Saturday, December 21, 2024
Homeభగవద్గీతSrimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 31-47) |...

Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 31-47) | శ్రీమద్భగవద్గీత – అర్జున విషాద యోగము (శ్లోకాలు 31-47)

Srimad Bhagavad Gita Chapter 1 – Arjuna Vishada Yoga (Verses 31-47) : 

అథ ప్రథమోఽధ్యాయః

అర్జున విషాద యోగః

 

శ్లో || నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ! |

       న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజన మాహవే || 31

 

తా || కేశవా! దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. స్వజనాన్ని చంపడంవల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకోలేకుండా వున్నాను.

 

శ్లో || న కాంక్షే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖాని చ |

       కిం నో రాజ్యేన గోవింద! కిం భోగైర్జీవితేన వా || 32

 

తా || ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని, సుఖాలు కాని కోరను. గోవిందా! మనకు రాజ్యం వల్ల గాని, భోగాల వల్ల గాని, జీవించడం వల్ల గాని ప్రయోజనం ఏమిటి?

 

శ్లో || యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా స్సుఖాని చ |

       త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || 33

 

తా || ఎవరికోసం మనం రాజ్యాన్నీ, సుఖభోగాలనీ కోరుకుంటామో, వారు ప్రాణాలనీ, సంపదలనీ త్యజించి ఇక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు.

 

శ్లో || ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః |

       మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధిన స్తథా || 34

 

తా || ఆచార్యులూ, తండ్రులూ, పుత్రులూ అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులును…

 

శ్లో || ఏతాన్న హంతు మిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన! |

       అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 35

 

తా || మధుసూదనా! నేను చంపబడినప్పటికీ, త్రోలోకాధిపత్యానికైనా వీరిని చంపడానికి
ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా
?

 

శ్లో || నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యా జ్జనార్దన |

       పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతా నాతతాయినః || 36

 

తా || జనార్దనా! ధృతరాష్ట్ర కుమారులని చంపడంవల్ల మనకి ఏమి సంతోషం కలుగుతుంది? ఆతతాయుల్ని చంపినా మనకి పాపమే వస్తుంది.

 

శ్లో || తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |

       స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ! || 37

 

తా ||  అందువల్ల మనబంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మనవాళ్ళని చంపుకోవడంవల్ల మనం ఎలా సుఖపడగలము?

 

శ్లో || యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః |

       కులక్షయకృతం దోషం మిత్రద్రోహేచ పాతకమ్ || 38

 

తా || లోభం చేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయంవల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని చూడలేకపోయినప్పటికీ,

 

శ్లో || కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్ |

       కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్దన || 39

 

తా || జనార్దనా! కులక్షయంవల్ల ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగకూడదు?

 

శ్లో || కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః |

       ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోఽభి భవత్యుత || 40

 

తా || కులక్షయం వల్ల సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు యావత్తు కులం అధర్మంవైపు తిరుగుతుంది.

 

శ్లో || అధర్మాభిభవాత్ కృష్ణ! ప్రదుష్యంతి కులస్త్రియః |

       స్త్రీషు దుష్టాసు వార్ ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41

 

తా || కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. వార్ ష్ణేయా! చెడిన స్త్రీల వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది.

 

శ్లో || సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ |

       పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః || 42

 

తా || సాంకర్యంవల్ల కులానికి, కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

 

శ్లో || దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః |

       ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || 43

 

తా || వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాలవల్ల శాశ్వతమైన జాతి ధర్మాలూ, కులధర్మాలూ పెకలింపబడతాయి.

 

శ్లో || ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |

       నరకేఽనియతం వాసః భవతీ త్యనుశుశ్రుమ || 44

also read  Srimad Bhagavad Gita Dhyana Slokas | శ్రీమద్భగవద్గీత (గీతా ధ్యాన శ్లోకాలు)

 

తా || జనార్దనా! కులధర్మాలూ తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరకవాసు లౌతారని విన్నాం.

 

శ్లో || అహో బత! మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |

       యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః || 45

 

తా || అకటా! రాజ్యసుఖం మీద ఆశతో స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనం ఎంత మహాపాపానికి ఒడిగట్టుతున్నాము!

 

శ్లో || యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః |

       ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ || 46

 

తా || ప్రతీకారం చెయ్యక నిరాయుధుడై వున్న నన్ను శాస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో చంపినా, దానివల్ల నాకు ఎక్కువ మేలే కలుగుతుంది.

 

సంజయఉవాచ :

 

శ్లో || ఏవ ముక్త్వాఽర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |

       విసృజ్య సశరం చాపం శోక సంవిగ్నమానసః || 47

 

సంజయుడు అన్నాడు :

తా || అర్జునుడు ఇలా పలికి, శోకంతో నిండిన మనస్సుతో, యుద్ధ భూమిలో బాణాలతో రక్షించే సహా ధనుస్సుని వదిలి రథం  వెనక భాగంలో కూర్చున్నాడు.

 

ఓంతత్సత్,

ఇతి శ్రీ మద్భగవద్గీతాసు,
ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం,

యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, అర్జున విషాదయోగోనామ, ప్రథమోఽధ్యాయః ||

 

 

ఓం తత్సత్, ఇలా భగవద్గీత అనే ఉపనిషత్తులో, బ్రహ్మవిద్యా

యోగశాస్త్రంలో, శ్రీ కృష్ణార్జున సంవాదంలో, అర్జున విషాదయోగమనే

మొదటి అధ్యాయం సమాప్తం.

Previous                                                                                               Next

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular