శ్రీ దుర్గ దేవి షోడశోపచార పూజ ( Sri Durga Devi Shodashopachara Pooja ) ప్రతి రోజు నిత్య పూజగా చేయవచ్చు. Sri Durga Devi Shodashopachara Pooja
Sri Durga Devi Shodashopachara Pooja
Sri Durga Devi Shodashopachara Pooja కి కావాల్సిన వస్తువులు
దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.
మార్జనము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)
గణపతి ప్రార్దన
(నమస్కారం చేస్తూ శ్లోకంచదవాలి)
ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
దీపారాధన
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే
ఆచమనము
1. ఓం కేశవాయ స్వాహా
2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము
చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)
స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.
4. ఓం గోవిందాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ శంకరం
(ప్రాణాయామం చేయండి)
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, శుభే శోబానే ముహూర్తే, శుభనక్షత్ర, శుభ కరణే, ఏవం గుణ విశేషణా విశిష్టాయాం శుభ తిధౌ, సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం, అస్మాకం సహకుటుంబానాం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, అస్మిన్ దేశే సర్వేషాం జీవానాం, సత్వర సంపూర్ణ ఆరోగ్య సిత్యర్ధం, ధన కనక వస్తు వాహనాది సమృధ్యర్ధం, సర్వతోముఖాభి వృధ్యర్ధం, మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ స్వరూప దుర్గంబికాం ఉద్దిశ్య యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!
( కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి )
ఘంటా నాదం చేస్తూ
(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు
(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)
Sri Durga Devi Shodashopachara Pooja
ధ్యానం
శ్లోకం
హ్రీంకారాసన గర్భితా నల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆవాహనం
శ్లోకం
శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గా చండీం నమామ్యహమ్
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆవాహయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆసనం
శ్లోకం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసన మిదం మహాదేవీ ప్రగృహ్యతామ్
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః నవరత్న ఖచిత సింహాసనం మమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పాద్యం
శ్లోకం
సురాసుర మహా మౌళీ మాలా మాణిక్య కాంతిభిః
విరాజిత పదద్వంద్వే పాద్యం దేవీ దదామ్యహం
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
అర్ఘ్యం
శ్లోకం
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం
శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం శ్రీ శివప్రియే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
ఆచమనీయం
శ్లోకం
పుణ్య తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా
గృహాణాచమనం దేవీ సర్వదేవ నమస్కృతే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
స్నానం
(అమ్మవారి రూపుని పళ్ళెంలో పెట్టి, అవకాశం ఉంటే పంచామృతాలు లేకపోతే కలశంలోని నీళ్ళతో లేకపోతే కలశంలోని పువ్వుతో అభిషేకం చేయండి)
శ్లోకం
పయోదధి ఘృతో పేతం శర్కరా మథు సంయుతం
పంచామృత మిదం స్నానం గృహాణ సురపూజితే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః పంచామృత స్నానం సమర్పయామి
తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(దేవికి నీళ్ళతో స్నానము చేయాలి, అమ్మవారి రూపుని మంచి బట్టతో తుడిచి, గంధం కుంకుమ పెట్టండి)
వస్త్రం
శ్లోకం
పీతాంబర ధరే దేవీ పీతాంబర సహోదరీ
పీతాంబరం ప్రయఛ్చామి విద్యుత్ అంగ జటాధరే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)
యజ్ఞోపవీతం
శ్లోకం
శబ్ద బ్రహ్మాత్మికే దేవీ శబ్ద శాస్త్ర కృతాలయే
సౌవర్ణం యజ్ఞ సూత్రంతే, దదామి పరమేశ్వరీ
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః యజ్ఞోపవీతం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
గంధం
శ్లోకం
కస్తూరీ కుంకుమైర్ యుక్తం ఘనసార విమిశ్రితం
మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః గంధం శ్రీ గంధాన్ ధారయామి
హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి
(పువ్వుతో గంధం తీసుకుని అమ్మవారి చేతులకి పాదాలకు అద్ది పువ్వును పాదాల దగ్గర ఉంచండి, దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)
పుష్పం – ఆభరణం
శ్లోకం
తురీయ వన సంభూతం నానా గుణ మనోహరం
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం ఇదముత్తమం
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి.
(పుష్పాలు సమర్పించవలెను)
శ్లోకం
రత్నస్వర్ణవికారం చ దేహాలంకారవర్ధనం
శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యాతామ్
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి.
అంగపూజ
దుర్గాయై నమః – పాదౌ పూజయామి
కాత్యాయన్యై నమః – గుల్ఫౌ పూజయామి
మంగళాయై నమః – జానునీ పూజయామి
కాంతాయై నమః – ఊరూం పూజయామి
భద్రకాళ్యై నమః – కటిం పూజయామి
కపాలిన్యై నమః – నాభిం పూజయామి
శివాయై నమః – హృదయం పూజయామి
వైరాగ్యై నమః – స్తనౌ పూజయామి
లలితాయై నమః – భుజద్వయం పూజయామి
స్వాహాయై నమః – కంఠం పూజయామి
స్వధాయై నమః – ముఖం పూజయామి
సునాసికాయై నమః – నాసికాం పూజయామి
సునేత్రాయై నమః – నేత్రే పూజయామి
రమాయై నమః – కర్ణౌ పూజయామి
సింహవాహనాయై నమః – లలాటం పూజయామి
రుద్రాణ్యై నమః – శిరః పూజయామి
శ్రీ దుర్గాదేవ్య నమః – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ దుర్గాదేవ్యైనమః నాణావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః
ధూపం
శ్లోకం
వనస్పతి రసైర్ దివ్యైః నానా గంధైః సుసంయుతం,
అఘ్రేయః స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః ధూపం ఆఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
దీపం
శ్లోకం
జగచ్చక్షుః స్వరూపంచ ప్రాణరక్షణ కారణం
ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరీ
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)
నైవేద్యం
శ్లోకం
శర్కరా మధు సంయుక్తం, ఆజ్యాదైః అధపూరితం
గృహాణ దుర్గే నైవేద్యం, మహిషాసుర మర్దిని
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి
(నైవేద్యం మీద నీళ్ళు జల్లి అమ్మవారికి చూపించండి)
సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదనాయ స్వాహా – ఓం సమనాయ స్వాహా
(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను )
మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి
తాంబూలం
శ్లోకం
పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)
నీరాజనం
శ్లోకం
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు.
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః కర్పూర నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)
మంత్రపుష్పం
(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)
శ్లోకం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మప్రదక్షిణ నమస్కారం
శ్లోకం
ఉరసా శిరాస దృష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం ప్రాణామోష్టాంగ ఉచ్యతే
యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
ఉపచారం
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
క్షమా ప్రార్ధన – స్వస్తి
(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
శ్రీ దుర్గాదేవ్యైనమః సర్వోపచారాన్ సమర్పయామి
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషుః
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ
యాత్పూజితం మాయా దేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీ దుర్గాదేవ్యైనమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం
తీర్థప్రసాద గ్రహణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను)
అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్
శ్రీ దుర్గాదేవ్యైనమః ప్రసాదం శీరసా గృహ్ణామి
(కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ ఇది చదవండి)
ఓం సహనావవతు | సహనౌభునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వి నా వధీతమస్తు మా విద్విషా వహై |
ఓం శాంతిః శాంతిః శాంతిః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు
కలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభ రహితో
బ్రహ్మణా సంతు నిర్భయః అపుత్రాః పుత్రిణః పంతు
పుత్రిణ స్సంతుపౌత్రిణః అధనాః సాధనాః సంతు జీవంతు
శరదాం శతం
లోకాస్సమస్తాః సుఖినో భవంతు
(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.