalyan Biography | పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర

 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సినీనటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త. పవన్ కళ్యాణ్ తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉండే అగ్రహిరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రొఫైల్

పూర్తి పేరు : కొణిదెల కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్)
వృత్తి : నటుడు, రచయిత మరియు రాజకీయవేత్త
పుట్టిన తేదీ : 2 సెప్టెంబర్ 1971, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు : కొణిదెల వెంకట్ రావు, అంజనా దేవి కొణిదెల
తోబుట్టువులు : చిరంజీవి, నాగేంద్రబాబు, విజయ దుర్గ
భార్య : నందిని (1997 – 2007)
         రేణు దేశాయ్ (2009 – 2012)
         అన్నా లెజ్నేవా (2013 – ప్రస్తుతం)
పిల్లలు : ఆధ్య కొణిదల, అకిరా నందన్,  పోలెనా, మార్క్ శంకర్ పవనోవిచ్

బాల్యం విద్యాభ్యాసం

     ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1968 లేదా 1971న వెంకటరావు మరియు అంజనాదేవి దంపతులకు జన్మించాడు. తెలుగు సినిమా నటుడు చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. సినిమాలో అన్నయ్య చిరంజీవి నటన చూసి నటనపైన ఆసక్తిని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లో పూర్తి చేసాడు. తర్వాత కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

Pawan-Kalyan-Biography-tp-01
                                                                      చిరంజీవి, నాగబాబులతో పవన్ కళ్యాణ్

ప్రారంభ జీవితం

     అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు, మొదటి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి తర్వాత తన పేరును Pawan Kalyan గా మార్చుకున్నాడు. తనదైన నటనతో అభిమానులలో ‘పవర్ స్టార్’ గా ప్రసిద్ధి చెందాడు.

     తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF)ని స్థాపించాడు. ఇది EWS సభ్యులకు సహాయం చేయడంలో ప్రసిద్ధి చెందిన లాభాపేక్షలేని సంస్థ. కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ మరియు మార్షల్ ఆర్ట్ లో నైపుణ్యం సాధించాడు, కొన్ని సినిమాలలో కూడా వీటిని ప్రదర్శించాడు.

     గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, గోపాల గోపాల మరియు అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించాడు. గబ్బర్ సింగ్ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును అందుకున్నాడు, అత్తారింటికి దారేది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.

Pawan-Kalyan-Biography-tp-02

2001లో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, తన అన్నయ్య అయిన చిరంజీవి కోకాకోలా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Pawan Kalyan సినిమా కెరీర్

1990 – 2000 :

1996 సంవత్సరంలో తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైంది.  ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు.

1997 సంవత్సరంలో గోకులంలో సీత సినిమా తన రెండో సినిమా. 

1999 సంవత్సరంలో కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన చిత్రం తొలి ప్రేమ. ఈ సినిమాకి నేషనల్ అవార్డు మరియు 6 నంది అవార్డులు వచ్చింది. ఈ సంవత్సరంలోనే తమ్ముడు సినిమా విడుదలైంది.  

2000 సంవత్సరంలో బద్రి సినిమా విడుదలైంది.

2001-2010 :

2001లో ఖుషీ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి SJ సూర్య దర్శకత్వం వహించారు, ఈ చిత్రం ఆ సంవత్సరం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

2003 సంవత్సరంలో జానీ సినిమాని స్వయంగా వ్రాసి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో రేణు దేశాయ్, Pawan Kalyan నటించారు.

2004 సంవత్సరంలో గుడుంబా శంకర్‌ విడుదలైంది. ఈ సినిమాకి వీర శంకర్ దర్శకత్వం వహించాడు మరియు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగేంద్ర బాబు నిర్మించారు.

2005 సంవత్సరంలో కరుణాకరన్ దర్శకత్వంలో బాలు చిత్రం విడుదలైంది.

2006 సంవత్సరంలో ధరణి దర్శకత్వంలో బంగారం చిత్రంలో Pawan Kalyan నటించాడు. తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించారు. ఇది తమిళ చిత్రం అయిన తిరుపాచికి రీమేక్.

also read  Subhash Chandra Bose Biography | సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర

2008 సంవత్సరంలో విడుదలైన సినిమా జల్సా, దీనిని త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ నిర్మించాడు.  

2010 సంవత్సరంలో SJ సూర్య దర్శకత్వం వహించిన కొమరం పులి సినిమాలో నటించారు. 

2011 – 2020 : 

2011 సంవత్సరంలో తీన్ మార్ సినిమాలో నటించారు. ఇది లవ్ ఆజ్ కాల్ అనే హిందీ సినిమాకి రీమేక్. ఈ సంవత్సరంలోనే పంజా అనే సినిమాలో నటించారు. 

2012 సంవత్సరంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో విడుదలైన గబ్బర్ సింగ్ లో నటించారు. ఇది దబాంగ్ అనే హిందీ సినిమాకి రీమేక్. తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబులో నటించారు.

2013 సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు.

2015 సంవత్సరంలో గోపాల గోపాలలో నటించారు. ఈ చిత్రంలో Pawan Kalyan, వెంకటేష్‌తో కలిసి నటించారు. ఇది OMG అనే హిందీ సినిమాకి రీమేక్.

2016 సంవత్సరంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. ఇది గబ్బర్ సింగ్‌కు సీక్వెల్. 

2017 సంవత్సరంలో కాటంరాయుడు సినిమాలో నటించారు. ఇది తమిళ చిత్రం వీరం సినిమాకి రీమేక్.

2018 సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే సినిమాలో నటించారు. ఇది Pawan Kalyan కి 25 వ చిత్రం. 

2021 –  

2021 సంవత్సరంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్‌ సినిమాతో తిరిగి మళ్ళీ నటించడం మొదలుపెట్టారు.

2022 సంవత్సరంలో భీమ్లా నాయక్ అనే సినిమా లో నటించారు. ఇది అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళం సినిమాకి రీమేక్. 

2023 సంవత్సరంలో దర్శకుడు క్రిష్ తో హరి హర వీర మల్లు సినిమా విడుదలవలస్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్‌తో చిత్రాన్ని నిర్మిస్తూనట్లు ప్రకటించింది.

వివాహం

     పవన్ కళ్యాణ్ 1997 సంవత్సరంలో నందినిని వివాహం చేసుకున్నాడు. 2001లో కళ్యాణ్ నటి అయిన రేణు దేశాయ్‌తో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వీరికి అకిరా నందన్ అనే కుమారుడు 2004లో జన్మించాడు. విడాకులు ఇవ్వకుండానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అని నందిని పవన్ కళ్యాణ్‌పై 2007 జూన్ లో కేసు పెట్టింది.

Pawan-Kalyan-Biography-tp-07
                                                                                 పవన్ కళ్యాణ్, నందిని

     విశాఖపట్నంలోని మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును కొట్టేసింది. తర్వాత జూలై 2007లో కళ్యాణ్ విడాకుల కోసం దాఖలు చేశారు, వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని చెప్పి, విడాకులు కోరాడు. ఆగష్టు 2008లో కోర్టు నందిని కి వన్-టైమ్ సెటిల్‌మెంట్‌గా 5 కోట్ల భరణం ఇప్పించి విడాకులు మంజూరు చేసింది.

Pawan-Kalyan-Biography-tp-04
                                                                             పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్

    2009 లో Pawan Kalyan 8 సంవత్సరాల సహజీవనం తర్వాత దేశాయ్‌ని వివాహం చేసుకున్నాడు. వారికి ఆద్య అనే కూతురు 2010లో జన్మించింది. వీరిద్దరూ కూడా 2012లో అధికారిక విడాకులతో విడిపోయారు. 

Pawan-Kalyan-Biography-tp-06
                                                                                        అకీరా, ఆధ్య

       తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో Pawan Kalyan తన మూడవ భార్య, రష్యన్ పౌరురాలు అయిన అన్నా లెజ్నెవాను కలిశాడు. వారు సెప్టెంబర్ 2013లో హైదరాబాద్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు. 

Pawan Kalyan with 3rd Wife
                                                                         పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నేవా

  ఈ దంపతులకు ఒక కుమార్తె పోలెనా అంజనా పవనోవా మరియు కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు.

also read  Ashika Ranganath Biography | ఆషికా రంగనాథ్ జీవిత చరిత్ర
Pawan Kalyan Childrens
                                                                         పోలెనా, మార్క్ శంకర్

రాజకీయ జీవితం

  • ప్రజారాజ్యం పార్టీ

     పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని 2008లో తన అన్న చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు, సోదరుడి నిర్ణయం పట్ల మౌనంగా ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Pawan Kalyan Prajarajyam
                                                                   ప్రజారాజ్యం పార్టీలో అన్న చిరంజీవితో పవన్ కళ్యాణ్
  • జనసేన పార్టీ

     14 మార్చి 2014 సంవత్సరంలో Pawan Kalyan జనసేన రాజకీయ పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తెలుగుదేశం పార్టీ (TDP) మరియు BJP కూటమి తరపున ప్రచారం చేసాడు. కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకిస్తు కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అనే నినాదాన్ని హిందీలో ప్రచారం చేసాడు.

Pawan Kalyan Jana Sena
                                                          పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్

     రైతులు,  రైతు కూలీలు, మహిళలు, యువత మరియు విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను రాజమండ్రి బహిరంగ సభలో కళ్యాణ్ ప్రకటించారు. కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు – గాజువాక  మరియు భీమవరం. YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో రెండింటిలోనూ ఓడిపోయాడు.  జనసేన పార్టీ రజోల్ లో గెలిచింది. ఇది ఎన్నికలలో గెలిచిన ఏకైక సీటుగా నిలిచింది.

Pawan Kalyan Party Symbol
                                                                             జనసేన పార్టీ గుర్తు

      నవంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న YSR కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్‌ కు నాయకత్వం వహించారు. 

     12 ఫిబ్రవరి 2020న కర్నూల్‌లో దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలీ ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు.  ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

     పవన్ కళ్యాణ్ కి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాన్స్ Pawan Kalyan ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular