Friday, November 8, 2024
Homeఆరోగ్యంCool Habits for your Healthy Lifestyle | మీ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చక్కని...

Cool Habits for your Healthy Lifestyle | మీ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చక్కని అలవాట్లు

 

Healthy Lifestyle : బిజీ జీవితాల్లో పడి చాలామంది తమ ఆరోగ్యాన్ని అశ్రద్ద చేస్తున్నారు. శారీరకంగాను, మానసికంగాను చాలా బలహీనంగా ఉంటున్నారు. ఫలితంగా జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. ఇక్కడ చెప్పిన టిప్స్ పాటించడం ద్వారా మంచి లైఫ్ స్టైల్‌తో మీరు ముందుకు సాగవచ్చు. 

 

వ్యాయామం మొదలుపెట్టండి

     వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఆటలలో చురుగ్గా ఉండటానికి, ఎముకలను బలంగా చేయడానికి, మన శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.

     ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి దూరం అవుతారు. దీని వలన healthy lifestyle అలవాటు అవుతుంది.

     మిమ్మల్ని మీరు మరింత బలమైన వ్యక్తిగా తయారు చేసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలుపెట్టండి. 

healthy-lifestyle-tp-01

దృఢమైన నమ్మకం కలిగి ఉండండి

    మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీలో ఉన్న శక్తిసామర్ధ్యాలను బయటి ప్రపంచానికి ప్రదర్శించేది మీలోని నమ్మకమే. నమ్మకం కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. అందుకే వీరికి విజయ అవకాశాలు ఎక్కువ. కాబట్టి దృఢమైన నమ్మకం కలిగి ఉండండి. 

healthy-lifestyle-tp-2

చిన్న చిన్న విషయాల్ని సైతం ఆస్వాదించండి

     బంగీ జంప్, స్కూబా డైవ్ నేర్చుకోవాలనే పనులు దీర్ఘకాలంలో చేరుకోవాల్సిన లక్ష్యాలు. అంత పెద్ద లక్ష్యాన్ని చూసి అధైర్యపడకుండా… మీ జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి సంతోషాలను ఆస్వాదించడం మర్చిపోకండి. 

healthy-lifestyle-tp-3

ప్రయాణాలు

     మీ దైనందిన జీవితానికి సెలవు ప్రకటించి ప్రపంచంలోని అద్భుతమైన స్థలాలను సందర్శించండి. ఈ భూమి మీద మీరు చూడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. చేసే పనికి విశ్రాంతి ఇచ్చి వివిధ ప్రాంతాలను, చూడని ప్రదేశాలను అప్పుడప్పుడు సందర్శించండి. దీని వలన healthy lifestyle అలవాటు అవుతుంది.

healthy-lifestyle-tp-4

ధ్యానం చేయడం మెదలుపెట్టంది

     మీ ఆలోచనలను నియంత్రించే అద్భుత శక్తి ధ్యానానికి ఉంది. ధ్యానం ఒత్తిడిని, భావోద్వేగాలను అదుపులో ఉంచడమే కాక మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. క్రమంగా ధ్యానం చేసేవారిలో నిర్ణయం తీసుకునే స్వభావం. స్వయం నియంత్రణ, ఇంద్రియ అవగాహన చురుగ్గా ఉంటాయి. 

healthy-lifestyle-tp-5

కృతజ్ఞత కలిగి ఉండండి

     కృతజ్ఞత భావన వల్ల మీలో సంతోషం పెరిగే అవకాశముంది. ఈ రకమైన భావన మీరి కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని తోటివారిలో స్నేహభావంతో ఉండేలా చేస్తూ, మిమ్మల్ని నిద్రలేని రాత్రులకు దూరంగా ఉంచుతుంది.

healthy-lifestyle-tp-6

ప్రకృతితో మమేకమవ్వండి

     పచ్చని ప్రకృతిలో ఎక్కువసమయం గడిపితే మీరు సంతోషంగా ఉండటంతో పాటు మీలో సృజనాత్మతకత పెరుగుతుంది. పచ్చని ప్రకృతిలో తిరిగితే మీ దేహంలో రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది.

healthy-lifestyle-tp-7

తెలివితేటల్ని పెంచుకోండి 

     సమస్యలను పరిష్కరించడం చేస్తుండడం మంచిది. పరిస్థితులకు తగిన విధంగా మన ఆలోచన విధానం మారాలి. 

healthy-lifestyle-tp-8

వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోండి

     మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనా వారి కోసం కొంత సమయం కేటాయించండి. వ్యక్తిగత సంబధాల మధ్య గొడవలు రాకుండా చూసుకోండి. 

healthy-lifestyle-tp-9

సానుకూల వైఖరిని ఏర్పరుచుకోండి

     మీరు ఎప్పుడైతే సానుకూల వైఖరితో ఉంటారో మీ మేధస్సు కొత్త ఆలోచనలు చేయడం ప్రారంభిస్తుంది. 

healthy-lifestyle-tp-10

అభిరుచిని ఎంచుకోండి

     మీరు ఎంచుకునే హాబీ/అభిరుచి వల్ల మీలో ఒత్తిడి తగ్గి, మేధో సామర్థ్యం పెరుగుతుంది. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ గజిబిజి లోకంలో మనస్సుకు నచ్చిన విధంగా మీ అభిరుచి ఎంచుకొని మీ జీవితంలో ఉండే కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు.

healthy-lifestyle-tp-11

క్రొత్త నైపుణ్యం నేర్చుకోండి

     మీరు ఏమైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారా?  సంగీత వాయిద్యాలు వాయించాలనుకున్నారా, ఏమైనా కొత్త పనిని చేయాలన్నా ఇప్పుడే మొదలుపెట్టండి. ఎందుకంటే ఏమైనా నూతన విషయాలు నేర్చుకోవాలంటే మీకుండే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. 

also read  What is Intermittent Fasting in Telugu | ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి

healthy-lifestyle-tp-12

వాయిదా వేయడం ఆపేయండి

     చేసే పనిని లేదా చేయాల్సిన పనిని వాయిదా వేయడం వలన మనకు సోమరితనం అలవాటు అవుతుంది. చేయాల్సిన పనులు, నేర్చుకోవాలని అనుకున్న విషయాలను వాయిదా వేసుకుంటూ పోతుంటే చివరికి మనము ఏది సాధించలేము. కాబట్టి ఇప్పటినుంచైనా వాయిదా వేయడం ఆపేయడం ప్రారంభించండి. 

healthy-lifestyle-tp-13

తక్కువ కేలరీలున్న ఆహారం తినండి

     తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తినాలనే నియమం పాటించడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే ఊబకాయం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ కు గురయ్యే అవకాశముంది. అందుకే ఇన్ని అనర్థాలు ఎదుర్కొనే బదులు తీసుకునే ఆహారంలో కేలరీలు మితంగా ఉండేలా చూసుకోవడం మంచిపని.

healthy-lifestyle-tp-14

వాలంటీర్ 

     మీరు మీ సంఘంలోని సంస్థలలో స్వచ్చందంగా పనిచేసినప్పుడు, మీరు చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతారు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేయడం వలన మనస్సు కు ఉత్సాహం కలుగుతుంది. స్వచ్చందంగా సేవ చేయడం మానవ జీవితానికి సరైన అర్ధం చేకూరుస్తుంది. ఈ విధమైన సేవాభావం కలిగి ఉండటం మీ అత్మగౌరవాన్ని పెంచడంతో పాటు మిమ్మల్ని సంతోషంగా కాలం గడిపేలా చేస్తుంది.      

healthy-lifestyle-tp-15

Healthy Lifestyle

      దీనితో పాటు పుస్తకం చదవడం కూడా ఒక అలవాటుగా పెట్టుకోండి. పుస్తకాలు అంటే ఎగ్జామ్స్ కి చదివే పుస్తకాలు కాదు చదవాల్సింది. ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలు పట్టడమంటే జనాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు, కానీ పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం ఎంతో ఉపయోగపడుతుంది. ఒక మంచి పుస్తకం చదివితే… ఒక మంచి స్నేహితుడితో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. దీనితో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది మరియు చాలా విషియాలు తెలుస్తాయి. వీటి వలన Healthy Lifestyle అలవాటు అవుతుంది.

healthy-lifestyle-tp-16

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular