Thursday, June 20, 2024
Homeటెక్నాలజీWhat is ChatGPT and How to Use | ChatGPT అంటే ఏమిటి, ఎలా...

What is ChatGPT and How to Use | ChatGPT అంటే ఏమిటి, ఎలా వాడాలి

 

ChatGPT : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ChatGPT గురించి మాట్లాడుకుంటున్నారు, ChatGPT గురించి తెలుసుకునే దాని కన్నా ముందు మనం Chatbot గురించి తెలుసుకుందాం…

 

చాట్‌బాట్ (Chatbot) అంటే ఏమిటి? 

     ఈ Chatbotని మొదటిసారిగా మైకేల్ మౌల్దీన్ 1994లో క్రియేట్ చేశారు. దీనిలో స్పెషల్ NLP (Natural Language Processing) Algorithamsని వాడారు. ఈ రోజుల్లో Chatbot అనేది చాలా వ్యాపారాలలో ఉపయోగిస్తున్నారు. చాలా Companies Customer Support  మరియు Technical Support కింద botsనే వాడుతున్నారు. ఇంకా ఈ Chatbots ప్రోగ్రామర్స్ కి బాగా ఉపయోగపడతాయి Codeని Auto Complete చేయడానికి ఈ మధ్య వచ్చిన GitHub Copilot దీనికి ఉదాహరణ మరియు మీరు AI ని ఉపయోగించుకొని మీరు ఒక ఫోటో తీసుకొని దాన్ని వందరకాలుగా మార్చుకోవచ్చు. 

ChatGPT అంటే ఏమిటి? 

     ChatGPT అంటే ‘జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్’ అంటారు. ఇది గూగుల్ ని పోలి ఉంటుంది. గూగుల్ లో ఎలా అయితే మీరు ఒక విషయం గురించి వెతుకుటారో అలాగే ఈ ChatGPT కూడా సెర్చ్ చేయవచ్చు. ఇది ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ద్వారా పనిచేస్తుంది. ఇందులో 2021 సంవత్సరంకి తర్వాత జరిగిన అన్ని విషయాలను పొందుపరిచారు.

     ChatGPT ద్వారా మనం సాధారణంగా మనుషులతో ఎలా మాట్లాడుతామో అదే విధంగా దీనితో మాట్లాడొచ్చు. ఇది మీకు ఇమేజ్ మరియు వ్యాసాలు మరియు మీరు Programmer అయితే మీ codeని Complete చేయడంలో ఉపయోగపడుతుంది. OpenAI వారి GPT-3.5 లోని భాగమే ChatGPT Software. ChatGPT అనేది ఒక AI, Internet లో చాలా నాలెడ్జ్ ను కలిగి ఉంది.

     ChatGPT పెద్ద మొత్తంలో Text Data ని విశ్లేషించడానికి మరియు ఆ విశ్లేషణ ఆధారంగా ప్రతిస్పందనలను రూపొందిచడానికి అధునాతన Mechine Lerning Algoritham లను ఉపయోగిస్తుంది. వినియోగదారు సందేశాన్ని నమోదు చేసినప్పుడు,  ChatGPT Inputను ప్రాసెస్ చేస్తుంది మరియు సంభాషణ సందర్భంలో సంబంధిత మరియు స్థిరమైన ప్రతిస్పందనను రూపొందిస్తుంది. ఇది ఒక Translater గా కూడా పనిచేస్తుంది. అర్థం అయేటట్లు చెప్పాలంటే ఒక భాష నుంచి వేరే భాషకి సాధారణ మనుషులు మాట్లాడుకున్నట్టుగా మాట్లకుకోవచ్చు.

     మొత్తం మీద, ChatGPT అనేది శక్తివంతమైన మరియు బహుముఖ సహజమైన భాషా ప్రాసెసింగ్ సాధనం, ఇది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో అద్భుతమైన అభివృద్ధి.

Chatgpt-telugu-pencil

ChatGPTతో ఏమి చేయవచ్చు ? 

       ChatGPT అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న Technology. ఇది ఇప్పుడు Feedback Stage లో ఉంది కాబట్టి Users ఇచ్చే Feedback ని బట్టి ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది AI Technology ని ఉపయోగించుకొని మీకు ఏదైనా Concept లేదా Data కావాలంటే సింపుల్ గా ఫాస్ట్ గా ఇస్తుంది.

        దీనిని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు. Youtube లేదా Instagram కోసం Stories రాయమని దీనికి చెప్తే మనకు నచ్చినట్లు రాసి ఇస్తుంది. అంతే కాకుండా Software codes, Poems, Song Lyrics, Jokes ఇలా ఏదైనా అడగొచ్చు. మీరు మొబైల్ కొనాలనుకుంటే ఏ మొబైల్ కొనాలి మరియు స్టూడెంట్స్ Subjects డౌట్స్ గురంచి అడగొచ్చు.

chatgpt-uses-telugu-pencil

ChatGPTని ఎలా వాడాలి ?

        ChatGPT ని ఓపెన్ చేయడానికి ఈ కింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

                                              chat.openai.com

తర్వాత OpenAI account క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి మీరు Singin అయిన తర్వాత మీరు ChatGPT ని use చేయచ్చు. మొదటిగా చిన్న చిన్న Questions అడిగి తర్వాత మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి. ఇది ఇంకా Reserch Stage లో ఉంది. దీన్ని పూర్తిగా ఉపయోగించాలి అంటే కొన్ని రోజులు పడుతుంది.

chatgpt-limitations-telugu-pencil

 ChatGPT  మరియు గూగుల్ మధ్య తేడా ఏమిటి ? 

        ChatGPT అనేది Google కి కొన్ని తేడాలు ఉన్నాయి ChatGPT అనేది మనతో సంభాషణ చేస్తుంది, Google సెర్చ్ ఇంజిన్ ఇంటర్నట్ లో ఉన్న సమాచారాన్ని మొత్తం చూపిస్తుంది.

also read  How to Choose Smartphone | స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఎంచుకోవాలి

        Google అనేది ఒక Search ఇంజిన్ మొత్తం ఇంటర్నెట్ ప్రపంచం Data ని Google దగ్గర ఉంది. వికీపీడియా లోనే ChatGPT కన్నా ఎక్కువ సమాచారం ఉంది.

chatgpt-vs-google-telugu-pencil

ChatGPT మంచిదా చెడ్డదా?    

        మనలో చాలా మంది ఈ ChatGPT టెక్నాలజీ ని చూసి భయపడుతున్నారు దానికి కారణం లేకపోలేదు మొదటిది  ఈ ChatGPT ఏ ఆర్టికల్స్ రాసేస్తే Writer ల పరిస్థితి ఎంటి అని మరియు Chatbot మొత్తం పూర్తి వ్యాసాన్ని సెకన్లలో వ్రాయగలదు దానివల్ల దీని మీద ఆధారపడి Students నేర్చుకోవడం మానేస్తారు దీనివల్ల పూర్తిగా Technology మీద ఆధారపడిపోతారు. దీని వాళ్ళ మానవని మేధస్సు తగ్గిపోతుంది.

        ChatGPT ప్రతిసారి సరి అయిన సమాధానం ఇస్తుంది అన్న నమ్మకం లేదు కావున తప్పుడు సమాచారం నిజం అని నమ్మే ప్రమాదం ఉంది.

        భవిష్యత్లో మనవ మేధస్సుకు సమానంగా తయారయ్యే అవకాశం ఉంది. దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు పోవచ్చు, కొన్ని కొత్త ఉద్యోగాలు రావచ్చు. కాబట్టి దీనిని మనం ఎలా వాడతాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది మంచిదా లేదా చేడుదా అని.       

ChatGPT FAQలు

 • Q) ChatGPT ఉచితం లేదా చెల్లింపు?
 • A) Yes, ప్రస్తుతం ChatGPT ఉచితంగా వాడుకోవచ్చు. ఇప్పుడు Testing Stageలో ఉంది.
 • Q) ChatGPT పరిమితులు ఏమిటి?
 • A) ChatGPT చాల బాగుంది అని అనిపించిన దీనికి కొన్ని హద్దులు ఉన్నాయి. మనం అడిగే Questions ని సరి అయిన రీతిలో అడిగితేనే సమాధానం ఇస్తుంది. ఇది ఇచ్చే సమాధానం పూర్తి Quality ఉంటుందని నమ్మకం లేదు.
 • Q) ChatGPTని ఎవరు రూపొందించారు?
 • A) ChatGPT ని OpenAI అనే సంస్థ నవంబర్ 30, 2022 సంవత్సరంలో ప్రారంభించారు.
 • Q) ChatGPT ఎవరిది?
 • A) ChatGPT Natural Language Processing (NLP) Model దీనిని సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) స్థాపించారు.
 • Q) ChatGPT ని ఎలా వాడాలి?
 • A) కథలు రాయడానికి, Software డెవలపర్ అయితే మీ codes రాయడానికి, టూర్స్ కి ఎలా ఫల్న్ ప్లాన్ చేసుకోవాలి లాంటివి అడగొచ్చు. మీరు డౌట్స్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడి అడుగుతారో అలా దీన్ని అడగొచ్చు.
 • Q) GPT అంటే ఏమిటి?
 • A) GPT అంటే ‘జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్’
Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular