Friday, July 26, 2024
HomeవంటకాలుMysore Pak Recipe | మైసూర్ పాక్ తయారు చేసే విధానం

Mysore Pak Recipe | మైసూర్ పాక్ తయారు చేసే విధానం

 

Mysore Pak Recipe : ఈ వ్యాసంలో మైసూర్ పాక్ తయారు  చేయడానికి కావాల్సిన పదార్థాలు,  తయారు చేసే విధానం  గూర్చి తెలుసుకుందాం.

 

Mysore Pak Recipe కావాల్సిన పదార్థాలు ( Ingredients )

  • సెనగపిండి – 1 Cup
  • పంచదార – 3 Cups
  • నూనె – 2 Cups
  • నీళ్ళు – 1 ½ Cup
  • మైదా – 1 టేబుల్ స్పూన్
  • యెల్లో ఫుడ్ కలర్ – కొద్దిగా

Mysore Pak Recipe తయారు చేయు విధానం ( Instructions)

  • సెనగపిండిలో మైదా, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • మైసూర్ పాక్ పోసే అచ్చు పాత్రకి నూనె పూసి పక్కనుంచాలి.
  • అడుగు లోతు మందంగా ఉన్న కడాయిలో పంచదార, నీళ్ళు పోసి పాకం వచ్చేదాకా మరగనివ్వాలి.
  • పాకం మరిగేలోగా, మరో పాన్ లో నూనె పోసి బాగా కాగనివ్వాలి.
  • పాకం మరుగుతున్నప్పుడు అంచుల వెంట సరిగ్గా పాకం రాగానే, వెంటనే మంట మీడియం ఫ్రేంలోకి పెట్టి సెనగపిండి వేసి బాగా కలుపుతూ ఓ పొంగు రానివ్వాలి.

mysore-pak-recipe-telugu-pencil-01

  • పొంగోచ్చిన వెంటనే మరుగుతున్న ఓ గరిటెడు నూనెను పోసి మంట హై ఫ్లేం లోకి పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి.
  • పాకం నూనెని పీల్చుకుని బుడగలు తగ్గాక, మళ్ళీ ఓ గరిటెడు నూనె పోసుకుని హై ఫ్లేం మీదే కలుపుతూ ఉండాలి.
  • తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత ఒక్కసారిగా మిగిలిన వేడి నూనె మొత్తం పాకంలో పోసి కలపాలి. కలుపుతున్నప్పుడు ఒక్కసారిగా పొంగోతుంది. అప్పుడు వెంటనే అచ్చు పాత్రలోకి ఒక్కసారిగా పోసేయాలి.

mysore-pak-recipe-telugu-pencil-02

  • పాకం పోసిన వెంటనే 2 టేబుల్ స్పూన్లు పంచదార చల్లుకోవాలి.
  • పాకాన్ని 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తరువాత బ్లేడ్ తో ముక్కలుగా కట్ చేసి 5 గంటలు చల్లారనివ్వాలి.
  • 5 గంటల తరువాత బ్లేడ్ తో మల్లి ముక్కలు కట్ చేస్తే సులభంగా వస్తాయి.

గమనిక (Note)

  • కడాయి ఎప్పుడూ, చేసే కొలతకి 3 ఇంతలు ఉండాలి. అంటే కిలో మైసూర్ పాక్ చేయాలంటే 3 కిలోలు చేసేంత కడాయి అవసరం అవుతుంది.
  • కడాయిలో నూనె పోసి బాగా వేడిగా సలసల మరగపెట్టాలి, అప్పుడే మైసూర్ పాక్ బాగా వస్తుంది.
  • ముందుగానే సెనగపిండిని జల్లించి నూనె పోసి కలిపితే రవ్వ మాదిరిగా అయ్యి, పాకంలో వేసాక వెంటనే కరిగిపోతుంది, పాకంలో గడ్డలు గడ్డలుగా అవ్వకుండా ఉంటుంది.
  • పంచదార పాకం కచ్చితంగా ఓ తీగ పాకం రావాలి. లేత పాకం వస్తే విరిగిపోతుంది. ముదురు పాకం వస్తే గట్టిగా రాయిలా అవుతుంది.
mysore-pak-recipe-telugu-pencil-03
  • పాకం మరుగుతున్నపుడు అంచుల వెంట 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు చల్లుకోవాలి. మరుగుతూ చిక్కబడుతున్న పాకం కడాయికి అంటుకుని పాకం నల్లబడుతుంది. అచుల వెంట నీళ్ళు చల్లి పాకాన్ని కలుపుతూ ఉంటే మైసూర్ పాక్ రంగు మారదు.
  • సెనగపిండి పాకంలో పోసే టైంకి నూనె సలసల మరుగుతుండాలి.
  • పాకంలో వేసిన సెనగపిండి ఒక్క ఉడుకు రాగానే మరుగుతున్న నూనె పోసి హై-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఉండాలి. లేదంటే పాకం గుల్లగా రాదు. మైసూర్ పాక్ పాకం మొత్తం హై ఫ్లేం మీదే చేయాలి.
  • పాకం తయారయ్యాక అచ్చుగా పోసేందుకు కావలసిన పాత్రను ముందే సిద్దంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద నుండి దిమ్పాక ఎమాతరం ఆలస్యం చేసినా క్షణాల్లో మైసూర్ పాక్ రుచి, రూపం మారిపోతుంది. అందుకే వెంటనే పోసేయాలి అచ్చు పాత్రలో.
  • అందుకే మైసూర్ పాక్ మొదలు పెట్టడానికి ముందే అచ్చు పాత్రకి నూనె పట్టించి ఉంచుకోవాలి.
  • ఆఖరున అంటే పాకం అచ్చు పాత్రలో పోసాక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
  • యెల్లో ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేయోచ్చు.
  • మైసూర్ పాక్ కి యాలకల పొడి లాంటివి అవసరం లేదు. కమ్మగా వేగిన సెనగపిండి అరోమా చాలా బాగుంటుంది.
  • మిగిలిన నూనె అంతా చోవర్లో ఒక్క సారిగా పోసేసి కలపాలి, అప్పుడు పొంగుతుంది. ఆ పొంగు చాలా అవసరం. ఆఖరున వచ్చే ఆ పొంగే మైసూర్ పాక్ లో గుల్లగా మిగిలి ఉంటుంది.
  • పొంగిన పాకం ఒక్కసారిగా అచ్చు పాత్రలో పోసేయాలి. లేదంటే పొడిపొడిగా అవుతుతుంది. మైసూర్ పాక్ ని వేడి మీదే కత్తితో కాక బ్లేడ్ తో కట్ చేసుకుంటే సరిగా వస్తుంది షేప్.
  • మైసూర్ పాక్ ని 4-5 గంటలు చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టి చల్లార బెట్టకూడదు.
  • మైసూర్ పాక్ లో 10% వేస్ట్ అవుతుంది. ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని విరిగిపోతాయి.
also read  Chicken Mandi Biryani Recipe | చికెన్ మండి బిర్యానీ తయారు చేసే విధానం
Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular