Tuesday, October 15, 2024
Homeఆరోగ్యంHow to get Six Pack Easily | సులభంగా సిక్స్ ప్యాక్ పొందటం ఎలా

How to get Six Pack Easily | సులభంగా సిక్స్ ప్యాక్ పొందటం ఎలా

 

Six Pack : ప్రస్తుత కాలములో యువకులు Six Pack ఆబ్స్  పై ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కఠినమైన ఆబ్స్ అంటే చాలు ఈ కాలం యువతలో తెలియని పిచ్చి (ఆనందం). సిక్స్ ప్యాక్ కోసం ముందుగా బాన పొట్టను కరిగించాలి, కేవలం పొట్టకు మాత్రమే వ్యాయామం చేస్తే చాలదు. వ్యాయామానికి తగ్గట్లు ఆహారాన్ని తీసుకోవాలి. Six Pack పొందే సులువైన పద్దతుల గురించి కింద తెలుసుకుందాం.

    సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందడానికి రహస్యమైన పద్దతి  ఏమి లేదు. వివిధ రకాల పద్దతులను మరియు వ్యాయామాలు అనుసరిస్తూ, సులభంగా Six Pack ను పొందవచ్చు.చాలా మందికి వారి జాబ్స్ వల్ల తగినంత సమయం దొరకక శరీరంపై శ్రద్ద వహించరు, కానీ మీ అలవాట్లలో కొన్ని మార్పులను చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ కింద విధంగా వ్యాయామాలతో పాటు మీరు తినే అలవాట్లని మార్చుకుంటే చాలు. సిక్స్ ప్యాక్ ఆబ్స్ సులభంగా పొందటానికి అలవాట్లలో చేయాల్సిన మార్పుల గురించి కింద పేర్కొనబడింది.  

Six Pack కోసం కోర్ కండరాలపై వ్యాయామం

    Six Pack అబ్స్ పొందడానికి మీరు చేయాల్సిందల్ల మీ ఉదరం పైన కొవ్వుని కరిగిస్తే చాలు. మీరు ఒక్కసారి మీ ఉదరం పైన కొవ్వు ని తొలగించుకోగానే మీకు ఫోర్ ప్యాక్, Six Pack లేదా ఎయిట్ ప్యాక్ తెచ్చుకోవచ్చు. మీరు మొదట కోర్ కండరాలపై వ్యాయామం మొదలుపెట్టాలి. రివర్స్ క్రంచెస్ వల్ల మీ కింద అబ్స్ బలపడుతాయి. రివర్స్ క్రంచెస్ అంటే క్రంచెస్లగానీ కానీ మీరు మీ కాళ్ళని మీదకు లేపాలి. మొదట కింద పడుకొని మీ చేతులని అర చేతులు కిందకు ఉండేలా కింద పెట్టండి తరువాత మీ కాళ్ళను పైకి తల వైపు లేపి కొంచం సేపు ఆపి మళ్ళి కిందకు పెట్టండి. లేదా మీరు ప్లాంక్ సహాయం కూడా తీసుకోవచ్చు. 

సారాంశం

Six Pack పొందడానికి పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం అవసరం, ఇది వివిధ రకాల ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల ద్వారా సాధ్యపడుతుంది.

బరువుకి సంబంధించిన శిక్షణ

     శక్తి సంబంధిత శిక్షణ మరియు బరువుకి సంబంధించిన శిక్షణలు చాలా ముఖ్యమైనవి వీటి వల్ల మీకు బలమైన భుజాలు, చేతులు మరియు వెన్నుముక కూడా కావాలి. మీ అబ్స్ మాత్రమే కాకుండా మీ శరీరం కూడా బలంగా ఉండాలి. బరువుకి సంబంధించిన శిక్షణ వల్ల మీ కండరాలకు మంచి ఆకారంతో పాటు, మీ జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. జిమ్ లో బరువులు ఎత్తినపుడు మీ కండరాలు పెరుగుతాయి, ప్రతి శరీర భాగంఫై వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంలో సమతుల్యం ఏర్పడుతుంది.

కార్డియో బ్లాస్ట్

     మీ ఉదరం పైన కొవ్వుని కరిగిచడం, వల్లనే మీరు Six Pack అబ్స్ పొందగలరు. వెయిట్ లిఫ్టింగ్ ఎంత ముఖ్యమో, కార్డియో వ్యాయామాలు కూడా అంతే ముఖ్యం. కార్డియో అనగానే రన్నింగ్ ఒకటే కాదు స్విమ్మింగ్ లేదా టెన్నిస్ లాంటి అరుదైన ఆట లేదా సైక్లింగ్, బాక్సింగ్, డ్యాన్సింగ్ ఎదైన మీకు నచ్చిన వాటిని చేయండి. మీ వ్యక్తిగత వ్యాయమ ప్రణాళికను తయారు చేసుకొండి దాని వల్ల మీరు చూస్తుండగానే Six Pack తెచ్చుకోవచ్చు.

six-pack-tp-01

కార్బోహైడ్రేట్స్

     మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. తెల్ల కార్బోహైడ్రేట్స్ ని ఎంచుకోండి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణం చెందించబడతాయి. బ్రౌన్ రైస్ , క్యునోవ, ఒట్స్ వీటి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

six-pack-tp-04

సారాంశం

నిద్ర మరియు ఒత్తిడి స్థాయిలు వంటి జీవనశైలి కారణాల వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది, ఇది మీ సిక్స్ ప్యాక్ అబ్స్ యొక్క లుక్ ని ప్రభావితం చేస్తుంది.

 ప్రోటీన్స్

     తరుచు జీమ్ కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్స్ గురించి మాట్లాడం వీనే ఉంటారు, ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన కండరాలు పెరుగుతాయి. ఈ మద్య కాలం పరిశోధనలో ఉదయం భోజనంలో 35గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల రోజులో తక్కువ ఆకలి అవుతుందని తేలింది. కోడి గుడ్లు, పెరుగు, బకాన్, లీన్ మీట్, చికెన్, పండ్లు లాంటివి తీసుకోవాలి. 

సారాంశం

పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్లబరువు మన అధినంలో ఉంటుంది.

also read  What is Intermittent Fasting in Telugu | ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి

నీరు మరియు నిద్ర

     జ్యూస్, సోడా మరియు పండ్ల రసాలు నీళ్లకు బదులుగా తాగకండి. దీని వల్ల అవసరం లేని క్యాలరీలు శరీరానికి అందిచినట్లు అవుతుంది. అంతే కాకుండా, మీ శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. రోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు నిద్ర చాలా అవసరం.

six-pack-tp-03

చివరగా

     పైన చెప్పినట్లుగా తగినంత నిద్ర లేకపోవడం మరియు ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోవడం వల్ల దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి పునాది వేసినట్లు అవుతుంది. కార్డియో వ్యాయామాలు మీ దినచర్యలో భాగం అవ్వాలి. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. జ్యూస్ బదులుగా నీరు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

six-pack-tp-02

     సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం సులువు కాదు, కానీ ఓపికతో చేస్తే ఫలితాలు ఇట్టే కనబడుతాయి.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular