Friday, July 19, 2024
Homeఆధ్యాత్మికంవ్రతాలుSankshtahara Chaturthi Vratham | సంకష్టహర చతుర్థి వ్రతం

Sankshtahara Chaturthi Vratham | సంకష్టహర చతుర్థి వ్రతం

Sankshtahara Chaturthi Vratham :

Sankshtahara Chaturthi Vratham పూజకు కావాల్సిన వస్తువులు

 

దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.

 

మార్జనముమార్జనము

 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః

(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)

 

గణపతిగణపతి ప్రార్దన

 

(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

                                    అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. 

 

ఘంటా నాదంఘంటా నాదం 

 

(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం

కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్

 

ఆచమనము

 

1. ఓం కేశవాయ స్వాహా

2. ఓం నారాయణాయ స్వాహా

3. ఓం మాధవాయ స్వాహా

(పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము చేయాలితర్వాత చెయ్యి కడుగుకోవాలి)

స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.

4. ఓం గోవిందాయ నమః

5. ఓం విష్ణవే నమః

6. ఓం మధుసూదనాయ నమః

7. ఓం త్రివిక్రమాయ నమః

8. ఓం వామనాయ నమః

9. ఓం శ్రీధరాయ నమః

10. ఓం హృషీకేశాయ నమః

11. ఓం పద్మనాభాయ నమః

12. ఓం దామోదరాయ నమః

13. ఓం సంకర్షణాయ నమః

14. ఓం వాసుదేవాయ నమః

15. ఓం ప్రద్యుమ్నాయ నమః

16. ఓం అనిరుద్ధాయ నమః

17. ఓం పురుషోత్తమాయ నమః

18. ఓం అధోక్షజాయ నమః

19. ఓం నారసింహాయ నమః

20. ఓం అచ్యుతాయ నమః

21. ఓం జనార్ధనాయ నమః

22. ఓం ఉపేంద్రాయ నమః

23. ఓం హరయే నమః

24. ఓం శ్రీకృష్ణాయ నమః

 

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

 

(కొంచెం జలం తీసుకొని ఎడమ పక్కకి వదలాలిభార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)

 

ప్రాణాయామముప్రాణాయామము

 

పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం

ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ వశంకరం

(ప్రాణాయామం చేయండి)

 

సంకల్పము

 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ సంకష్టహర గణేశ ప్రీత్యర్థం, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, శుభే శోభనే ముహూర్తే, శుభనక్షత్రే, శుభయోగే, శుభ కరణే, ఏవం గుణ వేశాషణా విశిష్టాయాం శుభ తిధౌ, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధంధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థంధన ధాన్య సమృధ్యర్ధంఇష్ట కామ్యార్థ సిధ్యర్థంసకల లోక కల్యాణార్ధంసర్వ విఘ్న నివారణార్ధంవేద సంప్రదాయాభివృద్యర్ధంఅస్మిన్ దేశే గోవధ నిషేధార్ధంగో సంరక్షణార్ధం, ధన కనక వస్తు వాహనాది సమృధ్యర్థం, సహకుటుంబానాం సర్వతోముఖాభి వృధ్యర్థం, సంకష్టహర గణేశ వ్రతోక్త సమస్త ఫలా వ్యాప్త్యర్ధం, శ్రీ సంకష్ట హర గణపతి దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

 

(కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి)

 

కలశారాధనకలశారాధన

 

కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

                           గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

                           నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు

                           పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య

 

(పచ్చకర్పూరంతులసి దళంఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలినీళ్ళు మనమీదకుడివైపు చల్లుకోవాలి)

 

గణపతి పూజ

ఆదౌ నిర్విఘ్నం పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే

 1. శ్రీ మహాగణపతయే నమః – ధ్యాయామి
 2. శ్రీ మహాగణపతయే నమః – ఆవాహయామి
 3. శ్రీ మహాగణపతయే నమః – ఆసనం సమర్పయామి
 4. శ్రీ మహాగణపతయే నమః – పాదయోః పాద్యం సమర్పయామి
 5. శ్రీ మహాగణపతయే నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
 6. శ్రీ మహాగణపతయే నమః – ఆచమనీయం సమర్పయామి
 7. శ్రీ మహాగణపతయే నమః – స్నానం సమర్పయామి
 8. శ్రీ మహాగణపతయే నమః – వస్త్ర యుగ్మం సమర్పయామి
 9. శ్రీ మహాగణపతయే నమః – యజ్ఞోపవీతం సమర్పయామి
 10. శ్రీ మహాగణపతయే నమః – గంధం సమర్పయామి
 11. శ్రీ మహాగణపతయే నమః – పుష్పాణి సమర్పయామి
 12. శ్రీ మహాగణపతయే నమః – ధూపమాఘ్రాపయామి
 13. శ్రీ మహాగణపతయే నమః – దీపం దర్శయామి
 14. శ్రీ మహాగణపతయే నమః – నైవేద్యం సమర్పయామి

(సత్యం త్వర్తేన పరిషం చామి అమృతమస్తు అమృతోపస్తర ణమసి (ప్రాణాయ స్వాహా – అపానాయ స్వాహా – వ్యానాయ స్వాహా – ఉదానాయ స్వాహా – సమానాయ స్వాహా)

 1. శ్రీ మహాగణపతయే నమః – తాంబూలం సమర్పయామి
 2. శ్రీ మహాగణపతయే నమః – నీరాజనం సమర్పయామి
 3. శ్రీ మహాగణపతయే నమః – మంత్ర పుష్పం, నమస్కారం సమర్పయామి

అనయా, యథా శక్తి పూజాయచ – శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు, శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృణ్హామి 

 

శ్రీ సంకష్టహర గణపతి షోడశోపచార పూజ 

 

ధ్యానం 

 

శ్లోకం
బాలార్కారుణ కాంతిః వామే బాలాం వహన్నం
కేల్లసద్ ఇందీవర హస్తాం గౌరాంగీం రత్న శోభాఢ్యమ్
దక్షిణే అంకుశ వరదానం వామే పాశం చ పాయస పాత్రమ్
నీలాంశుకర సమానః పీఠే పద్మారుణీ తిష్టన్ సంకట హరణః 
పాయత్ సంకట పూజాత్ గజాననో నిత్యః 

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ధ్యాయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

ఆవాహనం

 

శ్లోకం
ఆగచ్చ విఘ్నరాజేంద్ర స్థానే చాత్ర స్థిరో భవ
ఆరాధయిష్వే భక్తాహం భవంతం సర్వసిద్ధిదం

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ఆవహయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

ఆసనం

also read  Srinivasa Vidya Mantra | శ్రీనివాస విద్య మంత్ర

 

శ్లోకం
విచిత్ర రత్న ఖచితం దివ్యాంబర సంయుతం
స్వర్ణ సింహాసనం చారు గృహాణ సురపూజిత 
ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

పాద్యం

 

శ్లోకం
సర్వ తీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం
విఘ్నరాజ గృహాణేదం భగవన్ భక్తవత్సల

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

అర్ఘ్యం

 

శ్లోకం
రక్త గంధాక్షతోపేతం రక్తపుష్పైః సుపూజితం
మయా దత్తం సురశ్రేష్ట సోమార్ధధారిణే నమః

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

ఆచమనీయం

 

శ్లోకం
విఘ్నేశ దేవదేవేశ సర్వసిద్ది ప్రదాయక
మయా దత్తం గజముఖ గృహాణాచమనీయకం

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

పంచామృత స్నానం

 

శ్లోకం

పాలు: కామధేను సముద్భూతం పరమం పావనం పయః
         తేన స్నానం కురుష్వత్వం హేరంబ గణనాయక
పెరుగు: చంద్రమండల సంకాశం సర్వదేవప్రియం దధి
           స్నానార్థం తే ప్రయఛ్ఛామి గృహాణ గణనాయక
నెయ్యి: ఆజ్యం సురాణామాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్టితం
         స్నానార్థం తే ప్రయఛ్ఛామి గృహాణ గణనాయక
తేనె: సర్వౌషధి సముద్భూతం పీయూష మధురం మధు
      స్నానార్థం తే ప్రయఛ్ఛామి గృహాణ గిరిజాసుత
పంచదార: ఇక్షుదండ సముద్భూతం దివ్యశర్కరయాహి అహం
              స్నాపయామి మహాభక్త్యా ప్రీతోభవ శివాత్మజ

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి

(జలం సమర్పించవలెను)

 

శుద్ధోదక స్నానం

 

శ్లోకం
గంగాదిసర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమం
భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయాభీష్టదాయక

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః శుద్దోదకస్నానం సమర్పయామి

 

వస్త్రం

 

శ్లోకం

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం

శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః నూతన వస్త్రయుగ్మం సమర్పయామి

వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

యజ్ఞోపవీతం

 

శ్లోకం
కుంకుమాక్తం మయా దేవ ఉపవీతం గణాధిప,
ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి

 

గంధం

 

శ్లోకం

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం

గంధం గృహాణ దేవేశ సర్వసిద్ధిప్రదాయక

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి

(దేవుని పటాలకువిగ్రహాలకు గంధంకుంకుమ పెట్టాలి)

 

అక్షతలు

 

శ్లోకం
శాలీయాన్ తండులాన్ శ్వేతాన్ రక్తచందన మిశ్రితాన్
గృహాణ విఘ్నరాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

పుష్పం

 

శ్లోకం
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో
మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతామ్

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి

(పుష్పాలు సమర్పించవలెను)

 

గణపతి అంగపూజ

 

గణేశాయ నమః               – పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః           – జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః          – జంఘే పూజయామి

ఆఖువాహనాయ నమః       – ఊరుం పూజయామి

హేరంబాయ నమః            – కటిం పూజయామి

లంబోదరాయ నమః          – ఉదరం పూజయామి

గణనాథాయ నమః            – నాభిం పూజయామి

గణేశాయ నమః               – హృదయం పూజయామి

స్థూల కంఠాయ నమః        – కంఠం పూజయామి

స్కందాగ్రజాయ నమః        – స్కంధౌ పూజయామి

పాశహస్తాయ నమః          – హస్తౌ పూజయామి

గజవక్త్రాయ నమః            – వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః           – నేత్రే పూజయామి

శూర్పకర్ణాయ నమః         – కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః       – లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః         – శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః    – సర్వాణ్యంగాని పూజయామి

 

శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి

 

ఏకవింశతి పుష్ప పూజ

 

 1. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి
 2. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి
 3. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి
 4. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
 5. హరసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి
 6. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి
 7. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి
 8. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి
 9. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి
 10. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి
 11. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి
 12. వటవే నమః దాడిమీపత్రం పూజయామి
 13. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి
 14. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి
 15. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి
 16. శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి
 17. సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
 18. ఇభవక్తాయ నమః శమీపత్రం పూజయామి
 19. వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
 20. సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
 21. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి

శ్రీ సంకష్ట హర గణేశ్వరాయనమః ఏకవింశతిపత్రాణి పూజయామి

 

శ్రీ గణేశాష్టోత్తరశతనామావళిః చదవాలి 

 

సంకటనాశన గణేశ స్త్రోత్రం

నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్
లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తథాష్టమమ్
నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకమ్
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరం
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధి కరం ప్రభో
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రమ్, షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః

గౌరీ పూజ

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృత శేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్
సింహస్కంధ సమారూఢాం నానాలంకార భూషితాం
చతుర్భుజాం ముహాదేవీం నాగయజ్ఞోప వీతినమ్
శంఖ శారంగ సమాయుక్త వామపాణి ద్వయాన్వితాం
చక్రం చ పంచబాణాం శ్చ దధతీం దక్షిణే కరే
రక్త వస్త్ర పరీధానాం బాలార్క సదృశీం తనుం
నారదా ద్యైర్ ముణిగణైః సేవితాం భవ సుందరీమ్
త్రివళ వలయోపేతాం నాభినాళ మృణాళినీం
రత్న ద్వీపే మహాద్వీపే సింహాసన సమన్వితే
ప్రఫుల్ల కమలారూఢాం ధ్యాయేత్ తాం భవగేహినీమ్
నమస్తేస్తు మహాదేవి కృపయా పాహిన స్సదా
విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం
లక్ష్మీప్రదాన సమయే నవ విద్రుమాభాం
విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం
దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే

also read  Significance Of Ugadi | ఉగాది ప్రాముఖ్యత

ఓం గౌర్యై నమః ప్రార్ధనా నమస్కారాన్ సమర్పయామి
సమస్త షోడశోపచారాన్ మనసా సమర్పయామి
సమస్త దేవోపచార రాజోపచార శక్త్యా పచార భక్త్యా పచార విశేషైః: పూజయామి.

 

ధూపం

 

శ్లోకం

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం

ఉమాసుత  నమస్తుభ్యం గృహాణ వరదో భవ

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ధూపం అఘ్రాపయామి

(ధూపం చూపించాలి)

 

దీపం

 

శ్లోకం

సాద్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా

గృహాణ మంగళం దీపం మీశపుత్ర నమోస్తుతే

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః దీపం దర్శయామి

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

(దీపం చూపిస్తూ గంట వాయించాలి)

 

నైవేద్యం

 

శ్లోకం

సుగన్ధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్

నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్

భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ

ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః నైవేద్యం సమర్పయామి

 

సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)

అమృతమస్తు అమృతోపస్తరణమసి

 

(జలం సమర్పిస్తూ చదవాలి)

ఓం ప్రాణం నమః  – అపానం నమః – వ్యానం నమః

ఉదానం నమః – సమానం నమః

 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి

ఉత్తరా పోశనం సమర్పయామిహస్తౌ
ప్రక్షాళనం సమర్పయామి
పాద
ప్రక్షాళనం సమర్పయామి
శుద్ధాచమనీయం సమర్పయామి

 

తాంబూలం

 

శ్లోకం

పూగీఫలైస్సకర్పూరైః నాగావల్లీ దళైర్యుతం

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి

(తాంబూలం సమర్పించవలెను)

 

నీరాజనం

 

శ్లోకం

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం (స్తధా)

నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి

నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి

(కర్పూరంతో హారతి ఇవ్వాలి)

 

దూర్వాయుగ్మ పూజ

 

    1.   గణాధిపాయ నమః                   దూర్వాయుగ్మం పూజయామి

    2.   ఉమాపుత్రాయ నమః                దూర్వాయుగ్మం పూజయామి

    3.   అఖువాహనాయ నమః              దూర్వాయుగ్మం పూజయామి

    4.   వినాయకాయ నమః                 దూర్వాయుగ్మం పూజయామి

    5.   ఈశపుత్రాయ నమః                  దూర్వాయుగ్మం పూజయామి

    6.   సర్వసిద్ది ప్రదాయకాయ నమః      దూర్వాయుగ్మం పూజయామి

    7.   ఏకదంతాయ నమః                   దూర్వాయుగ్మం పూజయామి

    8.   ఇభవక్త్రాయ నమః                    దూర్వాయుగ్మం పూజయామి

    9.   మూషిక వాహనాయ నమః          దూర్వాయుగ్మం పూజయామి

    10.  కుమారగురవే నమః                దూర్వాయుగ్మం పూజయామి

 

 ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

 

మంత్రపుష్పం – నమస్కారం 

 

(పుష్పాలుఅక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)

 

శ్లోకం

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ

నమో నమస్తే విఘ్నేశ సర్వవిఘ్నం నివారయ

నమస్యరోమి విఘ్నేశ సర్వకామార్ధ సిద్ధయే

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

 

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ

సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి

(చామరం వియాలి)

 

క్షమాప్రార్థన

 

యస్యస్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం

 

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే

 

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః

శ్రీ సంకష్టహర గణేశ్వరా దేవతా సుప్రసన్నః  స్సుప్రీతో వరదో భవంతు

శ్రీ సంకష్టహర గణేశ్వరా ప్రసాదం శిరసా గృహ్ణామి

 

అర్ఘ్యములు

అస్మత్ ఆచరిత వ్రత సంపూర్ణ ఫల సిత్యర్ధం గణపతి చంద్రార్ఘ్యం అహం కరిష్యే

(చేతిలోకి అక్షతలూ పూవులూ జలం తీసుకొని, ఈ క్రింద ఇచ్చిన గణపతి అర్ఘ్యాలని ఒక్కొక్కటీ 4 సార్లు ఇవ్వాలి )

గౌరీ సుత నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక
సర్వసంకట నాశార్థం గృహాణార్య్యం నమోస్తుతే
శ్రీ సంకష్ట హర గణపతయే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి (4 times)

విఘ్న నాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం
త్వత్ ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహమ్ 
శ్రీ సంకష్ట హర గణపతయే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి (4 times)

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన
శ్రీ సంకష్ట హర గణపతయే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి (4 times) 

కుడి చేతిలోకి తెల్ల బియ్యమూ, ఆవు పాలూ తీసుకొని, ఈ క్రింద ఇచ్చిన చంద్రుడి అర్ఘ్యాలని ఒక్కొక్కటీ 1 సారి ఇవ్వాలి

క్షీరో దార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ
గృహాణార్వ్యం మయాదత్తం రోహిణ్యా సహిత ప్రభో
శ్రీ రోహిణీ చంద్రమసే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి

నమస్తే రోహిణీశాయ సుధారూప నిశాకర
గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే
శ్రీ రోహిణీ చంద్రమస్తే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి

క్షీర సాగర సంభూత సుధారూప నిశాకర
గృహాణార్భ్యం మయాదత్తం రమానుజ నమోస్తుతే
శ్రీ రోహిణీ చంద్రమసే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ శ్రీ సంకష్టహర గణపతి దేవతా సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు 

 

తీర్థం

అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం

(తీర్థం తీసుకోవాలి)

 

ఉద్వాసన

 

శ్లోకం

నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్ననాశన

బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గఛ్చదేవ యధా సుఖం

ఉపచారం

శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యధాస్థానం ఉద్వాసయామిపునరాగమనాయచ

 

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా

గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు

కలే వర్షతు పర్జన్యః  పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః

అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః

అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం 

 

ఓం శాంతిః శాంతిః శాంతిః 

సర్వేజనాః సుఖినో భవంతు.

 

చూడండి సంకష్టహర చతుర్థి కథ 

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular