Tuesday, October 15, 2024
Homeభగవద్గీతSrimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 14-30) |...

Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 14-30) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 14-30)

 

Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 14-30) :

అథ ప్రథమోఽధ్యాయః

అర్జున విషాద యోగః

 

 

శ్లో || తతః శ్వేతై ర్హయై ర్యుక్తే మహతి  స్యందనే స్థితౌ |

       మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ  ప్రదధ్మతుః || 14

 

తా || అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్పరథంలో కూర్చున్న మాధవుడూ, అర్జునుడూ దివ్యశంఖాలను ఊదారు.

 

శ్లో || పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః |

       పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15

 

తా || పాంచజన్యాన్ని  హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌండ్రమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడూ ఊదారు. 

 

శ్లో || అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |

       నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 16

 

తా || కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష మణిపుష్పకాలనే వాటిని నకుల
సహదేవులు ఊదారు.

 

శ్లో || కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |

       ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః || 17

 

తా || ఓ రాజా! గోప్పధనువు కలిగిన కాశీరాజూ, మహారథుడైన శిఖండీ, ధృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ- 

 

శ్లో || ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

       సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || 18

 

తా || ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

 

శ్లో || సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |

       నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19

 

తా || ఆ ధ్వని భూమ్యాకాశాలలో మారు మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

 

శ్లో || అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజః |

       ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః || 20

 

శ్లో || హృషీకేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే |

 

తా || రాజా! అప్పుడు యుద్ధానికి సిద్ధమై నిలబడి వున్న కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు బాణాలు
వదలడానికి ధనువు నెత్తి
, హృషీకేశునితో ఈ విధంగా అన్నాడు.

 

అర్జునఉవాచ :

 

శ్లో || సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత || 21

 

శ్లో || యావదేతా న్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్ |

       కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే || 22

 

అర్జునుడన్నాడు:

 

తా || అచ్యుతా! యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి వుంటుందో వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం చేయగోరి నిలుచున్న వీరినందరినీ చూడడానికి వీలుగా రెండు సేనలకి మధ్య నా రథాన్ని నిలబెట్టు.

 

శ్లో || యోత్స్యమానాన వేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః |

       ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః || 23

 

తా || దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియం చేయగోరి యుద్ధం కోసం ఎవరెవరు ఇక్కడ సమావేశామైనారో వాళ్ళని నేను చూస్తాను.

 

సంజయ ఉవాచ:

 

శ్లో || ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత! |

       సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24

 

సంజయుడు అన్నాడు :

తా || ఇలా అర్జునుడి చేత అడగబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి,

 

శ్లో || భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

       ఉవాచ పార్థ! పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి || 25

 

తా || భీష్మ ద్రోణులకి మరియు రాజులందరికి ఎదురుగా (రథం నిలిపి) “పార్థా! సమావేశమై యున్న ఈ
కురువుల్ని చూడు” అన్నాడు.

 

శ్లో || తత్రాపశ్యత్  స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |

       ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్తథా || 26

 

తా || అప్పుడు అర్జునుడు తండ్రులని, తాతలని, గురువుల్ని, మేనమామల్ని, అన్నదమ్ముల్ని, కుమారులని, మనుమలని చూచాడు

 

శ్లో || శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయో రపి |

       తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూ నవస్థితాన్ || 27

 

తా || ఇంకా అర్జునుడు, మామలనీ, సజ్జనులనీ, రెండు సేనలలోను నిలబడి వున్న యావన్మందీ బంధువుల్ని సమీక్షించి,

also read  Srimad Bhagavad Gita Dhyana Slokas | శ్రీమద్భగవద్గీత (గీతా ధ్యాన శ్లోకాలు)

 

శ్లో || కృపయా పరయాఽఽవిష్టః విషీదన్నిద మబ్రవీత్ |

 

అర్జునఉవాచ:

శ్లో || దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్ || 28

 

అర్జునుడు అన్నాడు :

తా || మిక్కుటమైన కరుణ ఆవహించగా విషాదంతో అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణా! యుద్ధం చేయగోరి సమావేశమై వున్న నా ఈ బంధువులను చూడగా; 

 

శ్లో || సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |

       వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29

 

తా || నా అవయవాలు శిథిలమౌతున్నాయి. నోరు ఎండిపోతోంది. నా శరీరం వణుకుతోంది. రోమాలు
నిక్కబొడుచుకొంటున్నాయి.

 

శ్లో || గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే |

       న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30

 

తా || గాండీవం చేతిలోంచి జారిపోతోంది. ఒళ్ళు మండుతోంది. నిల్చోడానికి ఓపిక లేకుండా వున్నది. మనస్సు భ్రమిస్తోంది.

 

Previous                                                                                               Next

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular