Goa: భారతదేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ఉన్న 20 ఏళ్ల యువత నుండి 60 ఏళ్ల వృద్దుల వరకూ ఉత్సాహంగా గడపాలంటే గుర్తొచ్చే ప్రదేశం గోవా. అందుకే హాలిడేస్ ను ఎంజాయ్ చేయాలంటే గోవా వెళ్లాల్సిందే.
పని ఒత్తిడి నుండి ఉపసమనం పొందేందుకు చాలా మంది అనేక ప్రాంతాలకు వెళుతుంటారు. దేవాలయాలు, పుణ్య క్షేత్రాలు సందర్శిస్తుంటారు. కొంత మంది ముఖమైన ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తారు. టూరిస్టులు మన దేశంలో ఎక్కువగా సందర్శించే ప్రదేశం గోవా. గోవాలోని బీచ్‌లు, చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్ టూరిజం వంటివి పర్యాటకుల్ని ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
Goa ప్రధానంగా ప్రేమికులు, హనీమూన్ జంటలకు బాగా నచ్చుతుంది. ఇక్కడి అందాలను చూసేందుకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.
సముద్ర తీరం దగ్గర ఉన్న పర్యాటక ప్రాంతం Goa. విశాలమైన సముద్ర తీరం, అందమైన బీచ్‌లు, వారసత్వ కట్టడాలు, విలువైన వన సంపద ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక నగరంగా మార్చాయి. అరేబియా మహా సముద్రానికి అంచున ఉండే ఈ తీర ప్రాంతాన్ని ‘కొంకన్ తీరం’ అని అంటారు. ముంబైకి దాదాపు 591 km, బెంగుళూరుకి 553 km దూరంలో గోవా రాష్ట్రం ఉంది. దేశంలో జనాభా పరంగా 4వ స్థానంలో, వైశాల్యం పరంగా 2వ అతి చిన్న రాష్ట్రంగా గోవా ఉంది.
చరిత్ర
గోమాంటక్ అని గోవాను పిలిస్తారు. మహాభారతంలో గోవాను గోవపురి, గోపకపురి, గోపక పట్టణం అనే పేర్లతో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. కానీ గోవా అని పేరు రావడం పట్ల స్పష్టమైన ఆధారాలు లేవు.
గతంలో మౌర్యులు, శాతవాహనులు, బాదామీ చాళుక్యులు, దక్కన్ నవాబులు గోవాను పరిపాలించే వారు. 1312లో ఢిల్లీ సుల్తానులు, 1370లో విజయనగర రాజు మొదటి హరిహరరాయలు, 1469లో బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు.
వర్తకుడు వాస్కోడగామా ఇక్కడికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం పోర్చుగీసు వారి రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 1501లో గోవా రాజైన తిమ్మయ్య తరపున పోర్చుగీసు Afonso de Albuquerque బహమనీ రాజులను ఓడించాడు. గోవాను తమ ఓడలకు స్థావరంగా చేసుకొని పాలించేవాడు.
1947లో బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం లభించినా గోవాకు మాత్రం పోర్చుగీసు పాలన నుంచి విముక్తి లభించలేదు. 1961లో భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. 1987 మే లో గోవాను కేంద్రపాలిత ప్రాంతం మరియు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు.
ప్రత్యేకతలు
కొంకన్ తీరంలో ఉన్న గోవాకు 101 km సముద్ర తీరం ఉంది. అందువలనే ఇక్కడ రకరకాల బీచ్‌లు టూరిస్టులకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. Goa రెవెన్యూ అధిక శాతం పర్యాటక రంగం ద్వారానే వస్తుంది. భారత దేశంలో పర్యటనకు వచ్చే విదేశీ టూరిస్టుల్లో 12 శాతం పైగా గోవాను చూడటానికే వస్తారు.
మందో సంగీతం, కొంకన్ జానపద గీతాలు, గోవా ట్రాన్స్ సంగీతాలకు ప్రజాదరణ ఎక్కువ. వ్యవసాయం, పర్యాటకం, మత్స్య రంగాల ద్వారా ఇక్కడ నివసించే ప్రజలు జీవనోపాధి పొందుతుంటారు. అందుకే వారి ప్రధాన ఆహార పదార్ధాల్లో అన్నం, చేపల కూర తప్పనిసరిగా కనిపిస్తుంది. కొబ్బరి కల్లు ద్వారా తయారు చేసే ఫెని అనే మద్యం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
న్యూఇయర్, గోవా కార్నివాల్ (గోవా తిరునాళ్లు), షిగ్మో పండుగ, వినాయక చవితి, క్రిస్మస్ పండుగలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. దేశంలోని అన్ని బీచ్‌ల కంటే అందమైన బీచ్‌లు గోవాలో ఉండటం వలనే గోవాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ బీచ్‌ల కారణం గానే గోవా ఒక పర్యాటక ప్రాంతంగా ఎదిగింది.
Goa జీవవైవిధ్యం
Goaలో 1424 km2 మే ల అభయ అరణ్యం వ్యాపించి ఉంది. అనేక రకాల వృక్ష, జంతు జాతులకు ఇది నివాసంగా ఉంది. గోవాలో మామిడి, జీడి మామిడి, టేకు, పనస, ఫైనాపిల్ దీనితో పాటు అధిక సంఖ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. విదేశీ పక్షులు, మైనాలు, కింగ్ ఫిషర్ పక్షులు, రామ చిలుకలు ఇక్కడ ఎక్కువ కనిపించే పక్షులు. వంటివి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దానికి ఇక్కడ అనేక రకాల జాతీయ అభయ అరణ్యాలు నిర్మించబడ్డాయి. అంటే సలీం అలీ పక్షి ఉద్యానవనం, మహావీర్ వన్య ప్రాణి రక్షిత వనం, కోటియాగో వన్య ప్రాణి రక్షిత వనం లాంటివి.
వారసత్వ కట్టడాలు
పోర్చుగీసు వారు పరిపాలించిన కాలంలో నిర్మించబడిన అనేక వారసత్వ కట్టడాలు ఇప్పటికీ ఇక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఉత్తర Goaలో పోర్చుగీసు వారు తమ రక్షణ కోసం నిర్మించిన ఆగూడా కోట స్థావరం, ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపబడిన బామ్ జీసస్ బసిలికా, ఫౌంటెన్ హాస్‌లు చూడదగ్గ ప్రదేశాలు.
ఆధ్యాత్మికం
యోగాభ్యాసాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఏటా విశేషంగా పెరుగుతోంది. ధ్యానం, హీలింగ్, యోగా తరగతులు ఇలా ఆధ్యాత్మికతను నింపే అన్ని పద్దతులను పర్యాటకులు ఇక్కడ నేర్చుకోవచ్చు. సరైనా యోగా సాధనాలు నేర్చుకోవాలని కూడా టూరిస్టులు గోవాకు వస్తుంటారు.
Goa చేరుకునే మార్గాలు
ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షలకు మందికి పైగా టూరిస్టులు గోవాను సందర్శిస్తుంటారు. గోవా ప్రసిద్దమైన హాలిడే స్పాట్ కావడంతో అన్ని రవాణా మార్గాల ద్వారా అనుసంధానించబడి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వాయి మార్గం ద్వారా గోవాకు చేరుకోవాలంటే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లేదా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది.
ముంబై ప్రధాన నగరం ఉండటం వలన విమానాలు, రైల్వే, రోడ్డు మార్గం ద్వారా గోవాకు సులభంగా చేరుకోవచ్చు. ఎటుచూసినా పచ్చదనం, నీలంరంగులో సముద్రాలు, ప్రశంతమైన ఆకాశం ఇలా రక రకాల రంగులతో ఈ తీర ప్రాంత నగరం సుందరంగా ఉండి, విదేశీ టూరిస్టులను సహితం విశేషంగా ఆకర్షిస్తూన్నాయి.