శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ ( Sri Maha Ganapathi Shodasopachara Pooja ) ప్రతి రోజు నిత్య పూజగా చేయవచ్చు. Sri Maha Ganapathi Shodasopachara Pooja
Sri Maha Ganapathi Shodasopachara Pooja :
Sri Maha Ganapathi Shodasopachara Poojaకు కావాల్సిన వస్తువులు
దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.
మార్జనము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః
(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)
గణపతి ప్రార్దన
(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
ఘంటా నాదం
(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్
ఆచమనము
1. ఓం కేశవాయ స్వాహా
2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా
(పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)
స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.
4. ఓం గోవిందాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(కొంచెం జలం తీసుకొని ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)
ప్రాణాయామము
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ వశంకరం
(ప్రాణాయామం చేయండి)
సంకల్పము
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, సర్వ విఘ్న నివారణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్ధం, గో సంరక్షణార్ధం, శ్రీ మహాగణపతి దేవతా ఉద్దిశ్య, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!
(కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి)
కలశారాధన
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు
(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)
Sri Maha Ganapathi Shodasopachara Pooja
ధ్యానం
శ్లోకం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆవాహనం
శ్లోకం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః ఆవహయామి
(అక్షింతలు సమర్పించవలెను)
ఆసనం
శ్లోకం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పాద్యం
శ్లోకం
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
అర్ఘ్యం
శ్లోకం
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
ఆచమనీయం
శ్లోకం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
పంచామృత స్నానం
శ్లోకం
దధిక్షీర సమాయుక్తం మధ్వాఽజ్యేన సమన్వితం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
శుద్ధోదక స్నానం
శ్లోకం
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలై :
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే
ఉపచారం
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
(జలం సమర్పించవలెను)
వస్త్రం
శ్లోకం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః నూతన వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
యజ్ఞోపవీతం
శ్లోకం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
శ్లోకం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి
(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)
అక్షతలు
శ్లోకం
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయా తండులాన్ శుభాన్
హరిద్రా చూర్ణ సంయుక్తాన్ సంగృహాణ గణాధిప
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షింతలు సమర్పించవలెను)
పుష్పం
శ్లోకం
సుగంధీని చ పుష్పాణి జాజీకుంద ముఖాని చ
ఏకవింశతి సంఖ్యాణి గృహాణ గణనాయక
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి
(పుష్పాలు సమర్పించవలెను)
గణపతి అంగపూజ
ఓం పార్వతీనందనాయ నమః – పాదౌ పూజయామి
ఓం గణేశాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం జగద్ధాత్రే నమః – జంఘే పూజయామి
ఓం జగద్వల్లభాయ నమః – జానునీ పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః – ఊరూ పూజయామి
ఓం వికటాయ నమః – కటిం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః – గుహ్యం పూజయామి
ఓం మహత్తమాయ నమః – మేఢ్రం పూజయామి
ఓం నాథాయ నమః – నాభిం పూజయామి
ఓం ఉత్తమాయ నమః – ఉదరం పూజయామి
ఓం వినాయకాయ నమః – వక్షఃస్థలం పూజయామి
ఓం పాశచ్ఛిదే నమః – పార్శ్వే పూజయామి
ఓం హేరంబాయ నమః – హృదయం పూజయామి
ఓం కపిలాయ నమః – కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః – స్కంధే పూజయామి
ఓం హరసుతాయ నమః – హస్తాన్ పూజయామి
ఓం బ్రహ్మచారిణే నమః – బాహూన్ పూజయామి
ఓం సుముఖాయ నమః – ముఖం పూజయామి
ఓం ఏకదంతాయ నమః – దంతౌ పూజయామి
ఓం విఘ్ననేత్రే నమః – నేత్రే పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం నాగాభరణాయ నమః – నాసికాం పూజయామి
ఓం చిరంతనాయ నమః – చుబుకం పూజయామి
ఓం స్థూలోష్ఠాయ నమః – ఓష్ఠౌ పూజయామి
ఓం గళన్మదాయ నమః – గండే పూజయామి
ఓం కపిలాయ నమః – కచాన్ పూజయామి
ఓం శివప్రియాయ నమః – శిరః పూజయామి
ఓం సర్వమంగళాసుతాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ గణేశాష్టోత్తరశతనామావళిః చదవాలి
ధూపం
శ్లోకం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం అఘ్రాపయామి
(ధూపం చూపించాలి)
దీపం
శ్లోకం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపిస్తూ గంట వాయించాలి)
నైవేద్యం
శ్లోకం
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి
సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)
అమృతమస్తు అమృతోపస్తరణమసి
(జలం సమర్పిస్తూ చదవాలి)
ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా – ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి
ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి,
పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి
తాంబూలం
శ్లోకం
పూగీఫలైస్సకర్పూరైః నాగావల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం సమర్పించవలెను)
నీరాజనం
శ్లోకం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం
నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి
(కర్పూరంతో హారతి ఇవ్వాలి)
మంత్రపుష్పం – నమస్కారం
(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)
శ్లోకం
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక
ఏకదంతైకవదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం
ఉపచారం
శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణం
శ్లోకం
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
మద్విఘ్నం హరమే శీఘ్రం భక్తానామిష్టదాయకా
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీదవరదో భవ
ఉపచారం
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
నమస్కారం
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ
విద్యాధరాయ వికటాయ చ వామనాయ
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు
క్షమాప్రార్థన – స్వస్తి
(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)
ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి
యస్యస్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః
శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
తీర్థం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం
(తీర్థం తీసుకోవాలి)
ఉద్వాసన
శ్లోకం
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తే హ నాకం మహింమానః సచన్తే
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు
కలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః
అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః
అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం
ఓం శాంతిః శాంతిః శాంతిః
లోకాస్సమస్తాః సుఖినో భవంతు
(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)
మరిన్ని పూజావిధానాలు మరియు వ్రతములు చూడండి.