Thursday, June 20, 2024
Homeబిజినెస్5 Best Ways to Earn Money Online in Telugu | Onlineలో డబ్బు...

5 Best Ways to Earn Money Online in Telugu | Onlineలో డబ్బు సంపాదించడానికి 5 సులువైన మార్గాలు

        

Earn Money Online : ఈ వ్యాసంలో 5 మార్గాలలో ఆన్లైన్‌ ద్వారా డబ్బుని ఏవిధంగా సంపాదించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం.

Earn Money Online     

     మనలో చాలా మంది డబ్బును ఎక్కువ రెండు రకాలుగా సంపాదిస్తుంటారు, ఉద్యోగం చేసి కొందరు వ్యాపారం చేసి కొందరు డబ్బు సంపాదిస్తుంటారు. కానీ కొందరికి ఎలా సంపాదించాలి అనేది ఒక ప్రశ్నగా నిలిచిపోతుంది. మనం ఈ వ్యాసంలో ఆన్లైన్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ఆన్లైన్‌లో డబ్బు సంపాదించడం అనగానే డేటా ఎంట్రీ (Data Entry) జాబ్స్ అని అనుకుంటారు. కానీ అదికాదు. మరి అవేంటో ఆలస్యం చేయకుండా చూద్దాం.

YouTube (యూట్యూబ్)

     మనం రోజు ఉపయోగించే యూట్యూబ్ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. మీకు బాగా అవగాహన ఉన్న విషయం మీద వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెట్టండి. ఉదాహరణకు మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుందాం మీరు రోజు ఇంగ్లీష్ సబ్జెక్టు గురించి మీ మొబైల్ లో వీడియోస్ రికార్డ్ చేసి కొంచెం ఎడిట్ చేసి యూట్యుబ్ లో Upload చేయండి.

     మీ వీడియోస్ కి వ్యూస్ వస్తాయి, అలాగే మీ ఛానల్ కి Subscibers రావడం మొదలవుతుంది. వెయ్యి Subscribers మరియ 4 వేల (4000) గంటల వాచ్ టైం (Watch Time) రాగానే మీరు Monetization కు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి MonetizationON అవ్వగానే మీకు Earnings రావడం మొదలవుతుంది. దీనికి మీకు కావలసినది ఓపిక, పట్టుదల మాత్రమే.

youtube-telugu-pencil
                                                                                        Youtube

Blog or Website

     మీకు ఏదైనా ఒక విషయాన్ని, సమాచారంని వ్యాసంల రాసి మీ బ్లాగ్ లేదా వెబ్సైటులో పెట్టండి. ఇలా చెయ్యడం ద్వారా మీ బ్లాగ్ లేదా వెబ్సైటుకు వచ్చే Viewers మీ వెబ్సైటులో ఉన్న యాడ్స్ ని చూసినందుకు మరియు వాటిని క్లిక్ చేసినందుకు గాను మీకు డబ్బులు వస్తాయి. దీనికోసం మీరు చేయవల్సిందల్లా ఒక Website దీనికి వెయ్యి రూపాయాలు దాకా ఖర్చు అవుతుంది. లేదా ఫీగా blog ను ఉపయోగించుకోవచ్చు.

website-teugu-pencil
                                                                                        Website or Blog

Affiliate Marketing     

     నేడు మనం ఏమి కొనాలన్నా ఆన్లైన్ లోనే కొంటున్నాం. కాబట్టి Affiliate Marketing చెయ్యడం ద్వారా మనం పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. 

affiliate-marketing-telugu-pencil
                                                                                      Affiliate Marketing
  • Affiliate Marketing అంటే ఏమిటి? 

     అప్లియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువును మన ద్వారా ఇతరులు కొనడం. ఉదాహరణకు మీ స్నేహితుడు తనకి నచ్చిన ఒక టీవిని ఆన్లైన్లో కొనాలి అనుకుంటాడు. మీరు అతనికి నచ్చిన టీవికి సంబధించిన Link ని మీ అఫ్లియేట్ అకౌంట్ నుండి తనకు పంపి కొనేటట్లు చేస్తే మీకు ఆ వెబ్సైటు ద్వారా కొంత కమిషన్ వస్తుంది. 

  • Affiliate అకౌంట్ ఎలా పొందాలి? 
also read  What is Stock Market | స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి

     మీరు ఏ E-Commerce Site లో అయితే అఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైటు లోకి వెళ్లి Became an Affiliate పై క్లిక్ చేసి సంబంధిత వివరాలను ఇచ్చి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. తర్వాత సైట్ లోని వస్తువులను మార్కెటింగ్ చెయ్యడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మీ మార్కెటింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యండం ద్వారా అవసరం ఉన్న వాళ్ళు దానిపై క్లిక్ చేసి కొంటారు. దాని వల్ల మీరు ఎక్కువ ఆదాయం పొందవచ్చు.   

Facebook Page

     ఫేస్బుక్ పేజి నుండి కూడా డబ్బులు సంపాదించవచ్చు దానికి కావాల్సినవి.

facebook-page-telugu-pencil
                                                                                        Facebook Page
  • Facebook Page

     మీకు ముందుగా ఏదైనా విషయానికి సంబంధించిన ఒక Facebook page ఉండాలి. మీరు create చేసే పేజి అందరికి నచ్చేలా ఉండాలి. కాబట్టి ఎలాంటి పేజి మరియు పోస్టలు పెడితే ఎక్కువ మంది చూసి షేర్ చేస్తారో అలాంటి పేజిలను స్టార్ చేయండి. ఉదాహరణకు కామెడీ, meme pages లాంటివి ఓపెన్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వచ్చు.

  • 10K Followers 

     మీ ఫేస్బుక్ పేజీకి 10K followers ఉండాలి. అప్పుడే Monetization enable అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు డబ్బులు సంపాదించవచ్చు.

  • Videos with at least 3 minutes 

వీడియోస్ upload చేసే ముందు అది 3 నిమిషాలకు మించి ఉండేలా చూసుకోండి. మీ ఫేస్బుక్ పేజిలో facebook ads మాత్రమే కాకుండా మన Affiliate products ల పోస్ట్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అంతే కాకుండా కొన్ని advertising కంపెనీస్ యాడ్స్ ని పోస్ట్ చేయడం ద్వారా సంపాదించవచ్చు. 

Freelancer 

     Freelancer లో మనం డబ్బులు సంపాదించాలి అంటే మనకు ఏదైనా ఒక పని పూర్తిగా వచ్చి ఉండాలి. ఉదాహరణకు మీకు Logos బాగా డిజైన్ చేస్తారు అనుకుంటే మీరు Freelancer Website లోకి వెళ్లి మీకున్న నైపుణ్యాలను మొదలైన సమాచారం తిలియజేయాలి. ఇంతకు ముందు మీరు చేసిన Projects ఏవైనా ఉంటే అందులో పొందుపరచాలి. మీ Profile చూసి నచ్చిన వారు మీకు పని ఇస్తారు. ఈ విధంగా మీరు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించవచ్చు.

freelancer-telugu-pencil
                                                                                         Freelancer

గమనిక

     తెలుగు పెన్సిల్‌లో ఇవ్వబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular