Friday, November 8, 2024
Homeఆధ్యాత్మికంVaikunta or Mukkoti Ekadasi | వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి

Vaikunta or Mukkoti Ekadasi | వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి

Vaikunta or Mukkoti Ekadasi: సంవత్సరానికి 24 ఏకాదశులు, సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే Vaikunta or Mukkoti Ekadasi అని పిలుస్తారు.

 

Vaikunta or Mukkoti Ekadasi 

     సంవత్సరానికి 24 ఏకాదశులు, సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే Vaikunta or Mukkoti Ekadasi అని పిలుస్తారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠద్వారాలు తెరిచి ఉంటాయని,  వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం గుండా వెళ్ళడానికి ఉదయం నుండే భక్తులు వేచి ఉంటారు. మహావిష్ణువు గరుడ వాహనంపై, మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. ముక్కోటి ఏకాదశి రోజే హాలహలం, అమృతం పుట్టాయి. మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజు భగవద్గీతను ఉపదేశించాడని విశ్వాసం. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.

     విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనపై వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వాళ్ళ కోసం వైకుంఠద్వారాలు తెరిచాడు. తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణువుని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలి అని వారు కోరారు. అందువలనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఏకాదశి రోజున భక్తులు దర్శనం తర్వాత ఉత్తరద్వారం గుండా వెళ్తారు.

     పద్మపురాణం ప్రకారం మహావిష్ణువు నుంచి ఏర్పడిన శక్తి ముర అనే రాక్షసుడిని అంతం చేసిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దుర్మార్గాలను భరించలేని దేవతలు మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. మురని చంపడానికి ప్రత్యేక అస్త్రం కావాలని విష్ణువు బరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి వెళ్తాడు. అక్కడ నిద్రిస్తున్న మహావిష్ణువుని చంపడానికి ప్రయత్నించగా, విష్ణువు నుంచి ఒక శక్తి ఆవిర్భవించి మురను సంహరిచిస్తుం. అప్పుడు మహావిష్ణువు ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి, వరం కోరుకోమని చెప్పాడు. ఈ రోజున ఉపవాసం ఉన్నా వారి పాపాలను తొలగించాలి ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని మహావిష్ణువు వరమిచ్చాడు.

     ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణుపురాణంలో చెప్పబడింది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ గుణాలను ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం అలవాటు అవుతుంది తద్వారా ముక్తికి మార్గం కలుగుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ద్వాదశి రోజు అన్నదానం చేస్తారు. భోజనం ఒకరోజు చేయకపోవడం వలన మరుసటి రోజు భోజనం చేయడం వలన జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. ఈ రోజే గీతోపదేశం జరిగిన రోజు కనుక ‘భగవద్గీత’ పుస్తకాలను దానంగా ఇస్తారు.

వైకుంఠ ఏకాదశి పేరు

     వైకుంఠ ఏకాదశి పేరులో రెండు పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది.

పండుగ విశేషాలు

    Vaikunta or Mukkoti Ekadasi విశేషాలను వివరించే కొన్ని పురాణం కథలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ

     వైఖానసుడునే రాజు పర్వత మహర్షి సూచన మేరకు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. నరక బాధలను అనుభవింస్తున్న రాజు గారి పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారు.

మురాసురుడి కథ

     కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ భాదలను విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుడ్ని సాగరగార్బంలోనుంచి బయటకు రప్పించడానికి ఉపాయాన్ని ఆలోచించి ఒక గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటించాడు మహావిష్ణువు. మహావిష్ణువు నిద్రాపోతున్నాడు అని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే లక్ష్మిదేవి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుడ్ని సంహరిస్తుంది. విష్ణుమూర్తి లేచి లక్ష్మిదేవిని మెచ్చుకొని, తనని ‘ఏకాదశి’ అని పిలిచాడు! అప్పటి నుండి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.

also read  16 Somavarala Vratha Katha | 16 సోమవారాల వ్రత కథ

పుత్రద ఏకాదశి కథ

    Vaikunta or Mukkoti Ekadasi నే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. పూర్వం ‘సుకేతుడు’అనే మహారాజు భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. సుకేతుడి భార్య పేరు చంపక. మహారాణి అయిన కూడా గృహస్థు ధర్మాలను పాటిస్తూ, అతిధులను అభాగ్యులను గౌరవిస్తూ, భర్తను ఆరాధిస్తూ, వ్రతాలు, పుణ్యకార్యాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు తీరిగారు అయిన వారికి పుత్రులు కలగలేదు. చివరకు ఒక పుణ్యతీర్థంలోని మహర్షులను సేవించారు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు ‘పుత్రద ఏకాదశి’ కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంతట ఆ వ్రాత విధానాన్ని మహర్షుల ద్వారా తెలుసుకొని వారి ఆశీస్శులతో వారికి ప్రణమిల్లి వెళ్తాడు. వెంటనే నగరానికి వెళ్ళి జరిగిన విషయాన్నీ తన భార్య ‘చంపక’కి చెప్పాడు. తను సంతోషించి భార్య, భర్త ఇద్దరు భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, ఏకాదశీ వ్రతాన్ని చేసారు. కొంత కాలం తర్వాత వారికి కూమారుడు కలుగుతాడు. పిల్లవాడు పెద్దవాడై తల్లితండ్రుల కోరిక మేరకు యువరాజు అవుతాడు.

పండగ ఆచరించు విధానం

    Vaikunta or Mukkoti Ekadasi రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. ‘లంకణం పరమౌషధ’ మనే నానుడి తెలిసిందే. ఉపవాసం లో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఉపవాసం ఆశయం. ఉపవాసంతో పాటు పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా మనసును దేవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు 

  • దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
  • ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
  • అసత్య మాడరాదు.
  • స్త్రీ సాంగత్యం పనికి రాదు.
  • చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
  • ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
  • అన్నదానం చేయాలి.

 

    Vaikunta or Mukkoti Ekadasi రోజున తెల్లవారి 5 గంటలకే లేచి తలస్నానం చేయాలి. ఇంట్లోని పూజ మందిరమును శుభ్రం చేసి, గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. ముగ్గులు వెయ్యాలి, తోరణాలు కట్టాలి. తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం పెట్టాలి, పూలతో అలంకరించాలి.

     పూజామందిరంలో కలశము పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రాన్ని కప్పి, మామిడిఆకులు, టెంకాయ ఉంచాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు వాడాలి. జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి వెయ్యాలి. పాయసం, తీపిపదార్థాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.

     ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. ఒత్తులు తామర లాగా మరియు ఐదు ఒత్తులు ఉండాలి. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు చేసి మహావిష్ణు పూజ, గోవింద నామ స్మరణ, గీతాపారాయణం, పురాణ పఠనం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. లేకపోతే ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించడం ద్వారా అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణువు ఆలయాలను దర్శించుకోవాలి.

    Vaikunta or Mukkoti Ekadasi రోజున నిష్ఠనియమాలతో వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మరణించే వారికి వైకుంఠ ప్రాప్తిస్తుంది అని, వారి కోసం స్వర్గంలో తలుపులు తెరచి ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.   

తాత్త్విక సందేశం

     విష్ణువు ఉండే ప్రాంతం ఎక్కడో లేదు, మన శరీరమే దేవాలయం అని  శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తులో చెప్పినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). తనలోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఈ ఏకాదశీ వ్రతాన్ని నియమంగా చేయడం. ఉపవాసం వలన ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ, ధ్యానం, జపం వంటి సాధనల పరమాత్మను ఆరాధించండి అని భావం. పంచ జ్ఞానేంద్రియాలు అయిన కళ్లు, నోరు మొదలైనవి, పంచ కర్మేంద్రియాలు అయిన కాళ్లు, చేతులు మొదలైనవి, వీటితో పాటు పదకొండొ ఇంద్రియం అయిన మనస్సుతో మనం పాపాలు చేస్తాం. ఈ ఏకాదశేంద్రియాలను ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిన అయిన ఏకాదశి మాత్రమే అంతం చేయగలదు.అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

also read  Ekadasi Vratha Kathalu | ఏకాదశి వ్రత కథలు

వైకుంఠ ద్వారం

     శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో Vaikunta or Mukkoti Ekadasi ఉత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్నిఅలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళిన భక్తులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

vaikunta-dwaram-telugu-pencil
                                                              Vaikunta or Mukkoti Ekadasi

     తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా  దైవదర్శనంఅనంతరం వైకుంఠద్వారాప్రవేశం అనుమతిస్తారు. ఏకాదశికి ముందురోజు అయిన దశమిరోజు రాత్రి ఏకాంత సేవా అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి ఉంచుతారు. రెండు రోజుల పాటు భక్తులను శ్రీవారి దర్శనం అనంతరం వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తారు.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular