ఆంజనేయస్వామి షోడశోపచార పూజ ( Anjaneya Swamy Shodashopachara Pooja ) ప్రతి రోజు నిత్య పూజగా లేదా హనుమాన్ జయంతి రోజు ఈ పూజను చేయవచ్చు.
Anjaneya Swamy Shodashopachara Pooja :
Anjaneya Swamy Shodashopachara Pooja కి కావాల్సిన వస్తువులు
దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట,అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.
మార్జనము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)
గణపతి ప్రార్దన
(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
ఆచమనము
1. ఓం కేశవాయ స్వాహా
2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము
చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)
స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.
4. ఓం గోవిందాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః
(కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన
వదలకుండా తన పక్కకి వదలాలి)
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామము
అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం
ప్రాణాయామ విధిప్రోక్తం ఋషిభిః పరికల్పితం
(ప్రాణాయామం చేయండి)
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఆంజనేయ దేవతా ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషేదార్ధం, గో సంరక్షనార్ధం, శ్రీ ఆంజనేయ దేవతా ప్రీత్యర్థే, షోడశోపచార పూజాం కరిష్యే!
(కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి)
ఘంటా నాదం చేస్తూ
(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)
Anjaneya Swamy Shodashopachara Pooja
ధ్యానం
శ్లోకం
మర్కటేశ మహోత్సాహ సర్వ సిద్ధి ప్రదాయక
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో
స్ఫటికాభం స్వర్ణ కాంతిం ద్విభుజంచ కృతాంజలిం
కుండలద్వయ సంశోభి ముఖాంభోజం ముహుర్ముహుః
ఉపచారం
శ్రీ హనుమతే నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆవాహనం
శ్లోకం
రామచంద్ర పదాంభోజ యుగళ స్థిర మానసం
అవాహయామి వరదం హనూమంత మభీష్టదం
ఉపచారం
శ్రీ హనుమతే నమః ఆవాహయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆసనం
శ్లోకం
నవరత్న నిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనం
సౌవర్ణ మానసం తుభ్యం దాస్యామి కపినాయక
ఉపచారం
శ్రీ హనుమతే నమః నవరత్న ఖచిత సింహాసనం మమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పాద్యం
శ్లోకం
సువర్ణ కలశానీతం గంగాది సలిలైర్యుతం
పాదయోః పాద్యమనఘం ప్రతిగుహ్య ప్రసీదమే
ఉపచారం
శ్రీ హనుమతే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
ఆచమనీయం
శ్లోకం
కుసుమాక్షత సంమిశ్రం ప్రసన్నాంబు పరిఫ్లుతం
అనర్ఘ్యమర్ఘ్య మధునా గృహ్యతాం కపి పుంగవ
ఉపచారం
శ్రీ హనుమతే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
శుద్ధోదక స్నానం
శ్లోకం
మధ్వాజ్య క్షీర దధిభిః సగుడైర్ మంత్ర పాలితైః
పంచామృతైః పృధగ్జాతైః స్సించామిత్వాం కపీశ్వర
ఉపచారం
శ్రీ హనుమతే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
వస్త్రం
శ్లోకం
గ్రధితాం నవరత్నైశ్చ మేఖలాం త్రిగునీకృతాం
అర్పయామి కపీశత్వం గృహాణ మహతాం వర
ఉపచారం
శ్రీ హనుమతే నమః నూతన వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)
యజ్ఞోపవీతం
శ్లోకం
శ్రౌత స్మార్తాది కృత్యానాం సాంగోపాంగ ఫలప్రదం
యజ్ఞోపవీత మనఘం ధరయానిలనందన
ఉపచారం
శ్రీ హనుమతే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
గంధం
శ్లోకం
దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం
సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ
ఉపచారం
శ్రీ హనుమతే నమః గంధ సమర్పయామి
(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)
పుష్పం – ఆభరణం
శ్లోకం
నీలోత్పలైః కోకనదైః కల్హార కమలైరపి
కుముదైః పుండరీకైస్త్వాం పూజయామి కపీశ్వర
ఉపచారం
శ్రీ హనుమతే నమః పుష్పాణి సమర్పయామి
(పుష్పాలు సమర్పించవలెను)
ధూపం
శ్లోకం
దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితం
గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతర్పణం
ఉపచారం
శ్రీ హనుమతే నమః ధూపం అఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
దీపం
శ్లోకం
ఘృతవర్తి సముజ్జ్వాలా శతసూర్య సమప్రభం
అతులం తవ దాస్యామి వ్రతపూర్త్యైసుదీపకం
ఉపచారం
శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)
నైవేద్యం
శ్లోకం
మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం
ఆపూప లడ్డుకోపేతం మధురామ్ర ఫలైర్యుతం
హింగూ జీరక సంయుక్తం షడ్రసోపేతముత్తమం
నైవేద్య మర్పయామ్యద్య గృహాణేదం కపీశ్వర
ఉపచారం
శ్రీ హనుమతే నమః నైవేద్యం సమర్పయామి
(జలం సమర్పిస్తూ చదవాలి)
సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణం నమః – అపానం నమః – వ్యానం నమః
ఉదానం నమః – సమానం నమః
(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి
పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
శ్లోకం
నాగవల్లీ దళోపేతం క్రముకైర్మధురైర్యుతం
తాంబూలమర్పయామ్యద్య కర్పూరాది సువాసితం
ఉపచారం
శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)
నీరాజనం
శ్లోకం
ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం
అర్పయామ తవప్రీత్యై అంధకార నిషూదనం
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
ఉమాకాంతయ కంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం
మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః
సర్వైశ్క పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్
ఉపచారం
శ్రీ హనుమతే నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)
మంత్రపుష్పం – నమస్కారం
(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)
శ్లోకం
ఆంజనేయాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యయా
దాస్యామి కపినాథాయా గృహాణ సుప్రసీదమే
ఉపచారం
శ్రీ హనుమతే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
క్షమా ప్రార్ధన– స్వస్తి
(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
యస్య స్మృత్యాచ నమోక్త్యా తపః పూజా క్రియాదిషుః
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని,
యత్పూజితం మాయా దేవి పరిపూర్ణం తదస్తుతే
అనయా యధా శక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః
శ్రీ హనుమతే దేవతా సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు
కలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః
అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః
అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం
లోకాస్సమస్తాః సుఖినో భవంతు
(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.