Tuesday, October 15, 2024
Homeపర్యాటకంTirumala Brahmotsavam 2022 Dates | తిరుమల బ్రహ్మోత్సవాలు 2022 తేదీలు

Tirumala Brahmotsavam 2022 Dates | తిరుమల బ్రహ్మోత్సవాలు 2022 తేదీలు

 

Tirumala Brahmotsavam : ఈ సంవత్సరం తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ నేరుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభం అవుతాయి ? ఎన్ని రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు? ఏయే రోజు ఎలాంటి ఉత్సవాలను జరుపుకుంటారు? ఇలా బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం…

     తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు.

     ఈ సంవత్సరం తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ నేరుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నెల అంటే సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలలో భక్తులకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం రాలేదు.

     Tirumala Brahmotsavam సెప్టెంబర్ 26వ తేదీన అంకురార్పణ, 27వ తేదీ సాయంత్రం 5:15 నుంచి 6:15 గంటల మధ్యలో మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు.

గోవింద నామస్మరణతో

        కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు, అందుకే ఏడాదిలో 365 రోజులు కూడా తిరుమలలో గోవింద నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించడానికి నేరుగా బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. కొన్ని ఆధారాల ద్వారా ఈ బ్రహ్మోత్సవాలు సూమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నాయి.

 

సాలకట్ల బ్రహ్మోత్సవాలు

        ప్రతి ఏడాది సంప్రదాయబద్దంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాహంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆనంద నిలయం నుండి బంగారు వాకిలి  వరకు మరియు ఉప ఆలయాలు, పూజా సామగ్రి, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పుతో సహా అన్నింటిని శుద్ధి చేస్తారు. Tirumala Brahmotsavamలో స్వామి వారి వాహనాలకు ఎంతో విశిష్టత ఉంది.

 

అంకురార్పణతో ప్రారంభం

        వైఖాసన ఆగమనంలోని క్రతువులలో  అంకురార్పణం చాలా కీలకమైనది. బ్రహ్మోత్సవాలను ప్రారంభించే ముందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, విజయవంతంగా జరగాలని కోరుకుంటూ అంకురార్పణంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ మట్టిలో నవధాన్యాలను నాటుతారు. అందుకే ఇది అంకురార్పణం అయ్యింది.

 

Tirumala Brahmotsavam తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు

మొదటి రోజున :

     శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారిని ఏడు తలలున్న పెద్దశేషవాహనంపై ఊరేగిస్తారు.

రెండో రోజున :

     ఉదయం ఐదు తలలున్న చిన్నశేషవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు, అదే రోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు. మద్యాహ్నం స్నపన తిరుమంజనం జరుగుతుంది.

మూడో రోజున :

     ఉదయం సింహవాహన సేవ మరియు రాత్రి ముత్యాపుపందిరి వాహనంపై ఊరేగింపు కనులవిందుగా సాగుతుంది.

నాలుగో రోజున : 

     ఉదయం కల్పవృక్ష వాహనం మరియు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

ఐదో రోజున :

     ఉదయం స్వామి వారిని మోహినీఅవతారంలో పల్లకిపై ఊరేగిస్తారు. రాత్రి స్వామి వారికీ ఇష్టమైన వాహనం అయిన గరుడవాహనం.

ఆరో రోజున : 

     ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం వసంతోత్సవం, సువర్ణరథరంగ డోలోత్సవం మరియు రాత్రి గజవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

ఏడో రోజున :

     ఉదయం సూర్యప్రభ వాహనం అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

also read  Tirumala Theerthalu | తిరుమల తీర్థాలు

ఎనిమిదో రోజున : 

     ఉదయం రథోత్సవం  మరియు రాత్రి అశ్వవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

తొమ్మిదో రోజున : 

     ఆఖరి రోజు ఉదయం చక్రస్నాన వేడుకలతో బ్రహ్మోత్సవాల వేడుకలను ఘనంగా ముగిస్తారు. రాత్రి ధ్వజావరోహణం జరుగుతుంది.

 

శ్రీ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు 2022 తేదీలు

Tirumala Brahmotsavam 2022 సెప్టెంబరు 26 నుండి అక్టోబరు 05 వరకు

 

సెప్టెంబరు 20న కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం (6 AM – 11 AM)

 

Tirumala Brahmotsavam

రోజు

తేదీలు

వారం

సమయం

వాహనం

 

సెప్టెంబరు 26

సోమవారం

7 PM – 8 PM

సేనాధిపతి
ఉత్సవం, అంకురార్పణం

1

సెప్టెంబరు 27

మంగళవారం

5:15 PM – 6:15 PM

బంగారు తిరుచ్చి
ఉత్సవం, ధ్వజారోహణం

9 PM – 11 PM

పెద్దశేషవాహనం

2

సెప్టెంబరు 28

బుధవారం

8 AM – 10 AM

చిన్నశేషవాహనం

1 PM – 3 PM

స్నపన తిరుమంజనం

7 PM – 9 PM

హంసవాహనం

3

సెప్టెంబరు 29

గురువారం

8 AM – 10 AM

సింహవాహనం

7 PM – 9 PM

ముత్యపుపందిరివాహనం

4

సెప్టెంబరు 30

శుక్రవారం

8 AM – 10 AM

కల్పవృక్షవాహనం

7 PM – 9 PM

సర్వభూపాలవాహనం

5

అక్టోబరు 1

శనివారం

8 AM – 10 AM

పల్లకిలో
మోహినీఅవతారం

7 PM నుండి

గరుడవాహనం

6

అక్టోబరు 2

ఆదివారం

8 AM – 10 AM

హనుమంతవాహనం

4 PM – 5 PM

వసంతోత్సవం, సువర్ణరథరంగ డోలోత్సవం (బంగారు రథం)

7 PM – 9 PM

గజవాహనం

7

అక్టోబరు 3

సోమవారం

8 AM – 10 AM

సూర్యప్రభవాహనం

1 PM – 3 PM

స్నపన తిరుమంజనం

7 PM – 9 PM

చంద్రప్రభవాహనం

8

అక్టోబరు 4

మంగళవారం

7 AM నుండి

రథోత్సవం

7 PM – 9 PM

అశ్వవాహనం

9

అక్టోబరు 5

బుధవారం

6 AM – 9 AM

పల్లకీ ఉత్సవం,
తీర్థవారి, అవభృథం, చక్రస్నానం

9 PM – 10 PM

తిరుచ్చి ఉత్సవం,
ధ్వజావరోహణం

  

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular