Monday, December 9, 2024
Homeఆధ్యాత్మికంSri Kanakadhara Stotram | శ్రీ కనకధారా స్తోత్రం

Sri Kanakadhara Stotram | శ్రీ కనకధారా స్తోత్రం

Sri Kanakadhara Stotram: శ్రీ శంకరాచార్యులచే రచించబడిన Sri Kanakadhara Stotram ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును.

అసలైన వరుస క్రమంలో Sri Kanakadhara Stotram

 

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు  లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నరు.               

శ్రీ శంకరాచార్యులచే రచించబడిన Sri Kanakadhara Stotram ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును.

 

సంకల్పం :

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మాం అకించనానాం ప్రథమం,
పాత్రం అకృత్రిమం దయాయాః

కమలాసన పాణినా లలాటే
లిఖితాం అక్షరపంక్తిం అస్య జంతోః
పరిమార్జయ మాతః అంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

గణపతి ప్రార్ధన :

వందే వందారు మందారం ఇందిరానంద కందలం
అమందానందసందోహం బంధురం సింధురాననం
 

ధ్యాన శ్లోకం :

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం |
ప్రాతర్నమామి జగతాం జననీం, ఆశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం ||

 

కనక ధారా స్తోత్రం (Sri Kanakadhara Stotram)

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళా భరణం తమాలం |
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయాః || 1

ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః || 2 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం
ఆనందహేతు రధికం మురవిద్విషోపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందిరాయాః || 3 

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనంగ తంత్రం |
ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః || 4

కాలాంబుదాలి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ |
మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః || 5

బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీల మయీ విభాతి |
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః || 6 

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః || 7

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 8

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా స్త్రివిష్టప పదం సులభం భజంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః || 9

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమః తిభువనైక గురో స్తరుణ్యై || 10

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై || 11

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై || 12

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై |
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై || 13

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై |
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోద రవల్లభాయై || 14

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై |
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై || 15

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు నాన్యే || 16

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే || 17

సరసిజనిలయే సరోజ హస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం || 18

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం |
ప్రాతర్నమామి జగతాం జననీం, అశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం || 19

 

ప్రక్షిప్త శ్లోకాలు :

బిల్వాటవీ మధ్య లాసత్ సరోజే
సహస్ర పత్రే సుఖసన్నివిష్టాం
అష్టా పదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

 

అంభోరుహం జన్నగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం, మే హృదాయారవిందం

 

ఫల శృతి  :

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రామాం |
గుణాధికా గురుతర భాగ్యభాగినో
భవంతి తే భువి బుధ భావితాశయాః ||

also read  Significance Of Ugadi | ఉగాది ప్రాముఖ్యత

 

సువర్ణ ధారా స్తోత్రం, యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్

 

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం

                                             

         నాలో భక్తిలోపమైనా, శక్తిలోపమైనా, నా బుద్ధిచాంచల్యముచేత ఇందులో ఏ ఇతర దోషమైనా అన్నీ జగత్తుకు తల్లితండ్రులైన మీ దయార్ద్రద్రుక్కులచే నాలోని అన్ని దుర్గునములు, పై పేర్కొన్న విషయములోని అన్ని దోషములు తొలగింపబడి సర్వమూ మీ పాదసేవగా మారుగాక అని నమస్కరిస్తూ…

        హే లక్ష్మీ నారాయణా! మాకందరకూ మోక్షార్హతకు కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఇహంలో ధర్మ కార్యాచరణమునకు కావలసిన పురుషార్థములు శంకరుల భిక్షగా మీవల్ల కలిగి లోకములు సుభిక్షముగా ఉండుగాక.

Sri Kanakadhara Stotram / శ్రీ కనకధారా స్తోత్రం Video

                                                                                        Video Presented by Sanatana Devotional

 

Sri Kanakadhara Stotram తో పాటు మరిన్ని స్తోత్రాల కోసం చూడండి. 

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular