Friday, November 8, 2024
HomeవంటకాలుChicken Biryani Recipe | చికెన్‌ బిర్యానీ తయారు చేసే విధానం

Chicken Biryani Recipe | చికెన్‌ బిర్యానీ తయారు చేసే విధానం

 

Chicken Biryani : ఈ వ్యాసంలో చికెన్‌ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం  గూర్చి తెలుసుకుందాం. 

  

     బిర్యానీ రుచి మొత్తం మనం కలిపే చికెన్‌ మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. మొదటి సారి చేస్తున్నట్లయితే కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. Chicken Biryani చేయడానికి కొంత ప్రాక్టిస్ అవసరం. ఒక్కసారి చేయగానే బాగా రాలేదని చాలా మంది వదిలేస్తారు. అలా వదిలేయకుండా తిరిగి ప్రయత్నించాలి. మూడు నాలుగు సార్లు ట్రై చేస్తే బాగా వస్తుంది. ఎంత తిన్నా కూడా… ఇంకా ఆకలి వేస్తే బాగుండు అనిపిస్తుంది. అది బిరియానికి ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు రెస్టారెంట్లలో కంటే చక్కగా మనమే ఇళ్లలో బిరియానిని చేసుకోగలుగుతున్నాం. చికెన్‌ కర్రీ కంటే… బిరియానిని చేయడం చాలా ఈజీ. త్వరగా అయిపోతుంది. మరి ఎలా చెయ్యాలో లేట్ చెయ్యకుండా తెలుసుకుందాం.

 

Chicken Biryani కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతీ బియ్యం :2 కప్పులు
  • చికెన్‌ : అర కిలో
  • ఉల్లిపాయ : ఒకటి పెద్దది ( చిన్నవి అయితే2 )
  • టమాటోలు : రెండు ( ముక్కలుగా తరగాలి )
  • అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
  • కొత్తిమీర : పావు కప్పు తరిగినది
  • పుదీనా : పావు కప్పు తరిగినది
  • పచ్చి మిరపకాయలు :5 నిలువుగా సన్నగా చీల్చినవి
  • నూనె :3  టీస్పూన్లు
  • నెయ్యి :3 టీస్పూన్లు
  • పెరుగు : పావు కప్పు
  • నీళ్ళు : నాలుగున్నర కప్పులు
  • ఉప్పు : తగినంత
  • కారం : 2 టీస్పూన్లు
  • జిలకర్ర పౌడర్ :1 టీస్పూన్
  • పసుపు : పావు టీస్పూన్

 

చికెన్‌ కు పట్టించే మసాల కోసం

  • ఉప్పు : పావు టీస్పూన్
  • నిమ్మరంసం,పెరుగు : 2 స్పూన్లు
  • పసుపు : పావు టీస్పూన్
  • ధనియాల పౌడర్:1 టీస్పూన్
  • గరం మసాలా :1 టీ స్పూన్
  • మిరియాల పౌడర్ : అర టీస్పూన్
  • కారం :1 టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ :1 టీస్పూన్

 

గరమ్ మసాలా కోసం

  • బిర్యానీ ఆకులు :2
  • దాల్చిన చెక్క :4 ముక్కలు
  • ఏలకులు :3
  • లవంగాలు :5
  • జాపత్రి :2
  • మరాటీ మొగ్గ : 2
  • షాజీర : 1
Spices-Telugu-Pencil
                                                                               మసాలా దినుసులు

Chicken Biriyani తయారు చేయు విధానం

  • చికెన్‌ శుభ్రం చేసికొని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. లెగ్ పీసులు ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలానే పెద్ద ముక్కలుగా ఉంచితే రెస్టారెంట్ లుక్ వస్తుంది. ఉప్పు పావు టీస్పూన్, నిమ్మరంసం, పెరుగు 2 స్పూన్లు, పసుపు పావు టీస్పూన్, ధనియాల పౌడర్ 1 టీస్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పౌడర్ అర టీస్పూన్, కారం 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ (ఇంట్లో స్వయంగా చేసింది). వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి చికెన్‌కు పట్టించి ఒక గంట సేపు ఊరనివ్వాలి. అప్పుడే మసాలా చికెన్‌కి బాగా కలుస్తుంది.
chicken-pieces-telugu-pencil
                                                                                చికెన్ ముక్కలు
  • బాస్మతీ బియ్యంను కడిగి 15 నిమిషల పాటు నానపెట్టి వడపోయాలి. సోనా మసూరి బియ్యం కూడా వాడొచ్చు.
basmati-rice-telugu-pencil
                                                                                   బాస్మతి బియ్యం
  • అడుగు మందంగా గల వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యు వేసి వేడి చేయాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీర, ఏలకులు, మరాటీ మొగ్గ, జాపత్రి అన్ని అలాగే కానీ, లేక మొత్తం పొడిగా చేసి కాని వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
also read  Ugadi Pachadi Recipe | ఉగాది పచ్చడి తయారు చేసే విధానం
Frying-in-oil-telugu-pencil
                                                                                      నూనెలో వేయించడం 
  • ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చాక తరిగిన కొత్తిమీర, పూదీన ఆకులు వేసి కలపాలి.
  • తరిగిన టమాటో ముక్కలు వేసి వేయించాలి. ఊరపెట్టిన చికెన్‌కి, పసుపు, కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, ఉప్పు వేసి 5 నుండి 10 నిమిషాలు వేయించి తరువాత నానబెట్టిన బియ్యం వేయాలి. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు పోసి మూతపెట్టాలి.
Fry-the-chicken-telugu-pencil
                                                                                       చికెన్ వేయించడం
  • బియ్యం మరి మెత్తగా ఉడికే దాకా ఉంచకుండా, కొద్దిగా ముందే దించేయాలి. లేకపోతే ముద్దాయి పోతుంది.
chicken-biriyani-telugu-pencil
                                                                                      బిరియాని
  • దించే ముందు తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా పచ్చివి పైన చల్లండి. కొద్ది సేపు తర్వాత సర్వే చేసుకోండి అంతే… Chicken Biryani రెడీ.

     ఈ Chicken Biryani ని చూస్తుంటే ఏమనిపిస్తోంది… తినాలనిపిస్తోంది కదూ. అంతే కదా…  ఇంత చక్కగా, నోరూరించేలా ఉన్నప్పుడు లాగించేయాలి అనిపించడం సహజమే.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular