Srisailam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రము శ్రీశైల పుణ్యక్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము, మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
Srisailam చరిత్ర
ఎందరో రాజులు పూజించి, సేవలు చేసిన మహాక్షేత్రం Srisailam. ఈ ఆలయం రక్షణ కోసం కొంతమంది రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ నిర్మాణాన్ని ఏర్పరిచారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, దూరానికి సైతం బాగా కనిపించే నాలుగు పెద్ద గోపురాలు, అత్యద్భుతమైన కట్టడంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.
శాసనాధారాలు
Srisailam చరిత్రకు ఉన్న ఆధారాలలో మొదటిది క్రీ. శ. 6వ శతాబ్ధం నాటి శాసనం. 6వ శతాబ్దంలో నటి మైసూర్ లోని కదంబరాజుల శాసనంలో Srisailam పేరు ఉంది.
స్థల పురాణం
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం చాలా కాలం తపస్సు చేసి రెండు, నాలుగు పాదాలు కలిగిన వారి చేత మరణం లేకుండా వరం పొందాడు. అరుణాసురడిని చూసి భయపడిన దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై ‘అరుణాసురడు తన భక్తుడు అని, గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అరుణాసురడుని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది’.
దేవతల గురువైన బృహస్పతిని పథకం ప్రకారం దేవతలు అరుణాసురుని దగ్గరికి పంపారు. దేవతల గురువు అయిన బృహస్పతి రాకను చూసి అరుణాసురుడు ఆశ్చర్యం వ్యక్తం చేయగా డానికి బృహస్పతి మనం ఇద్దరం గాయత్రీ మంత్రంతో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నేను ఇక్కడి రావడం వింతేమి కాదు అని అంటాడు. అది విన్న అరుణాసురుడు దేవతలు పూజించే అమ్మవారిని నేను పూజించను అని గాయత్రీ మంత్రం జపించడం మానేస్తాడు. అమ్మవారు భ్రమర (తుమ్మెద) రూపం ధరించి, అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టించి, అరుణాసురుడిని సంహరించింది.
నామవివరణ
శీశైలానికి సిరిగిరి, శ్రీపర్వతం, శ్రీగిరి అనే పేర్లు ఉండేవి. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం అని అర్థం. Srisailam అంటే సంపద గల పర్వతం అని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో కూడా పిలిచే వారు. క్రీ.శ.1313 సంవత్సరంలో ఒక శాశనం ఆధారంగా దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శాశానంలో మహేశ్వరులు శ్రీకైలాసము పైన నివసించారు అని రాసి ఉంది.
రవాణా సౌకర్యాలు
కర్నూలు నుండి 180 కిలోమీటర్లు, హైదరాబాదు నుండి 213 కిలోమీటర్లు, గుంటూరు నుండి 225 కిలోమీటర్ల దూరంలో Srisailam ఉంది.
రోడ్డు మార్గాలు
- హైదరాబాదు నుండి NH-765 రోడ్డు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుంది.
- గుంటూరు నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా NH-765 రహదారి లో ప్రయాణం చేయాల్సి ఉంది.
రైలు మార్గం
- సమీప రైల్వే స్టేషన్లు మార్కాపురం, తర్లుపాడు
విమాన మార్గం
- సమీప విమానాశ్రయాలు కర్నూలు,కడప, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ
శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు
శ్రీమల్లికార్జున స్వామి దేవాలయం
విశాలమైన ప్రకారం లోపల వైపు 4 మండపలతో పాటు వివిధ శిల్ప కళలతో ఎంతో అందమైన దేవాలయం. గర్భగుడిలో మాత్రం ఎటువంటి శిల్పాలు లేవు. ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ శివుడుని మల్లికార్జున స్వామిగా, పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివుని 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది. కాబట్టి హిందువులు తప్పక చూడవసిన క్షేత్రాలలో శ్రీశైలం ఉంది. మల్లెల తీర్థం అనే జలపాతంలో స్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం వస్తుంది అని భక్తుల విశ్వాసం.
భ్రమరాంబిక అమ్మవారి ఆలయం
భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్ప కళలతో అందమైన శిల్పతోరణాలు ఉన్న స్థంబాలతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా పేరుతెచ్చుకుంది. ఈ ఆలయంలో గర్భగుడి వెనుక భాగంలో ఉన్న గోడకు చెవి ఆన్చి వింటే ఝుమ్మనే భ్రమరనాదం స్పష్టంగా వినిపిస్తుంది.
మనోహర గుండము
మనోహర గుండంలో చాలా స్వచ్చమైన నీరు ఉంటుంది. శ్రీశైల ప్రాంతం చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. ఎత్తులో ఉండి కూడా ఇక్కడ ఉన్న నీరు స్వచ్చంగా ఉండటం వేశేషం. కోనేటిలో నాణెం వేస్తే ఆ నాణెం పైకి స్పష్టంగా కనిపించేలా ఇక్కడ నీరు ఉంటాయి.
పంచ పాండవులు దేవాలయాలు
మహాభారతంలోని పంచ పాండవులు మల్లికార్జునస్వామిని దర్శించుకొని వారి పేరున అయిదు ఆలయాలను, ప్రధాన ఆలయం అయిన మల్లికార్జునస్వామి దేవాలయానికి వెనుక భాగంలో నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు.
వృద్ద మల్లికార్జున లింగము
ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది!
పాతాళ గంగ
శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. శ్రీశైలం ఎత్తులో ఉన్నది, నది క్రింద లోయలో ప్రవహిస్తుంది. శ్రీశైలం నుండి మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని పిలుస్తారు. పాతాళ గంగలో నీరు నీలంగా కాకుండా ఆకుపచ్చగా ఉంటుంది. దీనికి కారణం నీటి క్రింద బండలపై పాచి ఉంటుంది దానిపై సూర్య కిరణాల వెలుగు పడటం వలన పచ్చగా కనిపిస్తుంది. అందుకే దీనిని అందరూ పచ్చల బండ అని పిలుస్తారు.
సాక్షి గణపతి ఆలయం
ఇది ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. శ్రీశైలములోని శివుడిని దర్శించిన వారికి మాత్రమే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సాక్షి గణపతే మనము శీశైలముకు వచ్చాము అని సాక్ష్యము చెపుతాడు. అందుకే ఇక్కడ ఉన్న వినాయకుడిని సాక్షి గణపతి అని పిలుస్తారు.
శ్రీశైల శిఖరం
Srisailamలో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. శిఖరదర్శనము అంటే శిఖరం దగ్గరే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, దూరంగా ఉన్న ఎత్తైనకొండపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే మళ్ళి పుట్టవలసిన అవసరం లేదని పునర్జన్మ నుండి విముక్తులు అవుతారు అని భక్తుల నమ్మకం.
ఫాలధార, పంచధారలు
శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి దగ్గరలో అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల్ల నుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే విధంగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం :
శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈ ప్రాంతంలో అద్వైతమత వ్యాప్తి చేస్తున్న సమయంలో, శంకరులు చేసే కార్యములు నచ్చని కొందరు ఆయనను చంపడానికి ఒక పెద్ద దొంగల ముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత డబ్బు ఇచ్చి పంపించారు. ముఠానాయకుడు పెద్ద కత్తితో మాటు వేసి శంకరుని వెనుక నుండి చంపడానికి ప్రయత్నిస్తున్న సమయములో శంకరుని శిష్యుడైన పద్మపాదుడు చూసి శ్రీ లక్షీనరసింహ స్వామిని ప్రార్థించాడు. దొంగల నాయకునిపై ఎటు నుండో హటాత్తుగా ఒక సింహము వచ్చి దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. శంకరులకు ధ్యానము నుండి బయటకు వచ్చిన తరువాత ఈ విషయం చెప్పారు. అంత వరకూ జరిగినది శంకరులకు తెలియదు. ఎక్కువ కాలము ఈ ప్రాంతలో తపస్సు చేసినదానికి గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి.
శివాజీ సాంస్కృతిక, స్మారక భవనం
శివాజీ గొప్ప దుర్గా దేవి భక్తుడు. Srisailamలోని దేవాలయపై ఎన్నోసార్లు దాడి చేయడానికి వచ్చిన వారి నుండి కాపాడి, శ్రీశైలంలోని భ్రమరాంబికా అమ్మవారి చేతులు మీడుగా వీరఖడ్గం అందుకొన్న మహాభక్తుడు. శివాజీ పేరుతో రెండు అంతస్తుల స్మారక భవనం నిర్మించారు. ఈ భవనంలో శివాజీ జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన మొదటి అంతస్తులో, శివాజీ కాంశ్య విగ్రహం రెండవ అంతస్తులో ఉంచారు.
హటకేశ్వరం
ప్రధాన ఆలయం అయిన మల్లికార్జున స్వామి ఆలయం నుండి 3 కి. మీ. దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఈ పరిసర ప్రాంతాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఉండేవారు. పరమ శివుడు ఇక్కడ అటిక (కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని శివునికి అటికేశ్వరుడు అని పేరువచ్చింది. రాను రాను అటికేశ్వరుడు పేరు కాస్త హటికేశ్వరస్వామిగా మారిపోయింది. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. హటకేశ్వరంకి Srisailam నుండి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉంది.
భీముని కొలను
Srisailamలోని సాక్షిగణపతి ఆలయం తర్వాత కుడివైపు పావనాశనం వస్తుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాటలో వెలితే భీముని కొలనువస్తుంది. రెడ్డిరాజులు ఇక్కడ మెట్ల మార్గం నిర్మిచారు. ఈ మెట్ల మార్గంలో 1 కి. మీ. ప్రయాణిస్తే దట్టమైన అడవిలో విశాలమైన లోయ కనపడుతుంది. ఇక్కడున్న మహాద్వారం అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు, వీటికి ఇరువైపులా చెట్లు, వాటికి అల్లుకున్న తీగలు, మనిషంత ఎత్తుండే పుట్టలు, దారి పొడుగునా కనిపించే అద్భుతమైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి.
ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడిస్తే త్రివేణీ పర్వత సంగమానికి చేరుకుంటారు. వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి, చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి జలపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది.
వసతి సౌకర్యాలు
దేవస్థానం వారు Srisailam లో భక్తుల కోసం సత్రములు నిర్మిచారు. ఇక్కడ పెద్ద పెద్ద కాటేజీలు, హోటల్స్ ఉన్నాయి.