Wednesday, September 18, 2024
Homeఆధ్యాత్మికంHanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస్)

Hanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస్)

Hanuman Chalisa ను ఒక్కసారి మనస్పూర్తిగా చదివినా, విన్న కూడా మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు, దృష్తి దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే హనుమంతుడు అంటేనే కొండత ధైర్యం, బలం, అండ అంతే కాకుండా ఈ Hanuman Chalisa లో ఆంజనేయస్వామి తో పాటు శ్రీరాముల వారిని  కూడా అనేక విధాలుగా స్తుతించడం జరిగింది. Hanuman Chalisa ని రచించినది గోస్వామి తులసీదాస్. ఈ Hanuman Chalisa ని తులసీదాస్ అరబీ భాషలో రచించారు. Hanuman Chalisa లో చాలీసా అంటే 40 అని అర్థం. అంటే ఈ Hanuman Chalisa 40 చౌపాఈలు ఉంటాయి. ఇలా Hanuman Chalisa మొత్తం 40 చౌపాఈలు, వాటికి ముందు ఒక దోహా చివరలో ఒక దోహా ఉంటుంది.

Hanuman Chalisa పఠించడం వలన జీవితం సంతోషంగా ఉంటుంది, అన్ని సమస్యలు పరిష్కారించబడుతాయి, ప్రతికూల పరిస్థితులు దూరం అవుతుంది. Hanuman Chalisa ను పఠించి, ప్రతి దినం హనుమంతుని ఆశీర్వాదాన్ని పొందండి. 

 

Hanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస్)

 

దోహా:
శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫలచారి ||

అర్థం:  శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరచుకొని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రామచంద్రుని కీర్తిని నేను తలచెదను.

బుద్ధిహీన తను జానికే
సుమిరౌ పవనకుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేశ వికార ||

అర్థం: బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ ఆంజనేయా నిన్ను నేను స్మరిస్తున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.

ధ్యానం:
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే – (అ)నిలాత్మజమ్ ||  

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ || 

అర్థం:  సముద్రమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా, రాక్షసులను దోమలలాగా నలిపినవాడా, రామాయణం అనే మహామాలలో రత్నము వంటి వాడా, వాయుపుత్రుడా, నీకు నమస్కారము.

ఎక్కడెక్కడ శ్రీ రామచంద్రుని కీర్తింపబడతాడో అక్కడక్కడ నీళ్ళు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారము చేస్తూ ఉంటావు. రాక్షాసుల అంతు చూసే వాయుపుత్రా, నీకు నమస్కారము.

 

చౌపాఈ:
జయ హనుమాన జ్ఞానగుణసాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 

అర్థం: ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపచేసే నీకు జయము జయము.

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా || 2 

అర్థం: నీవు శ్రీరామచంద్రునికి దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుతడను నామము కలవాడవు.

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ || 3 

అర్థం: నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 

అర్థం: బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై || 5 

అర్థం: ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.

శంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగవందన || 6 

అర్థం: శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి లోకములు వందనము చేసినవి.

విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 

అర్థం: విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా || 8 

అర్థం: శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, సీతారామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప ధరి లంక జరావా || 9 

also read  Sri Krishna Shodashopachara Pooja | శ్రీకృష్ణ షోడశోపచార పూజ

అర్థం: సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.

భీమరూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 

అర్థం: మహాబలరూపమును ధరించి లంకలో ఉన్న రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి వుర లాయే || 11 

అర్థం: సంజీవని మూలిక తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || 12 
[** పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి **]

అర్థం: అంత ఆనందంలో ఉన్న శ్రీరామచంద్రుడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.

సహస వదన తుమ్హరో యశ గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 

అర్థం: వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరామచంద్రుడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 

అర్థం: సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ, కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా || 16 

అర్థం: నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటి అంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయె సబ జగ జానా || 17 

అర్థం: నీ ఆలోచనను విభీషణుడు పాటించి లంకకు రాజు అయిన సంగతి లోకంలో అందరికి తెలుసు.

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 

అర్థం: రెండువేల యోజనములు అనగా 16వేల మైళ్ళ దూరములో ఉన్న భానుడిని (సూర్యుడిని) తీయని పండుగా అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 

అర్థం: అలాంటిది శ్రీరామచంద్రుని ఉంగరమును నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దాటితివి అంటే ఆశ్చర్యం ఏముంది?

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 

అర్థం: లోకంలో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహము వలన సుగమం కాగలవు.

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే || 21 

అర్థం: శ్రీరాముని ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి (నీ అనుగ్రహం లేకుండా శ్రీరాముని కృప దొరకదు).

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డరనా || 22 

అర్థం: నీ శరణు కోరిన వారికి సమస్త సుఖములు లభించును. నీవు రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?

ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || 23 

అర్థం: నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.

భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై || 24 

అర్థం: ఓ మహావీరా! అనే నీ నామము పలికితే భూతములు, ప్రేతములు దగ్గరకు రావు.

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 

అర్థం: ఓ హనుమంతా!  వీరా! నీరంతరం నీ జపము వలన రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి.

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 

అర్థం: ఓ హనుమంతా, మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే నీవు వారిని సంకటముల నుంచి  విముక్తునిగా చేయగలవు.

సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || 27 

అర్థం: అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరామచంద్రుడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై || 28 

also read  Significance of Maha Shivaratri | మహా శివరాత్రి ప్రాముఖ్యత

అర్థం: ఎవరైనా కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి వారి జీవితంలో ఆ కోర్కెలతో పాటు అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 

అర్థం: నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.

సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 

అర్థం: సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను నాశనం చేసినవాడవు, శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడవు.

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అసవర దీన్హ జానకీ మాతా || 31 

అర్థం: అష్ట (ఎనిమిది) సిద్ధులను, నవ (తొమ్మిది) నిధులను ఇవ్వగలిగిన శక్తి నీకు జానకీమాత వరంగా ఇచ్చినది.

రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || 32 

అర్థం: నీ దగ్గర శ్రీరామ రసామృతం ఉన్నది. అందు వలన ఎల్లప్పుడు నీవు శ్రీరామచంద్రుని దాసునిగా ఉండగలవు.

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 

అర్థం: నీ భజన వలన రామానుగ్రహముపొంది, జన్మ జన్మలలో దుఃఖముల నుండి విముక్తి పొందెదను.

అంతకాల రఘుపతి పుర జాయీ | [** రఘువర **]
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 

అర్థం: మరణించిన తర్వాత వైకుంఠంకి వెళితే, తర్వాత మరల జన్మించినచో వారిని హరిభక్తుడని ప్రసిద్ధి చెందుతారు.

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వసుఖకరయీ || 35 

అర్థం:  హనుమంతుడిని ధ్యానించిన వారికి ఇతర దేవతలను తలుచుకునే అవసరం లేకుండా సర్వసుఖాలు కలిగించగలడు.

సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || 36 

అర్థం: ఎవరైతే మహాబల వీరుడైన హనుమంతుని స్మరిస్తారో వారి  కష్టాలు తొలగిపోతాయి, పీడలన్నియు నశించును.

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరహు గురు దేవ కీ నాయీ || 37 

అర్థం: ఓ ఆంజనేయ నీకు జయము జయము జయము. గురుదేవుల వలె మా యందు కృపను చూపుము.

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ || 38 

అర్థం: ఎవరైతే Hanuman Chalisa ను వందసార్లు పఠిస్తారో వారు అన్ని బంధనముల నుండి విముక్తి పొంది, మహా సుఖవంతులు అవుతారు. 

జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || 39 

అర్థం: ఎవరైతే ఈ Hanuman Chalisa ను చదువుతారో, వారికి  పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును.

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 

అర్థం: తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).

దోహా:
పవనతనయ సంకట హరణ
మంగళ మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

అర్థం: పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular