Chicken Mandi Biryani : చికెన్ మండి బిర్యానీ ఇష్టమా? అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోండిలా. ఈ వ్యాసంలో Chicken Mandi Biryani చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానంగూర్చి తెలుసుకుందాం.
ఇప్పుడు నగర వాసులను నోరూరిస్తోంది మండి బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండిబిరియానిపై ఆసక్తి చూపిస్తున్నారు. అరబిక్ భాషలో మండి అంటే బిర్యానీ అనిఅర్థం.
అయితే దీనిని తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు. అందుకే బయటకు వెళ్లి తింటూ ఉంటారు. ఈ Chicken Mandi Biryani ని ఇప్పుడు ఇంట్లో కూడా చాలా రుచిగా, సులభంగా తయారుచేసుకోవచ్చు.
పౌష్టిక విలువలు పుష్కలగా ఉన్నాయి
Chicken Mandi Biryani పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా ఎక్కువతినే వారికి కొవ్వు పెరిగి రోగాల బారిన పడుతుంటారు. ఈ Chicken Mandi Biryani మామూలు బిరియానికి భిన్నంగా ఉంటుంది. దానికి కారణం ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడం. ఇందులో బాదం, పిస్తా, కిస్‌మిస్‌వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేస్తారు. ఇందులో పచ్చి మిరపకాయల మిశ్రమం మరియు ఉప్పు తక్కువ మోతాదులో వేస్తారు.
- చికెన్ – 750 గ్రాములు (పెద్ద ముక్కలు)
- బాస్మతీ రైస్ – 4 కప్పులు
- ఉల్లిపాయలు – 1 కప్పు (తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
- వెన్న – 4 టేబుల్ స్పూన్లు
- కుంకుమపువ్వు – కొంచెం
- బాదం – 1 టేబుల్ స్పూన్ (తరిగినవి)
- ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పులు – 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్లు
మండి మసాలా కోసం
- ధనియాలు – 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
- మిరియాలు – 1 టేబుల్ స్పూన్
- నల్ల ఏలకులు –1
- ఆకుపచ్చ ఏలకులు – 10 -12
- లవంగాలు – 8 -10
- దాల్చిన చెక్కలు – 2 మీడియం సైజ్
- సోంపు – 1 టేబుల్ స్పూన్
- జాజికాయ – ¼
- జాపత్రి – 2
Chicken Mandi Biryani తయారు చేసే విధానం
చికెన్ ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండి ప్రత్యేకత. చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేసుకోవాలి.
- ముందు మొత్తం మసాలా దినుసులను పొడి చేసుకోవాలి. ఈ పొడి మసాలాను ఓ గిన్నెలో తీసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, కుంకుమపువ్వు నీరు మరియుపచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
- తర్వాత కడిగిన చికెన్ ముక్కలను తీసుకుని,వాటిపై ఈ మసాలను బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిని 1 నుంచి 2 గంటల పాటు ఊరనివ్వాలి.
- చికెన్ ఊరిన తర్వాత స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో నూనె పోసి, నూనే వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను రెండు వైపులా 10 నుంచి 15 నిమిషాలు తక్కువ మంటలో వేయించాలి.
- దీని కన్నా ముందే బియ్యాన్ని నానబెట్టాలి. కనీసం అరగంట పాటు బియ్యం నీటిలో నానాలి.
- తర్వాత పెద్ద పాన్ స్టవ్పైపెట్టి అందులోకిద్దిగా వెన్న, నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేయాలి. అవి బంగారు గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మండి మసాలాను వేసి రెండు నిముషాల పాటు వేయించాలి.
- నీళ్ళు పోసిచికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత బియ్యం వేసిఉడకనివ్వాలి.
- చివర్లో కొత్తిమీర వేసి, ఇష్టం ఉంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దించేసుకోండి. అంతే రుచికరంగా ఉండే Chicken Mandi Biryani రెడీ.
గమనిక (Note)
- ప్లేట్‌లో బిర్యానీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాంతో సర్వ్ చేయాలి.
- ఈ మండి బిరియాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తే టెస్ట్ అదిరిపోతుంది.
ఈ చికెన్ బిర్యానీని చూస్తుంటే ఏమనిపిస్తోంది… తినాలనిపిస్తోంది కదూ. అంతే కదా… ఇంత చక్కగా, నోరూరించేలా ఉన్నప్పుడు లాగించేయాలి అనిపించడం సహజమే.