Devi Sarannavarathrulu: ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి 26 సెప్టెంబర్ 2022 సోమవారం నుంచి ప్రారంభమై 5 అక్టోబర్ 2022 బుధవారం శుద్ధ దశమితో ముగుస్తాయి. Devi Sarannavarathrulu గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
Devi Sarannavarathrulu మొదటి రోజు
26 సెప్టెంబర్ ఉ 5:08 ని నుంచి ఉ 7:29 ని వరకు మరియు ఉ 9:01 ని నుంచి మ 12:20 ని వరకు మొదటిరోజు అమ్మవారిని శైలపుత్రి అలంకారంలో పూజించాలి. కట్టే పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి పసుపు లేదా బంగారు రంగు చీరను కట్టాలి. అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజ చేస్తూ దుర్గ అష్టోత్తరం లేదా దుర్గ కవచం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన వారికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టకష్టాలు అన్నీ కూడా ఈ రోజుతో మటుమాయం అయిపోతాయి.
శరన్నవరాత్రి రెండవ రోజు
Devi Sarannavarathruluలో భాగంగా రెండవ రోజు 27 సెప్టెంబర్ మంగళవారం 2022 ఉ 5:08 నుంచి ఉ 8:17 వరకు మరియు ఉ 9:07 ని నుంచి ఉ 10:45 ని వరకు రెండవరోజు అమ్మవారిని బ్రహ్మచారిని అలంకారంలో పూజించాలి. పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి లేతగులాబి రంగు చీరను కట్టాలి. అమ్మవారిని మందర పువ్వులు లేదా గులాబి పూలతో పూజ చేస్తూ లలిత త్రిశతి స్తోత్రం లేదా లలిత అష్టోత్తరం లేదా లలిత సహస్రం ఏదో ఒకటి చదవాలి. ఈ రోజున అమ్మవారిని పూజించిన సంతానం లేక బాధ పడుతున్న వాళ్ళకి ససంతనం కలుగుతుంది. శత్రు పీడా తొలగిపోయి, ధనధాన్య వృద్ధి అన్నింటా విజయం, ఆరోగ్యం లభిస్తాయి.
శరన్నవరాత్రి మూడవ రోజు
28 సెప్టెంబర్ 2022 ఉ 5:08 నుంచి ఉ 11:34 వరకు మూడవరోజు అమ్మవారు చంద్రఘంటా దేవి అలంకారంలో పూజించాలి. కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి నారీంజ లేదా ఆరంజ్ రంగు చీరను కట్టాలి. అమ్మవారిని తామర పువ్వులు లేదా కలువు పువ్వులతో పూజ చేస్తూ గాయత్రి కవచం లేదా గాయత్రి స్తోత్రం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంభందించిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి. అలాగే మన బుద్ధి తేజోవంతం అవుతుంది.
శరన్నవరాత్రి నాల్గవ రోజు
29 సెప్టెంబర్ 2022 ఉ 5:08 నుంచి ఉ 9:53 వరకు మరియు ఉ 10:45 ని నుంచి మ 12:38 ని వరకు నాల్గవరోజు అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో పూజించాలి. చిల్లు లేని అల్లపు గారెలు నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి బంగారు రంగు చీరను కట్టాలి. గులాబీ పూలతోటి, కుంకుమతోటి గాయత్రి కవచం , గాయత్రి స్తోత్రం శ్రీచక్ర ఆరాధన, లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన మనకి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మనకు ఉన్న కష్టాలను, దుఃఖాలను అమ్మవారు తొలగించి మనల్ని కాపాడతారు.
శరన్నవరాత్రి ఐదవ రోజు
Devi Sarannavarathruluలో భాగంగా ఐదవ రోజు30 సెప్టెంబర్ 2022 శుక్రవారం ఉ 5:08 నుంచి ఉ 8:18ని వరకు మరియు ఉ 9:09 ని నుంచి ప 10:17 ని వరకు ఐదవరోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో పూజించాలి. దద్దోజనం, కట్టే పొంగలి నైవేద్యంగా పెట్టాలి. పసుపు లేదా గంధం రంగు చీరను కట్టాలి. మల్లె పూలతో పూజిస్తూ అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ అష్టకం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన వారికి వాక్కుశుద్ది, బుద్ధి వికాశం, సమయస్ఫూర్తి లభిస్తాయి.
శరన్నవరాత్రి ఆరవ రోజు
1 అక్టోబర్ 2022 ఉ 5:09 నుంచి ఉ 8:59 వరకు ఆరవరోజు అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో పూజించాలి. కేసరి నైవేద్యంగా పెట్టాలి. గులాబీ రంగు చీరను కట్టాలి సన్నజాజి, తామర పూలు, సంపెంగలు,కలువ పూలతో పూజ చేస్తూ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రాలు చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన సర్వ మంగల మంగాల్యాలు కలుగుతాయి. అఖండ సౌభాగ్యం ప్రాప్తి కలుగుతుంది.
శరన్నవరాత్రి ఏడవ రోజు
2 అక్టోబర్ 2022 ఉ 5:09 నుంచి ఉ 11:33 వరకు ఏడవరోజు అమ్మవారు కాళరాత్రి దేవి అలంకారంలో పూజించాలి. సకాన్నం నైవేద్యంగా పెట్టాలి. తెల్ల చీరను కట్టాలి. తెలుపు రంగు పూలతో పూజిస్తూ సరస్వతి ద్వాదశి నామాలు, సరస్వతి స్తోత్రాలు చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన మంచి విద్య ప్రాప్తి, వికాసం, వాక్కు శుద్ధి అన్ని కూడా లభిస్తాయి. ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు మంచి విద్యలో రాణిస్తారు, ఉన్నత పదవులు అదిరోహిస్తారు.
శరన్నవరాత్రి ఎనిమిదవ రోజు
Devi Sarannavarathruluలో భాగంగా ఎనిమిదవ రోజు3 అక్టోబర్ 2022 సోమవారం ఉ 5:09ని నుంచి ఉ 7:29 వరకు ఉ 9:00 ని నుంచి 11:26 ని వరకు ఎనిమిదవరోజు అమ్మవారు మహా గౌరి అలంకారంలో పూజించాలి. చక్కర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఎరుపు చీర లేదా బంగారు చీరను కట్టాలి. ఎర్రని పూలతో పాటు ఎర్రని అక్షింతలతో పూజించాలి. దుర్గా సహస్రనామం, దుర్గా స్తోత్రం, దుర్గ సూక్తం, లలితా సహస్రనామం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన మనకి శత్రు పీడ తొలగిపోతుంది. సర్వత్ర విజయం ప్రాప్తిస్తుంది. దుష్ట శక్తులు భూత ప్రేత పీసాచ రక్కసల బాధలు తొలగిపోతాయి.
శరన్నవరాత్రి తొమ్మిదవ రోజు
4 అక్టోబర్ 2022 మంగళవారం ఉ 5:09 నుంచి ఉ 8:15ని వరకు మరియు ఉ 9:48 ని నుంచి ఉ 10:32 ని వరకు తొమ్మిదవరోజు అమ్మవారు సిద్ధి ధాత్రి అలంకారంలో పూజించాలి. పాయసాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎరుపు లేదా బ్రౌన్ లేదా మేరున్ చీరను కట్టాలి. వివిధ రకాల పువ్వులతో పూజ చేయాలి. చండీ సప్తశతి, ఖడ్గమాల స్తోత్రం చదవాలి. ఈ రోజున అమ్మావారిని పూజించిన వారికి ఆపదలు, భయాలు తోలగిపోతాయి.
ఆఖరి రోజు విజయదశమి
Devi Sarannavarathruluలో భాగంగా ఆఖరి రోజు 4 అక్టోబర్ 2022 మంగళవారం ప 1:41 నుండి 5 అక్టోబర్ 2022 బుధవారం ప 11:14 వరకు ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి