ఉపవాసం అంటే మనందరికీ తెలిసినదే, ప్రతి మతంలో రకరకాల పేర్లతో వేరు వేరు సమయాలలో ఉపవాసం చేస్తారు. Intermittent Fasting కూడా ఒక రకంగా ఉపవాసం, డైటింగ్ లాంటిదే. ఈ ఫాస్టింగ్‌లో నీళ్ళని బాగా తీసుకోవాలి. కాఫీ, టీ వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
Intermittent Fasting అంటే ఏమిటి?
రోజులో కొన్ని గంటలు ఏమి తినకుండా ఉండటాన్ని ఉపవాసం లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. Intermittent Fasting అంటే ఇష్టమైన ఆహారం రోజులో కొన్ని గంటల పాటు తిని మిగిలిన సమయంలో నీరు మాత్రమే తాగుతూ ఏమీ తినకుండా ఉండటమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఉపవాసం వలన మనకు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఉపయోగాలు కలుగుతాయి.
Intermittent Fasting పద్ధతి
ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని చాలా రకాల పద్దతులతో అమలు చేస్తారు కానీ ఎక్కువ మంది ఉపయోగించే పద్దతి 16:8. రోజుకు 24 గంటలు, అందులో 8 నుంచి 10 గంటల సమయంలో తమకు నచ్చిన ఆహారం తీసుకోని, మిగిలిన 14 నుంచి 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. ఏమి తినకూడదు, నీరు, ఇతర ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే 24 గంటలలో పదహారు (16) గంటలు ఏమి తినకుండా ఉండాలి, మిగిలిన 8 గంటలలో తినడానికి సమయం కేటాయించాలి.
ఉదాహరణకు 11 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే… అప్పటి నుంచి 8 గంటలు అంటే సాయంత్రం 7 గంటల లోపు భోజనం ముగించాలి. తరువాత 7 నుండి మరుసటి రోజు ఉదయం 11 వరకు ఏమి తినకూడదు. దీంతో 16 గంటల ఉపవాసం పూర్తి అవుతుంది. ఈ 16 గంటల సమయంలో నీరు, చక్కర లేకుండా టీ లేదా కాఫీ, పండ్ల రసాలు తాగచ్చు. కానీ అవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలా Intermittent Fasting చేయాల్సి ఉంటుంది.
Intermittent Fasting ఆహారం
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, పిండి పదార్థాలు, చక్కర తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫాస్టింగ్ తర్వాత చేసే భోజనం భారీగా లేకుండా చూసుకోవాలి.
Intermittent Fasting చేయడం ద్వారా మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. జంతువుల మీద చేసిన పరిశోధనల ప్రకారం తక్కువ క్యాలోరీస్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని 30% పెంచుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ ఫాస్టింగ్ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.
మనం లావుగా ఉన్నాం అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువ శాతం ఉంది అని అర్థం, ఇలా ఎక్కువగా ఉన్న కొవ్వుని ఫాస్టింగ్ చేసే సమయంలో మన శరీరం కొవ్వును మనకు కావాల్సిన శక్తి కోసం ఉపయోగిస్తుంది. ఇలా మన శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గి బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ మోతాదు కూడా తక్కువ స్థాయిలో ఉండేలా ఉపయోగపడుతుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపయోగాలు
- Intermittent Fasting చేయడం వలన శరీరానికి చాలా సమయం విరామం లభిస్తుంది. దీంతో అనేక వ్యవస్థలకు అది మరమ్మత్తులు చేసుకుంటుంది. దాని వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.
- ఫాస్టింగ్ మనము త్వరగా ముసలివాళ్ళు కాకుండా ఉంచుతుంది అంటే జీవిత కాలాన్ని పెంచుతుంది.
- ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ (షుగర్) రాకుండా నివారిస్తుంది.
- జ్ఞాపక శక్తిని, మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది.
- షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు ఈ ఫాస్టింగ్ చేస్తే షుగర్ త్వరగా అదుపులోకి వస్తుంది. ఇతర అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
- అధిక బరువు తాగ్గడానికి ఉపయోగపడుతుంది.
- జీర్ణ సమస్యలు ఉండవు.
- కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
గమనిక
తెలుగు పెన్సిల్‌లో ఇవ్వబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే.
మొదట్లోనే Intermittent Fasting ను అతిగా 14 నుంచి 16 గంటలు చేయకుండా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం పొందవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ ఫాస్టింగ్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయడానికి దయచేసి డాక్టర్‌ని సంప్రదించండి.